twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్రమ్ సినిమాలో సంపూర్ణేష్ బాబు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘హృదయ కాలేయం' సినిమాతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రం తర్వాత మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘కరెంటు తీగ' చిత్రంలో, త్వరలో రాబోతున్న అల్లరి నరేష్ ‘బందిపోటు' చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. వీటితో పాటు హీరోగా ‘కొబ్బరి మట్ట'లోనూ నటిస్తున్నాడు.

    తాజా సంపూర్ణేష్ బాబు తమిళ స్టార్ విక్రమ్ నటిస్తున్న చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘10 ఎంరాదుకుల్లా' చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో సంపూ కనిపిస్తాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Sampoornesh Babu

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    సంపూర్ణేష్ బాబు నటిస్తున్న సింగం-2 విశేషాల్లోకి వెళితే ఈ చిత్రాన్ని మంచు విష్ణు తమ 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. తమిళ హిట్ సింగం కి స్పూఫ్ లా ఉంటుందని వినికిడి. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు...కొబ్బరి మట్ట అనే చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలాగే...సంపూర్ణేష్ బాబు హీరోగా... వైరస్ డాట్ కామ్ అనే పేరుతో ఓ వినూత్న చిత్రం తెరకెక్కుతోంది. (బి వేర్) అనేది ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రానికి సీ.హెచ్. శివరామకృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ఎ.ఎస్.ఎన్ ఫిల్మ్స్ పతాకంపై సలీం, ఎ.జె. రాంబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు.

    English summary
    Latest buzz in film nagar, Sampoornesh Babu has bagged a crucial role in Vikram’s upcoming film “10 Enradhukulla”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X