»   » నాని నిర్మాత అరెస్టే..హాట్ టాపిక్

నాని నిర్మాత అరెస్టే..హాట్ టాపిక్

Posted by:

నానితో సెగ చిత్రం తీసిన వల్లభనేని అశోక్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భూకబ్జా కేసులో ఇరుక్కున్న అశోకి్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశమయ్యారు.టాలీవుడ్ లో ఏ ఇద్దరు కలిసినా ఈ విషయం తప్పనిసరిగా చర్చ వస్తోంది. ఆ మధ్యన సి కళ్యాణ్,సింగనమల రమేష్ తర్వాత ఇప్పుడు అశోక్ అరెస్టే అంతటా షాక్ కి గురి చేసింది. అందులోనూ ఆయనతో తర్వత సినిమా నిమిత్తం అడ్వాన్స్ లు తీసుకున్న వారు తమ ప్రాజెక్టులు పరిస్ధితి ఏమిటన్న విషయంలో ఆందోళనకు గురి అవుతున్నారు.

ఇక ఎల్లారెడ్డి గూడలో ఓ భూ కబ్జా కేసుకు సంభందించి వల్లభనేని అశోక్ తో సహా పదకొండు మందిని పోలీసులు శనివారం అరెస్టు చేసారు.వారిని చంచలగూడా పోలిస్ స్టేషన్ కి షిప్ట్ చేసారు.అంతేగాక జూబ్లీహిల్స్ లోని ఐదు కోట్లు విలువ చేసే భూమి కోసం నిర్మాత అశోక్ బెదిరింపులకు పాల్పడ్డారని గతంలో అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇదే నిర్మాత గౌతమ్ మీనన్ డైరక్ట్ చేసిన ఓ చిత్రాన్ని ఎర్ర గులాబీలు పేరుతో తెలుగులోకి డబ్ చేసి వదిలారు.అయితే సెగ,ఎర్ర గులాబీలు రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవటం ఆయన్ని నిరాశ పరిచిన అంశం.

English summary
Sega film Producer Vallabhaneni Ashok have beeen arrested by police at Hyderabad.
Please Wait while comments are loading...