twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతని పరిస్థితి చూసి జాలితో..... రూ. 45 లక్షలు ఖర్చు పెట్టిన నటుడు!

    యూట్యూబ్ లో సర్క్యూలేట్ అవుతున్న ఓ వీడియో చూసి ఓ వ్యక్తి పరిస్థితిపై జాలి చెందిన ఓ ప్రముఖ నటుడు... తన దేశం కాని, తనకు సంబంధం లేని అతని కోసం ఏకంగా రూ. 45 లక్షలు ఖర్చు పెట్టడం చర్చనీయాంశం అయింది.

    By Bojja Kumar
    |

    దుబాయ్: యూట్యూబ్ లో సర్క్యూలేట్ అవుతున్న ఓ వీడియో చూసి ఓ వ్యక్తి పరిస్థితిపై జాలి చెందిన ఓ ప్రముఖ నటుడు... తన దేశం కాని, తనకు సంబంధం లేని అతని కోసం ఏకంగా రూ. 45 లక్షలు ఖర్చు పెట్టడం చర్చనీయాంశం అయింది.

    బ్రతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన పాకిస్తాన్‌కు చెందిన రుస్తమ్ ఖాన్ అనే వ్యక్తి అక్కడ డ్రైవర్ గా ఉద్యోగంలో చేరాడు. వాహనం నడుపుతూ సౌదీకి చెందిన యువకుడు మరణానికి కారణం అయ్యాడు. సౌదీ చట్టాల ప్రకారం బాధితుడి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే.... వారు అడిగినంత డబ్బు డబ్బు చెల్లించి జైలు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు.

    డబ్బు కట్టు లేదా శిక్ష

    డబ్బు కట్టు లేదా శిక్ష

    బాధితుడి కుటుంబ సభ్యులు 2.50 లక్షల సౌదీ రియాల్స్‌ను ( రూ. 45 లక్షల పైనే) పరిహారం కోరారు. పొట్టకూటి కోసం వచ్చిన తాను అంత డబ్బు కట్టలేనని అతడు వేడుకున్నా లాభం లేక పోయింది. డబ్బు కట్టడం లేదా శిక్ష అనుభవించడమో తేల్చుకోవాలని కోర్టు తేల్చి చెప్పింది.

    వీడియో

    వీడియో

    చేసేది లేక ...అతడు ‘నా కిడ్నీ ఇస్తాను. తీసుకోండి. పరిహారంగా నా ప్రాణాలను కాపాడండి' అంటూ వీడియో రూపొందించి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు.

    ఫయీజ్ అల్-మాల్కి

    ఫయీజ్ అల్-మాల్కి

    సౌదీలో వైరల్ అయిన ఆ వీడియో చూసి సౌదీకి చెందిన ప్రముఖ నటుడు ఫయీజ్ అల్-మాల్కి జాలి పడి ... అతడు కట్టాల్సిన డబ్బును చెల్లించాడు.

    rn

    సహాయం చేస్తున్న వీడియో

    పాకిస్థాన్ డ్రైవర్ కోసం నటుడు ఫయిజ్ అల్-మాల్కి డబ్బు కడుతున్న వీడియో ఇదే.

    English summary
    An unidentified person in Saudi Arabia gave a new hope to a Pakistani truck driver, Rustam Khan. According to the Saudi Gazette, Khan was imprisoned for his involvement in a road accident in Saudi Arabia that killed military personnel. He was required to pay SR 250,000 as blood money. Since Khan could not afford to pay the money, he had put a video on social media, offering to sell his kidney to collect the money. Soon, another video appeared on social media where Saudi actor Fayez Al-Malki announced that a Samaritan wished to pay the blood money.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X