twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ‘సరైనోడు’ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ భిన్నకోణాల్లో సాగుతుందని తెలిసింది.

    బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే అభిమానులకు పండగ ట్రీట్ ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారట.

    Sarainodu first look on Sankranthi

    తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    ‘‘బన్ని బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే కథను సిద్ధం చేశాను. అరవింద్‌గారు, బన్ని ఈ కథ విని వెంటనే ఓకే చేశారు. పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ ఇది. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు'' అని బోయపాటి ఇటీవలో ఇంటర్వ్యూలో తెలిపారు.

    English summary
    Allu Arjun-Boyapati Sreenu upcoming project Sarainodu is moving at a brisk pace in Hyderabad. Now, according to the latest update, the makers have decided to release the first look of the film on the auspicious occasion of Sankranthi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X