»   » ఆడియో ఫంక్షన్లో తుపాకితో సమంత హల్‌చల్ (ఫోటోస్)

ఆడియో ఫంక్షన్లో తుపాకితో సమంత హల్‌చల్ (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత, నిర్మాత అల్లు అరవింద్ మరికొందరు ఆడియో ఫంక్షన్లో చేత్తో తుపాకులు పట్టుకుని పేలుస్తూ హల్ చల్ చేసారు. ఇదంతా ‘శంకరాభరణం' మూవీ ఆడియో వేడుకలో జరిగిన సందడిలో భాగమే. కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి సినిమా బేనర్లో నిఖిల్, నందిత హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘శంకరాభరణం'. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుక శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు అల్లు అరవింద్, హీరోయిన్ సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరవింద్ సీడీలు ఆవిష్కరించగా సమంత తొలి సీడీ అందుకున్నారు. వీరితో పాటు కె విశ్వనాథ్, వివి వినాయక్, జీవిత రాజశేఖర్, అంజలి, బాబీ, శ్రీవాస్, గోపీచంద్ మలినేని, అనీల్ సుంకర, మారుతి, బాబా సెహగల్ అతిథులుగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ గారి వల్లనే సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఆయనకు స్పెషల్ థాంక్స్. అంజలి నాపై అభిమానంతో నేను అడగ్గానే ఓ ముఖ్యమైన పాత్రలో నటించడానికి ఒప్పుకుంది. సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ ప్రతి ఫ్రేమ్ రిచ్ గా చూపించారు. బాలీవుడ్ మూవీ ‘ఫస్ గయా ఒబామా' సినిమా చూసి ఆ పాయింటుని బేస్ చేసుకుని ఈకథను అల్లాను. బీహార్ బ్యాక్ డ్రాపులో సాగే ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఉదయ్ ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నిఖిల్, నందిత చాలా బాగా నటించారు అన్నారు.


స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోస్...


ఆడియో రిలీజ్

శంకరాభరణం ఆడియో విడుదల కార్యక్రమంలో గన్ పేలుస్తున్న సమంత, అరవింద్


ఆవిష్కరణ

ఆడియో సీడీలను అల్లు అరవింద్ ఆవిష్కరించగా, తొలి సీడీ సమంత అందుకున్నారు.


సీడీలు

సీడీ ఆవిష్కరణ అనంతరం ఫోటోజులు పోజులు ఇస్తున్న యూనిట్ మెంబర్స్


గన్ తో కళాతపస్వి

శంకరాభరణం ఆడియో వేడుక కార్యక్రమంలో గన్ చేతపట్టిన కళాతపస్వి కె.విశ్వనాథ్.


బందిపోటు రాణి

ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేసిన సుమ కూడా బందిపోటు రాణి గెటప్ లో కనిపించడం గమనార్హం.


సమంత సెల్ఫీ

శంకరాభరణం ఆడియో వేడుకలో చిన్నారి అభిమానితో సమంత సెల్పీ.


గ్యాంగ్

సినిమా బీహార్ గ్యాంగ్ నేపథ్యంలో సాగుతుంది. అందుకే అదే థీమ్ తో ఆడియో వేడుక ప్లాన్ చేసారు.


సమంత, అంజలి

శంకరాభరణం ఆడియో వేడుకలో హీరోయిన్లు సమంత, అంజలి


Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos