»   » మహేశ్.. ప్లీజ్ డిన్నర్‌కు ఆహ్వానించు.. షారుక్ రిక్వెస్ట్

మహేశ్.. ప్లీజ్ డిన్నర్‌కు ఆహ్వానించు.. షారుక్ రిక్వెస్ట్

ఇటీవల విడుదలైన రయీస్ చిత్ర ప్రమోషన్ కోసం షారుక్ ఖాన్ హైదరాబాద్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో స్థానిక టెలివిజన్ చానెల్ తో మాట్లాడుతూ.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

మరోసారి తాను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనను డిన్నర్‌కు ఆహ్వానించాలని ప్రిన్స్ మహేశ్ బాబుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేశారు.

హైదరాబాద్ అంటే చాలా ఇష్టం


ఇటీవల విడుదలైన రయీస్ చిత్ర ప్రమోషన్ కోసం షారుక్ ఖాన్ హైదరాబాద్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో స్థానిక టెలివిజన్ చానెల్ తో మాట్లాడుతూ.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.

భాగ్యనగరంతో ప్రత్యేక అనుబంధం


బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు హైదరాబాద్ తోపాటు టాలీవుడ్ పరిశ్రమతో ప్రత్యేకమైన అనుబంధముందనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం దొరికితే భాగ్యనగరంలో వాలిపోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

మేటి నటుల అపూర్వ కలయిక


గతంలో హైదరాబాద్ లో దిల్ వాలే చిత్ర షూటింగ్ సందర్భంగా షారుక్, మహేశ్, నమత్రలు కలుసుకొన్నారు. ఆ సమయంలో పక్క సెట్లో మహేశ్ బ్రహ్మోత్సవం చిత్ర షూటింగ్ లో ఉన్నారు.

షారుక్ ఉర్ధూ యూనివర్సిటీ డాక్టరేట్


ఇటీవల ఉర్దూ యూనివర్సిటీ షారుక్ కు డాక్టరేట్ ను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా షారుక్ తల్లి జన్మస్థలం కూడా హైదరాబాద్ కావడం గమనార్హం.

English summary
Shah Rukh Khan is very fond of Hyderabad and tollywood. He recently visited Hyderabad to promote Raees. In this occassion he request Mahesh babu to call for dinner
Please Wait while comments are loading...