Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భారీ అంచనాలతో ‘గోవిందుడు...’
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' అక్టోబర్ 1 గ్రాండ్‌గా విడుదలవుతోంది. సంక్రాంతి సీజన్లో ‘ఎవడు' సినిమాతో హిట్ కొట్టిన రామ్ చరణ్ ఈ దసరా సీజన్లో ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రంతో కలెక్షన్ కింగ్‌గా ప్లాన్లో వస్తున్నాడు.
ఒక ఎన్నారై యువకుడు....ఇండియా వచ్చి ఇక్కడి తన ఫ్యామిలీకి ఎలా దగ్గరయ్యాడు, సమస్యలను ఎలా పరిష్కరించాడు అనేది సినిమా కథాంశం. ఇలాంటి కథాంశాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాక పోయినా....కృష్ణ వంశీ క్రియేటివిటీ, టేకింగ్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని, అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నారు.
సినిమా ఆద్యంతం మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండేలా దర్శకుడు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సినిమా ఉన్నప్పటికీ రామ్ చరణ్ అభిమానులు, యూత్‌ను ఆకట్టుకునే అంశాలను సమ పాళ్లలో రంగరించారని టాక్. పైగా...రామ్ చరణ్, కాజల్ జోడీ సూపర్ హిట్ జోడీ. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మగధీర'లో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దర్శకుడు కృష్ణ వంశీ తనదైన శైలి అనుసరిస్తూ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు ప్లాన్ చేసారు.
అసలే మెగా ఫ్యామిలీ హీరో...రామ్ చరణ్ సినిమా అంటే క్రేజ్ కూడా ఎక్కువే. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రెస్టాఫ్ ఇండియా, అమెరికా, కెనడా, లండన్, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో దాదాపు 2 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో .....రివ్యూతో మీ ముందుకు వస్తాం. అంత వరకు కాస్త ఓపిక పట్టండి....