twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ‘సరైనోడు’ ఆడియో రిలీజ్ డేట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు' టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. చిత్ర షూటింగ్ దాదాపు 80% పూర్తయింది.

    సంక్రాంతి హాలిడేస్ తర్వాత జనవరి 25 నుండి నెక్ట్స్ షెడ్యూల్ జరుగబోతోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కేథరిన్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ‘లోఫర్' చిత్రంలో హీరోయిన్ గా నటించిన దిశా పటాని ‘సరైనోడు'లో బన్నీతో స్పెషల్ ఐటం సాంగు చేస్తోంది.

    ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే అభిమానులకు పండగ ట్రీట్ ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారట.

    'Sarainodu' Audio Release Date

    తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు'' అని బోయపాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

    English summary
    Allu Arjun's 'Sarainodu' makers are in plans to release the audio of Sarainodu on February 14th during Valentine’s Day in a grand event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X