twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇవి సంస్కారీ ముద్దులేనా? , ఇంత హాట్ లిప్ కిస్ ల మీద ఆయన అభిప్రాయం అదా..?

    ఇక ‘భేఫికర్’ విషయంలో మాత్రం భేఫికర్ గా వ్యవహరిస్తూ.. ముద్దు సీన్లను యధేచ్ఛగా వదిలేసి, దానికి యూ/ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అదేమంటే.. ఇప్పుడు కొత్త రీజన్లు చెబుతున్నాడట నిహ్లానీ.

    |

    నిన్న మొన్నటి వరకు మా సినిమాలో 28 లిప్ లాక్ సీన్లే ఉన్నాయని అన్నారు బేఫికర్ చిత్ర యూనిట్ కానీ సెన్సార్ ముందుకు వచ్చాక మాత్రం లిప్ లాక్ సీన్ల సంఖ్య 40 కి పెరిగింది . బేఫికర్ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు 40 లిప్ లాక్ సీన్ల ని చూసి షాక్ అయ్యారట కానీ ఆ సీన్లన్నీ కూడా సందర్భాను సారం వచ్చేవే కాబట్టి ఆ లిప్ లాక్ లకు కత్తెర వేయకుండా యు / ఏ సర్టిఫికేట్ ఇచ్చారాట . ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ వీర్ సింగ్ - వాణీ కపూర్ జంటగా నటించారు . అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ బేఫికర్ చిత్రాన్ని డిసెంబర్ 9 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే 40 లిప్ లక్ సీన్లున్న సినిమాలో ఒక్క లిప్ లాక్ ని కూడా సెన్సార్ చేయకపోవడం సంచలనం సృష్టిస్తోంది .

    పంహ్లాజ్ నిహ్లానీ.. సెన్సార్ బోర్డు కు చైర్మన్ లుగా వ్యవహరించిన వాళ్లలో మరెవరి పేరూ ఇంతలా మీడియాలో నానలేదేమో! బహుశా ఈయన తప్ప ఇన్ని వివాదాలను సృష్టించిన సీబీఎఫ్ సీ బోర్డు చైర్మన్ మరొకరు లేకపోవచ్చు. ఉడ్తా పంజాబ్ సినిమా విషయం లో దేశంలో కొత్త రాజకీయ పోరాటానికే తెర తీశాడు నిహ్లానీ.ఆ సమయం లో ఇండియన్ సినిమా కి ఒక విలన్ గా మారిపోయారు. కొన్ని నెలల క్రితం 'ఉడ్తా పంజాబ్' పట్ల నిహ్లానీ అనుసరించిన వైఖరి దేశవ్యాప్తంగా చర్చా వస్తువుగా మారిపోయింది. అడల్ట్ కంటెంట్ పట్ల చాలా నిక్కచ్చిగా ఉండే ఆయన షరీఫ్ డి రగ్నేకర్ రూపొందించిన 'మిస్ యు' అనే స్వలింగ సంపర్కుల గూర్చిన మ్యూజిక్ వీడియోకు లేటెస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిహలానీ ఈ వీడియోకు అనుమతి ఇవ్వడమే తాజాగా చర్చనీయాంశమైంది. ఇక ఆవిషయం సద్దుమణగకముందే ఇప్పుడు బేఫికర్ వివాదం చుట్టుకుంది ఈ సంస్కారీ అధికారిని

    ఉడ్తాపంజాబ్ :

    ఉడ్తాపంజాబ్ :

    ఆ మధ్య జేమ్స్ బాండ్ మూవీ ‘స్పెక్టర్' లో ముద్దు సీన్లను సెన్సార్ చేయించడం ద్వారా తొలి సారి నిహ్లానీ సంస్కారీ రూపంపై చర్చ జరిగింది. ఇక ‘ఉడ్తాపంజాబ్' విషయంలో సెన్సార్ తీరు పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. బీజేపీ పాలనా భాగస్వామిగా ఉన్న పంజాబ్ లో అసలు విషయాల గురించి చర్చను నిహ్లానీ వంటి వారు ఇష్టపడలేదు. ఆ సినిమాను ముప్పు తిప్పలు పెట్టారు.
     సంస్కారీ జేమ్స్ బాండ్:

    సంస్కారీ జేమ్స్ బాండ్:


    సంస్కారి అన్న పదానికి కేంద్ర సెన్సార్‌ బోర్డు అధ్యక్షుడు పహ్లజ్‌ నిహలానికి చాలా అనుబంధం ఏర్పడింది. జేమ్స్‌ బాండ్‌ చిత్రంలో పలు దృశ్యాలకు కత్తెర వేసిన ఆయనపై సోషల్‌ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. నెటిజెన్లు వ్యంగ్యంగా ఇంగ్లిష్‌ సినిమా పేరునే సంస్కారీ జేమ్స్‌బాండ్‌గా మార్చేశారు. 28 పదాలను వాడరాదని నిషేధిస్తూ ఆయన చలనచిత్ర దర్శకులకు, నిర్మాతలకు ఒక తాఖీదు కూడా పంపారు. తీవ్ర నిరసన వ్యక్తంకావడంతో దానిని ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత పంజాబ్‌లోని విష సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ‘ఉడ్తాపంజాబ్‌'ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ సమయంలో సెన్సార్‌ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ సారి మాత్రం ముంబై హైకోర్ట్ గట్టిగానే మొట్తతటం తో కాస్త నెమ్మదించాడు.

    ఎన్నో సినిమాలు:

    ఎన్నో సినిమాలు:

    ఎన్నో దశాబ్దాల క్రితం వచ్చిన చిన్న పిల్లల కథ జంగిల్ బుక్ తెలుసు కదా . తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి అడవిలో చేరిన ఓ చిన్నారి, అక్కడి జంతువులతో కలసిపోయి ఎలా ఎదిగాడన్న స్టోరీ. పిల్లలకు ఎంతో ఆసక్తికరమైన పాత్రలతో తీర్చిదిద్దిన ఈ కథపై గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.
     యూ/ఏ సర్టిఫికెట్:

    యూ/ఏ సర్టిఫికెట్:


    ఆ కోవలో ఈ స్టోరీని పూర్తి రియల్ టైమ్ మూవీగా చేస్తూ, డిస్నీ నిర్మించిన తాజా చిత్రం 'జంగిల్ బుక్'కు భారత సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడైతే మామూలు విమర్శలు రాలేదు. ఈ సినిమా పిల్లలను భయపెడుతుందని చెప్పిన సెన్సార్ చీఫ్ ప్రహ్లాద్ నిహలానీ, 3డీలో సినిమా చూస్తుంటే, నిజమైన జంతువులు మీదకు దూకినట్టుగా అనిపిస్తోందని, ఈ కారణంతోనే పిల్లలు భయపడతారని భావిస్తున్నామని చెప్పిన మాటల మీద ట్విట్తర్, ఫేస్బుక్ లలో విపరీతమైన జోకులు పేలాయి.

     వేళాకోళం చేస్తున్నారు:

    వేళాకోళం చేస్తున్నారు:


    మొదట్లో బాండ్ విషయం లో బాగానే సమర్థించుకున్నాడు నిహ్లానీ ఆయన మాటల్లోనే చూస్తే ....అసభ్యత, అశ్లీలత పట్ల కఠినంగా వ్యవహరిస్తాననే నాకు ఈ పదవినిచ్చారంటే.. కాదు, నేను ఏ విషయంలోనూ అలా కఠినంగా ఉండను. ఒకవేళ అలా ఉండుంటే చాలా సినిమాలు తిరస్కారానికి గురయ్యేవి.స్పెక్టర్‌లో ముద్దు సీన్‌కు కోత పెట్టినందుకు ‘సంస్కారీ బాండ్‌' అంటూ వేళాకోళం చేస్తున్నారు. కానీ.. గతంలో వచ్చిన రెండు బాండ్‌ సినిమాల్లోనూ ‘సన్నిహిత దృశ్యాల'ను అప్పటి బోర్డులు అనుమతించలేదు.

     ఇండియా అంటే ఏమిటో తెలియదు:

    ఇండియా అంటే ఏమిటో తెలియదు:


    ఈ ఇంటర్‌నెట్‌ యుగంలో సీబీఎ్‌ఫసీ చాలా ఉదారంగా ఉండాలనే సలహా విషయానికొస్తే.. అది నా చేతుల్లో లేదు. ప్రభుత్వం చేతుల్లో ఉంది. నేను నిబంధనలను పాటించాలి. అవతలి వ్యక్తులు పాటంచేలా చూడాలి. ఇది నా సిద్ధాంతం. (అశ్లీలం విషయంలో) లక్ష్మణ రేఖ ఉండాలి. బాండ్‌ సినిమాలో ముద్దు సీన్‌ కోతపై వ్యతిరేకత వ్యక్తం చేసేవారికి ఇండియా అంటే ఏమిటో తెలియదు.

     ఎలా శృంగారంలో పాల్గొంటున్నారో:

    ఎలా శృంగారంలో పాల్గొంటున్నారో:


    స్పెక్టర్‌లో ముద్దు సీన్‌కు కోత పెట్టడమే తప్పయితే.. గతంలోనూ బాండ్‌ సినిమాల్లో చుంబన దృశ్యాలను తీసేశారు. ఉదాహరణకు.. ‘‘స్కైఫాల్‌ సినిమాలో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదు. కానీ, ఈ సినిమాలో ముద్దు సీన్‌ను మేం 20 సెకన్ల మేర కట్‌ చేయమని కోరాం అంతే! (మీ లాజిక్‌ నాకు అర్థం కాలేదు.. పది సెకన్లయినా ఒక నిమిషమైనా.. ముద్దంటే ముద్దే అని విలేకరి ప్రశ్నించగా.. దానికి కోపంగా స్పందిస్తూ.. "అంటే మీరు మీ ఇంటి తలుపులు తీసిపెట్టి శృంగారంలో పాల్గొనాలనుకుంటున్నారు. మీరు ఎలా శృంగారంలో పాల్గొంటున్నారో ప్రజలకు చూపాలనుకుంటున్నారు." అని అతన్ని హేళన చేసాడు.

     యూ/ఏ సర్టిఫికెట్:

    యూ/ఏ సర్టిఫికెట్:


    ముద్దు సీన్లు ఉన్న ఒక సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఎలా ఇచ్చింది? అది కూడా సంస్కారీ నిహ్లానీ చైర్మన్ గా ఉన్న సీబీఎఫ్సీ ఇలా వ్యవహరించడం ఏమిటి? అంటూ.. జాతీయ చానళ్లు ఏకంగా చర్చా కార్యక్రమాలే నిర్వహిస్తున్నాయి. యశ్ రాజ్ వారి ‘భేఫికర్' సినిమా సెన్సార్ రిపోర్టు పై ఈ చర్చ కొనసాగుతోంది.

     ఆయన తీరు గురించే చర్చ:

    ఆయన తీరు గురించే చర్చ:


    ఇప్పటికే ముద్దు సీన్లతో కూడిన లుక్స్ తో హీటెక్కించిన ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ పై ఆశ్చర్యాలే వ్యక్తం అవుతున్నాయి. ఇది వరకూ పలు సినిమాల్లో సెన్సార్ తీవ్ర వివాదాస్పద దశ వరకూ వెళ్లిన నేపథ్యంలో ఆ వివాదాల్లో సీబీఎఫ్సీ చైర్మన్ నిహ్లానీ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆయన తీరు గురించే చర్చ జరుగుతోంది!

     విచ్చల విడిగా

    విచ్చల విడిగా

    :
    గతం లో ఒక మూవీ మేకర్ గా ఉండి.. తన సినిమాల్లో విచ్చల విడిగా శృంగార సీన్లను పెట్టిన ఘనుడు నిహ్లానీ. అయితే బీజేపీ మద్దతుదారుగా ఉంటూ ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే నామినేటెడ్ పోస్టు పొంది.. హిందూ, భారతీయ సంస్కృతీ విలువలు అంటూ మాట్లాడారీయన.

     ముద్దు సీన్లు అర్థవంతంగా ఉన్నాయి:

    ముద్దు సీన్లు అర్థవంతంగా ఉన్నాయి:


    ఇక ‘భేఫికర్' విషయంలో మాత్రం భేఫికర్ గా వ్యవహరిస్తూ.. ముద్దు సీన్లను యధేచ్ఛగా వదిలేసి, దానికి యూ/ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అదేమంటే.. ఇప్పుడు కొత్త రీజన్లు చెబుతున్నాడట నిహ్లానీ. ‘క్వింట్' లో ప్రచురితమైన కథనం ప్రకారం.. ‘ఆ ముద్దు సీన్లు అర్థవంతంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమా భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడం లేదు. పారిస్ లో ఉన్న యువతీయువకుల తీరు ను ఆవిష్కరించారిందులో.. విదేశాల్లో భారతీయుల ప్రవర్తనకు సంబంధించిన సన్నివేశాలు అవి..' అంటూ నిహ్లానీ తమ సెన్సార్ ను సమర్థించుకున్నట్టుగా ఆ కథనంలో పేర్కొన్నారు.

     ఇంత ఉదారంగా ఎందుకు:

    ఇంత ఉదారంగా ఎందుకు:


    ఇప్పుడు 23 ముద్దు సీన్లు ఉన్న ‘బేఫికర్‌' సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చి మరోసారి సంచలనం సృష్టించాడు. నిజానికి, ఈయన సినిమాలు తీసినపుడు వాటి నిండా శృంగార దృశ్యాలే ఉండేవి. కానీ, సీబీఎఫ్సీ చైర్మన్‌ అయిపోయాక హఠాత్తుగా మారిపోయాడు. అందుకే సినిమాల్లో అశ్లీలాన్ని, అసభ్యతను అంగీకరించనని చెప్పేవాడు. అలాంటిది యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ‘బేఫికర్‌' పట్ల నిహ్లానీ ఇంత ఉదారంగా ఎందుకు ఉన్నాడని జాతీయ మీడియా అనేక కథనాలను వండి వారుస్తోంది.

     విచిత్రమైన సమాధానం:

    విచిత్రమైన సమాధానం:


    ‘బేఫికర్‌'కు యూ/ఎ ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్నకు ఓ విచిత్రమైన సమాధానం చెప్పాడు నిహ్లానీ. ‘ఆ ముద్దు సీన్లు చాలా అర్థవంతంగా ఉన్నాయి. అవి శృంగారానికి సంబంధించిన ముద్దులు కావు. ప్రేమను వ్యక్తపరిచే ముద్దులు. అయినా ఆ సినిమా భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడం లేదు. కథ అంతా పారిస్‌లో జరుగుతుంద'ని చెప్పాడు. నిహ్లానీ లాజిక్‌ కరెక్ట్‌ అయితే గతంలో జేమ్స్‌బాండ్‌లోని ముద్దు సీన్‌కు ఎందుకు కట్‌ చెప్పాడో మరి!

    English summary
    Famously 'sanskaari' CBFC chief says he did not cut the kissing scenes because "Befikre is not reflective of Indian values."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X