Don't Miss!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిన్న కొడుకు ఎంట్రీ, రూ. 100 కోట్లు దాటిన కలెక్షన్!
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమా విడుదల అవుతుందంటే రెస్పాన్స్ ఏ రేంజిలో ఉంటుందో, ఓపెనింగ్స్ ఎలా కేక పుట్టిస్తాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా విడుదలైన షారుక్ ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం అంచనాలు ఏ మాత్రం తప్పలేదు. తొలిరోజే రూ. 44 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోపే రూ. 100 కోట్ల కలెక్షన్స్ అధిగమించడం గమనార్హం. వీకెండ్ కావడం, దీవాళీ పండగ తరువాత విడుదల కావడం సినిమాకు బాగా కలిసొచ్చింది. తొలిరోజు ఈ చిత్రం రూ. 44 కోట్లు వసూలు చేయడం ఇండియన్ సినిమా చరిత్రలో ఇది సరికొత్త రికార్డు.
తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 108.86 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్ వీకెండ్ పరంగా చూస్తే ఇప్పటి వరకు ఇదే రికార్డు. ఒక్క హిందీ వెర్షనే రూ. 104.10 కోట్లు వసూలు చేయగా, తెలుగు వెర్షన్ రూ. 2.92 కోట్లు, తమిళ డబ్బింగ్ రూ. 1.84 కోట్లు వసూలు చేసింది.
కాగా ఈ చిత్రం ద్వారా షారుక్ ఖాన్ చిన్న కొడుకు అబ్ రామ్ కూడా వెండి తెర ఎంట్రీ ఇచ్చాడు. సినిమా విజయం కంటే తన చిన్న కుమారుడు అబ్ రామ్ తెరపై కనిపించడమే ఆనందంగా ఉందని, ఈ క్రెడిట్ అంతా దర్శకురాలు ఫరా ఖాన్ కే దక్కుతుందని షారుక్ ఖాన్ తెలిపారు. ఒకసారి షూటింగు స్పాటుకు వచ్చిన అబ్ రామ్‌ను ఫరా ఖాన్ చొరవ తీసుకుని ఓ సీన్ షూట్ చేసారని, సనిమా ఎండింగులో టైటిల్స్ పడే సమయంలో అబ్ రామ్ కనిపిస్తాడని షారుక్ తెలిపారు. షారుక్-గౌరీ దంపతులకు అబ్ రామ్ సరోగసీ పద్దతి ద్వారా కలిగిన సంతానం.
షారుక్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రానికి ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు. ‘మైహూనా', ‘ఓం శాంతి ఓం' తర్వాత షారుక్ ఖాన్ హీరోగా లేడీ డెరైక్టర్ ఫరా ఖాన్ రూపొందించిన మూడో చిత్రమిది. ఈ సినిమాను దీపావళి పండగ సందర్భంగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై షారుక్ భార్య గౌరీఖాన్ నిర్మించారు.