twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి స్ఫూర్తి.. యుద్ధ సైనికుడిగా షారుక్.. వెండితెరపై ఆపరేషన్ ఖుక్రీ..

    By Rajababu
    |

    బాహుబలి అందించిన స్పూర్తితో బాలీవుడ్‌లో యుద్ధ నేపథ్యమున్న చిత్రాల జోరు పెరిగింది. దర్శకుడు కబీర్ ఖాన్, సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో ఇండో-చైనా యుద్ధ నేపథ్యంగా బాలుడి సెంటిమెంట్‌తో ట్యూబ్‌లైట్ తెరకెక్కగా, ప్రస్తుతం షారుక్ ఖాన్ మరో యుద్ధ నేపథ్య కథతో సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ ఆఫ్రికా అడవుల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన ఆపరేషన్ ఖుక్రీ కావడం విశేషం.

    అత్యంత భారీ బడ్జెట్ చిత్రం

    అత్యంత భారీ బడ్జెట్ చిత్రం

    ఆపరేషన్ ఖుక్రీ నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ చిత్రం షారుక్ కెరీర్లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. గతంలో కూడా షారుక్ యుద్ధ సైనికుడు పలు చిత్రాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. యుద్ద సైనికుల సేవలను కొనియాడే విధంగా, సినీ తెరపై భారత సైనికులు సేవలను అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

    స్క్రిప్ట్‌పై కసరత్తు

    స్క్రిప్ట్‌పై కసరత్తు

    ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, నటీనటవర్గం ఖారారైందని, ఈ చిత్రంలోని సన్నివేశాలు ఆఫ్రికాలోని వాస్తవంగా యుద్ధం జరిగిన ప్రాంతాల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అజ్యుర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ స్క్రిప్ట్‌పై చిత్ర యూనిట్ కొద్దికాలంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివారాలను అధికారికంగా వెల్లడించానున్నారు.

    పశ్చిమ ఆఫ్రికా అడవుల్లో..

    పశ్చిమ ఆఫ్రికా అడవుల్లో..

    2000 సంవత్సరంలో పశ్చిమ ఆఫ్రికాలోని సియోరా లియోనీ ఉష్ణమండల అడవుల్లో ఆపరేషన్ ఖుక్రీ జరిగింది. పశ్చిమ ఆఫ్రికాలోని అతివాద సంస్థ రెవల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ కార్యక్రమాలను అడ్డుకొనేందుకు భారత ప్రభుత్వం దాదాపు 223 మందిని సియోరా లియోనీ అడవులకు శాంతిపరిరక్షక దళంగా పంపింది. ఆ బృందాన్ని రక్షించడానికి మేజర్ (ప్రస్తుతం లెఫ్టినెంట్ కల్నల్) హరిందర్ సూద్ నాయకత్వంలో దాదాపు 120 వైమానిక దళ సైనికులు ఆఫ్రికాకు వెళ్లారు. అక్కడ రెబెల్స్‌తో జరిగిన యుద్దంంలో శాంతిపరిరక్షక దళ సభ్యులను భారత వైమానిక దళ సభ్యులు కాపాడారు. వైమానిక దళ సభ్యుడి పాత్రను షారుక్ పోషిస్తున్నట్టు సమాచారం.

    దేశభక్తి కథాంశంతో బాలీవుడ్

    దేశభక్తి కథాంశంతో బాలీవుడ్

    ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో యుద్ధ నేపథ్యమున్న సినిమాలు నిర్మాణం పెరిగింది. దేశభక్తి ప్రధానమైన కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఎయిర్ లిఫ్ట్, భజ్‌రంగీ భాయ్‌జాన్, ట్యూబ్ లైట్ లాంటి చిత్రాల నిర్మాణ జోష్ పెరిగుతున్నది. తాజాగా ఆపరేషన్ ఖుక్రీని షారుక్ ఖాన్ తెరకెక్కించాలనుకోవడం విభిన్న చిత్రాలపై ఆసక్తిపెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    English summary
    Shah Rukh Khan's home production Red Chillies Entertainment's next will be war film based on Indian Army and Indian Air Force's rescue operation 'Operation Khukri' in Africa. Shah Rukh Khan will play a fauji in his next home production. Red Chillies Entertainment’s next film will be based on Indian Army and Indian Air Force’s Operation Khukri in Africa. This movie among the most expensive projects Shah Rukh’s production house has undertaken.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X