twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిందీ టీజర్ ఇదే (వీడియో)

    By Bojja Kumar
    |

    హైరదాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం వెనక అసలు కారణం అదనట. ఏప్రిల్ 8వ తేదీన తెలుగు, హిందీలో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా హిందీ టీజర్ కూడా రిలీజ్ చేసారు.

    సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్న విషయాన్ని ఖరారు చేస్తూ ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు. బాలీవుడ్లో దాదాపు ఎనిమిది వందల పైచిలుకు థియేటర్లలో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం అయ్యారు. సర్దార్ సినిమా ద్వారా తన సినిమా పరిధిని విస్తరించాలని నిర్ణయించుకున్నారని స్పష్టమవుతోంది.

    Sardaar Gabbar Singh Official Hindi Teaser

    ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. పవన్ నటించిన పలు తెలుగు సినిమాలు హిందీలో బుల్లితెరపై అనువాదమై ఎప్పటి నుండో ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు బాలీవుడ్లో మంచి స్పందన వస్తుందని, మంచి వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు.

    బాలీవుడ్ ప్రేక్షకులను ఈ సినిమా వైపు ఆకర్షించేందుకు డిఫరెంటుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రాతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. మరి బాలీవుడ్ చిత్ర సీమలో పవన్ జోరు ఏ రేంజిలో ఉంటుందో చూడాలి.

    English summary
    Check out the official Hindi teaser of the upcoming movie 'Sardaar Gabbar Singh' featuring Pawan Kalyan and Kajal Aggarwal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X