Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
షారుక్ ఖాన్ ఫ్యామిలీలో విషాద ఘటన.. కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుటుంబంలో స్వల్ప విషాదం చోటుచేసుకొన్నాడు. షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆర్యన్‌కు సర్జరీ అనివార్యమైంది. దీంతో ఐఫా అవార్డులకు బాలీవుడ్ బాద్షా దూరమయ్యా
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుటుంబంలో స్వల్ప విషాదం చోటుచేసుకొన్నాడు. షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆర్యన్‌కు సర్జరీ అనివార్యమైంది. దీంతో ఐఫా అవార్డులకు బాలీవుడ్ బాద్షా దూరమయ్యాడు. వివరాల్లోకి వెళితే..
ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతూ..
షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ స్కూల్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ముక్కుకు గాయం కావడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. తక్షణమే వైద్యులు చికిత్స అందించడంతో పెద్ద ముప్పు తప్పింది.
సర్జరీ అవసరం
అతనికి సర్జరీ చేయాల్సి ఉంటుంది అని షారుక్‌కు వైద్యులు వెల్లడించినట్టు సమాచారం. దాంతో ఐఫా అవార్డుల కార్యక్రమాన్ని రద్దు చేసుకొన్నారు.
మెరుగుపడిన ఆరోగ్యం
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ పరిస్థితి మెరుగుపడినట్టు తెలుస్తున్నది. గాయం నుంచి కోలుకొని మాములు స్థితికి చేరుకొన్నట్టు సమాచారం. ప్రస్తుతం వైద్యం కొనసాగుతుందని, త్వరలోనే సర్జరీ నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నారు.
తీవ్ర ఆందోళనలో షారుక్
విదేశంలో నిర్వహించే సర్జరీ కోసం షారుక్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగా వ్యక్తిగత పర్యటనను రద్దు చేసుకొన్నట్టు తెలుస్తున్నది. ఆర్యన్‌కు జరిగిన ప్రమాదం గురించి షారుక్ తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలుస్తున్నది.
ఐఫా టూర్ రద్దు
ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మకంగా జరిగే అవార్డుల కార్యక్రమానికి వ్యక్తిగత కారణాలతో గతేడాది కూడా షారుక్ ఖాన్ దూరమయ్యాడు. వచ్చే జూలైలో జరిగే ఐఫా అవార్డులకు కూడా గైర్హాజరు కానున్నడనే వార్త బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
జబ్ హ్యారీ మెట్ సెజల్
ప్రస్తుతం షారుక్ ఖాన్ దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందించే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల ఆ చిత్రానికి జబ్ హ్యారీ మెట్ సెజల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 80 దశకనాటి వాతావరణ పరిస్థితుల్లో సాగే రొమాంటిక్, కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్నది. అనుష్క శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రాగ్, అమ్‌స్టర్ డామ్, లిబ్సన్, బుడాపెస్ట్ తదితర నగరాల్లో షూట్ చేశారు.