twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ అరైవింగ్ టైమ్ పిక్స్

    శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'. ఈ సినిమాతో స్టార్ కమెడీయన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.

    త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' ఆడియో విడుదల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

    Sapthagiri Express movie releasing on 23rd December

    లహరి వారు ఈ చిత్ర ఆడియోను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. పాటలకి సైతం భారీ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'యు/ఏ' రేటింగ్ తో 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకి రాబోతుందని నిర్మాత రవికరణ్ అధికారికంగా ప్రకటించారు.

    కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, ఫైట్స్ : స్టంట్స్ జాషువా, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.

    English summary
    The much-awaited tollywood star comedian sapthagiri hero launching movie Sapthagiri Express on Friday cleared its censor formalities and the board gave a U/A certificate to this comedy and emotional flick. The film, after much deliberation, has been scheduled to hit the screens worldwide on December 23rd .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X