twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విక్టరీ వెంకటేష్ వీడియో సందేశం ఇదే : తిరస్కరించండి...వద్దని చెప్పండి అంటూ

    |

    ఆల్కహాల్ సేవనం , సిగరెట్లూ గుట్కాలూ ఈ మధ్య కాలం లో మరింతగా విస్తరిస్తున్న మత్తు, పొగాకు వాడకం యువకుల్లో మరింతగా పెరిగిపోయింది. చివరికి వాటికి బానిసలై బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించడానికి 'టీనేజ్‌ ఫౌండేషన్‌' అనే సంస్థ ఓ వీడియో రూపంలో మన ముందుకు తీసుకువచ్చింది. చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా ఓ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేటి సమాజంలో చాలామంది తోటి స్నేహితుల ఒత్తిడి కారణంగా చెడు అలవాట్లను బానిసైపోతున్నారు.

    తద్వారా బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దీనిపై అవగాహన కల్పించే దిశగా 'టీనేజ్‌ ఫౌండేషన్‌' అనే సంస్థ ఓ వీడియో రూపంలో సందేశం ఇచ్చింది. ఇందులో కొన్ని సన్నివేశాలను చూపించి.. వెంకటేశ్‌ 'పీర్‌ ప్రెజర్‌' అనే అంశం గురించి మాట్లాడుతూ కనిపించారు. జీవితాన్ని మరొకరి చేతుల్లో పెట్టొద్దు, తోటివారి ఒత్తిడికి లొంగొద్దు అనే చక్కటి సందేశంతో వచ్చిన ఈ వీడియోను వెంకటేశ్‌ సోషల్‌మీడియా ద్వారా షేర్‌ చేశారు.

    ఇందులో కొన్ని సీన్లలో వెంకీని చూపించి.. 'పీర్‌ ప్రెజర్‌' అనే అంశం గురించి మాట్లాడించేలా చేసింది. జీవితాన్ని మరొకరి చేతుల్లో పెట్టొద్దు, తోటివారి ఒత్తిడికి లొంగొద్దు అనే చక్కటి సందేశంతో వచ్చిన ఈ వీడియోను వెంకటేశ్‌ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. చెడు అలవాట్లన్నీ ఆరంభంలో సరదాగా ఉంటాయి. ఆపై అందరూ చేస్తున్నప్పుడు.. తప్పేముందనే క్లారిటీకి వస్తారు.

    ఫ్రెండ్స్ దూరమైపోతారనే భయంతో దురలవాట్లకు అలవాటు పడితే బంగారు లాంటి జీవితం మీ నుంచి దూరమవుతుంది. అందుకే స్నేహితులు అలవాటు చేసే దురలవాట్లకు ఒక్కసారి నో చెప్పండి.. వారు మిమ్మల్ని వదిలేసినా పర్లేదు. జీవితం మీకు ముఖ్యమని భావించండి. అందుకే చెడు అలవాట్లకు నో చెప్పండి. చెడు అలవాట్లను ప్రోద్భలించే స్నేహితుల గురించి పెద్దగా ఆలోచించకండి.. అని వెంకీ చెప్తున్న మాటలు యువతను ఆలోచింపజేస్తున్నాయి.

    'తొలుత ఇవన్నీ(చెడుఅలవాట్లు) సరదాగా ఉంటాయి. ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పేముంది.. అందరూ చేస్తున్నారుగా.. ఫ్రెండ్స్‌ చెప్పినట్లు చేయకపోతే వాళ్లు నాకు దూరమైపోతారేమో.. ఇలా ఆలోచించి మొదలుపెడతారు. అంతేకానీ దాని వల్ల కలిగే ఫలితాలను ఆలోచించలేరు. మీ స్నేహితులను నిరాశపరచడం ఇష్టంలేక మీ జీవితాలను ప్రమాదంలో పడవేసుకోవడం సబబా? చెడు అలవాట్లకు ఆకర్షితులు కావద్దు. ఒక్కసారి నో చెప్పండి.. ఆ తర్వాత ఎదుటివారు మీ గురించి ఏం అనుకుంటున్నారనేది అనవసరం. వారు మిమ్మల్ని వదిలేసినా పర్వాలేదు. మీరు, మీ జీవితం మీకు ముఖ్యమని తెలుసుకోండి. నో చెప్పడం నేర్చుకోండి అని వెంకటేశ్‌ చెబుతున్న మాటలు యువతను ఆలోచింపచేసేలా ఉన్నాయి.

    English summary
    Say No To Peer Pressure Campaign By Victory Venkatesh Say No To Peer Pressure is a Video aimed at building awareness in adolescents in learning to say no to peer pressure in getting addiction habits. This is an initiative by Dr. Lalitha Anand of Teenage Foundation
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X