twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్కార్3 ఆడియెన్స్ రివ్యూ: అమితాబ్ సూపర్.. వర్మ ఇక మారడా?

    బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అమితాబ్ బచ్చన్‌తో కొనసాగించిన సినీ ప్రయాణంలో దర్శకుడు రాంగోపాల్ వర్మకు కొన్ని విజయాలను, మరికొన్ని అపజయాలను, మరికొన్ని అతి దారుణమైన ఫ్లాపులను అందించింది.

    By Rajababu
    |

    బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అమితాబ్ బచ్చన్‌తో కొనసాగించిన సినీ ప్రయాణంలో దర్శకుడు రాంగోపాల్ వర్మకు కొన్ని విజయాలను, మరికొన్ని అపజయాలను, మరికొన్ని అతి దారుణమైన ఫ్లాపులను అందించింది. 2005లో వారిద్దరి కలయికలో వచ్చిన సర్కార్, ఆ తర్వాత 2008లో సర్కార్ రాజ్ సినిమాలు ఘన విజయం సాధించాయి. చాలా రోజుల గ్యాప్ తర్వాత బిగ్‌బీ, వర్మ కాంబినేషన్‌లో సర్కార్3 వచ్చింది. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 12న రిలీజైన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా లేదనే మాట వినిపిస్తున్నది.

    అమితాబ్ లేకపోతే..

    అమితాబ్ లేకపోతే..

    సర్కార్3లో సుభాష్ నాగ్రే అలియాస్ సర్కార్ (అమితాబ్)‌ పాత్రను పోషించారు. వయస్సు మీదపడినా, ఇద్దరు కుమారులను ఫ్యాక్షన్‌లో కోల్పోయినా మహారాష్ట్ర రాజకీయాలపై పట్టు ఏమాత్రం సడలదు. సర్కార్ మనవడు శివాజీ నాగ్రే (అమిత్ సధ్) తర్వాత అధికారాన్ని చేపట్టాలని ఎదురుచూస్తుంటాడు. తండ్రి, తాతల వారసత్వాన్ని కొనసాగించాలనే ధ్యాసలో ఉంటాడు. తన తండ్రి చావుకు కారణమైన సర్కార్‌ మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనూ కక్కరే (యామీ గౌతమ్‌) పగతో రగిలిపోతుంటుంది. తనకు నమ్మిన బంటుగా పనిచేసే గోకుల్ (రోనిత్ రాయ్) అధికార పీఠం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంకా తన ప్రత్యర్థులైన మైఖేల్‌ వాల్యా (జాకీ ష్రాఫ్‌).. గోవింద్‌ దేశ్‌పాండే (మనోజ్‌ బాజ్‌పేయి)పై ఎలా ఎదురించాడనేది ఈ కథ.

    కథ, కథనంలో అనేక లోపాలు.

    కథ, కథనంలో అనేక లోపాలు.

    ఈ కథలో అనేక లోపాలు ఉన్నాయనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నది. స్క్రిప్ట్‌ను హడావిడిగా చేశారని పలువురు పేర్కొంటున్నారు. పేలవమైన కథనం ఉన్నప్పటికీ.. సినిమా భారాన్నంతా అమితాబ్ వేసుకొన్నారని.. దాంతో సర్కార్3 కొంత మెరుగ్గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    బిగ్ మరోసారి మెరుపులు

    బిగ్ మరోసారి మెరుపులు

    తెరపై సుభాష్ నాగ్రేగా అమితాబ్ మరోసారి మెరుపులు మెరిపించాడనేది బలమైన టాక్.. బిగ్ బీ గాంభీర్యం, నడక, మాట అన్ని తెరమీద చూసి తరించాలంటే సర్కార్3 కరెక్ట్ అనిపిస్తున్నది. అమితాబ్ మనవడి పాత్ర పోషించిన అమిత్ సధ్ బాడీ లాంగ్వేజీ చాలా పేలవంగా ఉంది. ఆ పాత్ర అమిత్ వల్ల తేలిపోయింది. స్క్రీన్ ప్రజెన్స్ సరిగా లేదు అంటున్నారు. గోవింద్ పాండేగా మనోజ్ బాజ్‌పేయి అద్భుతమైన నటనను మరోసారి ప్రదర్శించారు. అయితే పాత్ర పరిధి తక్కువగా ఉండటం ప్రేక్షకులను నిరాశకు గురిచేసిందంటున్నారు.

    యామీ పూర్ పెర్ఫార్మెన్స్

    యామీ పూర్ పెర్ఫార్మెన్స్

    యామీ గౌతమి పగతో రగిలిపోయే పాత్రను పోషించారు. కానీ ఊగిపోవడం తప్పితే పాత్రలో దమ్ము లేదు. ఆమె కనిపించే సన్నివేశాలు ఫోటోషూట్‌లా ఉన్నాయంటున్నారు. సర్కార్ భార్య పాత్రలో సుప్రియ పాథక్ కనిపించారు. ఆమె తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకొన్నారనేది ప్రేక్షకుల అభిప్రాయం.

    ఆకట్టుకోలేని వర్మ

    ఆకట్టుకోలేని వర్మ

    సర్కార్3ని మరో అద్భుతమైన చిత్రంగా మలిచే విషయంలో రాంగోపాల్ వర్మ మరోసారి ఆకట్టుకోలేకపోయారని మెజార్టీ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలా సన్నివేశాలు ఊహించే విధంగానే ఉన్నాయని, ముందు ఏమి జరుగబోతున్నదో ఊహించడం చాలా తేలిక అంటున్నారు. గత చిత్రాల మాదిరిగి సర్కార్ సినిమాను గ్రిప్పింగ్ చూపించేలేకపోయారని ప్రధాన ఆరోపణ.

    English summary
    Amitabh Bachchan-starrer worth a watch for Sarkar3. RGV has had several hits and misses in his career. The (hopefully) last film of the Sarkar trilogy, unfortunately, is one of the misses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X