twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుక్క మాంసం తినడంపై హీరోయిన్ పోరాటం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండియాలో కుక్కలా పుడితే ఒకరకంగ అదృష్టం అనే చెప్పాలి. కానీ చైనాలో అలా కాదు. అక్కడ కుక్కలను చంపి తింటారు. ప్రతి సంవత్సరం చైనాలో ‘యులిన్ డాగ్ మీట్ ఫెస్టివల్' పేరుతో ఓ ఉత్సవం కూడా జరుగుతుంది. ఇందు కోసం వేలాది కుక్కలను చంపేస్తారు. ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రారంభం అయ్యే ఈ ఫెస్టివల్ లో దాదాపు 10వేల కుక్కలను బలిస్తారు.

    మానవులకు ఎంతో నమ్మకమైన జంతువుగా, ఉపయోగకరంగా ఉంటున్న కుక్కలను చంపి మాంసాహారంగా స్వీకరించడంపై పోరాటం చేయాలని నిర్ణయించుకుంది ఓ హీరోయిన్. ఆమె మరెవరో కాదు రవితేజ సరసన ‘నేనింతే' సినిమాలో నటించి శీయ గౌతం. చైనాలో కుక్కలను చంపే ఫెస్టివల్ ఆపాలని, కుక్క మాంసం తినడాన్ని నిషేదించాలని ఆన్ లైన్ పోరుకు దిగింది. ఈ పోరుకు మరింత మందిని కూడగట్టేందుకు సిద్ధమవుతోంది.

    Seiya Gautham fight against Dog Meat

    చైనాలో ఈ డాగ్ మీస్ ఫెస్టివల్ జూన్ 21, 22 తేదీల్లో జరుగుతుంది. ఈ ఫెస్టివల్ కోసం ఈ రెండు రోజుల్లో దాదాపు పదివేల కుక్కలు బలవుతాయి. కుక్కలు మాత్రమే కాదు పిల్లలను కూడా ఈ ఫెస్టివల్ లో మాంసంగా వడ్డిస్తారట. ప్రతి ఏడాది చైనాలో 2 కోట్లకు పైగా కుక్కలు మాంసాహారంగా మారుతాయని అంచనా.

    కుక్క మాంసం తినడం వల్ల తమకు దెయ్యాలను ఎదుర్కొనే శక్తి వస్తుందని, కొన్ని రకాల వ్యాధులు రావని చైనీయుల నమ్మకం. కుక్క మాంసం శృంగార శక్తిని పెంచుతుందని మరికొందరి నమ్మకం. ఇలా చైనాలో కుక్కల పరిస్థితి మరీ దారుణంగా మారింది.

    English summary
    Seiya Gautham is voicing her protest against Yulin Dog Meat festival. The heroic woman is trying to save hundreds of dogs from the dinner plate at China's barbaric annual 'meat festival'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X