twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షకీలా ఆత్మ కథలో కొన్ని చేదు నిజాలు...

    By Srikanya
    |

    హైదరాబాద్ : సెక్స్‌ బాంబ్‌ షకీలా త్వరలో తాను ఆత్మ కథ రాయబోతున్నానని,ఉన్నదున్నట్లు నిజాలు రాస్తానని ప్రకటించిన గానే చాలా మందిలో భయాలు చెలరేగాయి..ఎవరి గుట్టు ఆమె విప్పుతుందో అని భయపడ్డారు. అయితే పుస్తకం రానే వచ్చింది. ఆమె తన గురించిన చేదు వాస్తవాలే ఈ పుస్తకంలో ఎక్కువ ప్రస్దావించింది.

    ఒకప్పుడు హీరోయిన్ల కన్నా షకీలాకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అలాంటి షకీలా గతం చాలా విషాదమయం. చిన్నప్పుడు సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగిన ఆమె మలయాళం సినీ పరిశ్రమకు వెనుక ఆశ్చర్యపరిచి బాధపెట్టే వాస్తవాలు ఉన్నాయి.

    కోట్ల మంది మగళ్ళ కలలరాణి అయిన షకీలా తన జీవితంలో ఎప్పుడైనా సుఖపడలేదని చెప్తోంది . 'నాలో అపరాధ భావన లేదు.. బాధే ఉంది' అనే ట్యాగ్‌లైన్‌తో మలయాళంలో విడుదలయిన ఈ ఆత్మకథ అక్కడ సంచలనం సృష్టిస్తోంది. అందులోని కొన్ని భాగాలు ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు అనువాదం చేసారు అందులో కొన్ని...

    స్లైడ్ షోలో... షకీలా పుస్తకంలో ఏం రాసింది

    ఎందుకు రాసాను..

    ఎందుకు రాసాను..


    'నేను ఆత్మకథ పుస్తకం ఎందుకు రాయాలి? నా జీవితం నుంచి ఎవరైనా నేర్చుకొనేది ఏదైనా ఉందా? నేనేమీ మదర్ థెరిస్సాను కాను. నేను పూర్తిగా ఒక కృత్రిమమైన జీవితాన్ని గడిపాను. నేను నటించిన చిత్రాలు కూడా కృత్రిమమైనవే. అలాంటప్పుడు నేను ఆత్మకథను ఎందుకు రాయాలి? మొదట్లో నాకు ఇలాంటి ఆలోచనలు ఉండేవి. అందుకే ఎవరైనా వచ్చి ఆత్మకథ రాయమంటే నేను ఒప్పుకొనే దాన్ని కాదు. నిరాకరించాను. కానీ ఆ తర్వాత నా మనసు మార్చుకున్నాను.

    సాధారణమైనదానినే...

    సాధారణమైనదానినే...

    నేను అందరిలాంటి ఆడపిల్లనే. సామాన్యంగా బతకాలనుకున్నాను. ప్రేమించాలనుకున్నాను. ఇతరుల చేత ప్రేమించబడాలనుకున్నాను. ఇవేమీ సాధ్యం కాలేదు. నా గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నేను ఎలాంటి కష్టాలు పడ్డానో ఎవరికీ తెలియదు. నా పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో ఎవరికీ తెలియదు. షకీలాలు ఎలా పుడతారో, ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలనే ఇప్పుడీ ఆత్మకథ రాశాను.

    అందరూ నా శరీరాన్నే...

    అందరూ నా శరీరాన్నే...

    నా సినిమా నా శరీరాన్ని శృంగారభరితంగా చూపట్టడం తప్ప ఇంకేమీ చేయదు. నాలోని స్త్రీని, నాలోని నటిని ఎవరూ చూడరు. మలయాళీ కుర్రకారు శృంగార కలలకు నేను ప్రతిరూపమని ఒక సారి ఓ జర్నలిస్టు నాతో అన్నాడు. ఎవరికైనా ఆకలిగా ఉంటే వారికి అన్నం పెట్టాల్సిందే. అది తప్ప వేరే ఏదీ సంతోసాన్నివ్వదు.

    హైయిస్ట్ రెమ్యునేషన్...

    హైయిస్ట్ రెమ్యునేషన్...

    ఒక దశలో- సినిమా హీరోయిన్ల కన్నా నేను ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనేదాన్ని. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్‌కు విమానాల్లో తిరిగేదాన్ని. పగలనకా రాత్రనకా సినిమా షూటింగ్‌లలో పాల్గొనేదాన్ని. కొన్ని సార్లు- రోజుకు రెండు, మూడు గంటల నిద్ర కూడా దొరికేది కాదు.

    అది భావప్రాప్తి కాదు...

    అది భావప్రాప్తి కాదు...

    చాలాసార్లు బెడ్‌రూం సన్నివేశాల్లో నటిస్తూనే వళ్లు తెలియకుండా నిద్రపోయేదాన్ని. అలాంటి సన్నివేశాలను చూసి ప్రేక్షకులు నేను భావ ప్రాప్తి పొందుతున్నానని భావించేవారు. చాలా మంది దృష్టిలో నేను కామోద్దీపన కలిగించే ఒక శరీరాన్ని మాత్రమే. నాలో ఉన్న నటిని వెలికితీయటానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు.

    మా అమ్మే నన్ను...

    మా అమ్మే నన్ను...



    మా అమ్మకు సంబంధించి నాకు ఎటువంటి మంచి మెమరీస్ లేవు. ఆమె నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. ఆప్యాయంగా పలకరించలేదు. నా జీవితాన్ని నాశనం చేసింది మా అమ్మే. బహుశా మా అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే ప్రేమ లేదు. అస్తమాను తిడుతూ ఉండేది. శాపనార్థాలు పెట్టేది.

    16 వ ఏటే...

    16 వ ఏటే...

    ఇలా నాకు పదహారేళ్లు వచ్చాయి. ఎప్పుడూ నన్ను తిట్టే అమ్మ ఒక రోజు నన్ను పొగిడింది. ఆ తర్వాత- నన్ను ఒక వ్యక్తి వచ్చి బయటకు తీసుకువెడతాడని చెప్పింది. అతను నన్ను ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్తాడనీ.. అతనితో 'మంచి'గా ఉంటే- మొత్తం కుటుంబ ఆర్థిక సమస్యలు తీరిపోతాయనీ చెప్పింది. అతను చెప్పినట్లు చేయాలని మరీమరీ చెప్పింది.

    షాకయ్యా...

    షాకయ్యా...

    నేను షాక్ తిన్నా. మా అమ్మ మాటల వెనకున్న అర్థమేమిటో నాకు బోధపడింది. కానీ నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అమ్మ చెప్పినట్లే ఒక వ్యక్తి వచ్చి హోటల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ రూమ్‌లో ధనవంతుడని మా అమ్మ చెప్పిన వ్యక్తి ఉన్నాడు. అతనిని చూసి నేను బాధతో, భయంతో గడ్డకట్టుకుపోయా. ఆయన నన్ను రేప్ చేశాడు. ఇది ప్రారంభం మాత్రమే.

    కన్యత్వం ఎప్పుడు...

    కన్యత్వం ఎప్పుడు...

    ఆ తర్వాత అలాంటి ధనవంతులనేకమంది దగ్గరకు నేను వెళ్లాల్సి వచ్చింది. నాకు బాధ కలిగేది. అప్పుడప్పుడు కొంత తృప్తి కూడా కలిగేది. నేను నా కన్యాత్వాన్ని ఎప్పుడు కోల్పోయానో నాకే తెలియదు.

    సెక్స్ తప్ప వేరే లేదా..

    సెక్స్ తప్ప వేరే లేదా..

    ఆల్కహాల్ తీసుకొనేటప్పుడు- పురుషుల కన్నా మహిళల కంపెనీనే నేను ఎక్కువగా కోరుకుంటాను. తాగిన తర్వాత పురుషులు తమ కామాన్ని వెల్లడిస్తారు. వారితో కలిసి తాగుతున్నానంటే వారి కోరికలు తీర్చటానికి నేను సిద్ధంగా ఉన్నాననుకుంటారు. అలాంటి వాళ్లను చూస్తే జాలేస్తుంది. వారి జీవితంలో భావ దారిద్య్రం ఎక్కువ. వారికి జీవితంలో సెక్స్ తప్ప వేరే భావన ఏదీ లేదా అనిపిస్తుంది.

    సెట్ లో ఉండగా...

    సెట్ లో ఉండగా...



    సినిమాలో బెడ్‌రూం సీనుల్లో నటించేటప్పుడు- శృంగార భావనలు కలుగుతాయా అనే ప్రశ్నను చాలా మంది అడుగుతూ ఉంటారు. షూటింగ్ జరిగేటప్పుడు మొత్తం యూనిట్ అంతా ఉంటుంది. అందరూ చూస్తున్నప్పుడు సెక్స్ ప్రేరణలు ఎలా కలుగుతాయి?

    మానసిక అనుభందం లేకపోతే..

    మానసిక అనుభందం లేకపోతే..

    మహిళలకు సంబంధించినంత వరకూ శృంగారమనేది శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. మానసిక అనుబంధం లేకపోతే సెక్స్‌ను ఆనందించలేరు. నేను చిత్రాల్లో చేసేది కేవలం నటన మాత్రమే. నటిస్తున్నప్పుడు నాకెప్పుడూ సెక్స్ కోరికలు కలగలేదు.

    మా అక్క చేసింది!

    మా అక్క చేసింది!

    మా పెద్దక్క నూర్జహాన్ నేను దివాళా తీయటానికి ప్రధాన కారణం. ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణిని నేనే. అయినా నా సంపాదనంతా మా అక్క దొంగిలించింది.

    మోసం చేస్తుందనుకోలేదు..

    మోసం చేస్తుందనుకోలేదు..

    మా అక్కే నా డబ్బు వ్యవహారాలన్నీ చూసేది. నేను తనని పూర్తిగా నమ్మాను. నా చిన్నప్పటి నుంచి తను నాతోనే ఉంది. ఎప్పుడూ తను అలా ప్రవర్తిస్తుందని నేను ఊహించలేదు. ఒక దశలో నేను ఈ సినిమాలతో విసిగిపోయాను. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్‌కు విమానాల్లో తిరగటం- కంటి మీద కునుకు లేకుండా షూటింగ్‌లు చేయటం నాకు విసుగనిపించాయి. నేను ఒక బ్రేక్ తీసుకుందామనుకున్నా. పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకుంటున్నానని మా అమ్మతోను, నూర్జహాన్‌తోను చెప్పాను. వాళ్లిద్దరూ షాక్ తిన్నారు. బ్రేక్ తీసుకుంటానంటే నేనేదో పెద్ద నేరం చేస్తున్నట్లు చూశారు. నూర్జహాన్ అలాంటి తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చచెప్పటం మొదలుపెట్టింది. వారు కేవలం నా డబ్బునే ప్రేమించారని, నా భవిష్యత్తు మీద వారికి ఎటువంటి ఆలోచన లేదని తేలింది. నాకు చాలా కోపం వచ్చింది. నేను సంపాదించిన డబ్బంతా ఇచ్చేయమన్నా. డబ్బంతా ఇంటికే ఖర్చు పెట్టేసానంది నూర్జహాన్. నాకు షాక్ తగిలినంత పనైంది.

    పుస్తకం డిటేల్స్...

    పుస్తకం డిటేల్స్...

    ఎడిషన్ : 1
    పబ్లిషర్ : Olive publications
    పేజిలు: 242
    సైజ్ : Demy 1/8
    బైండింగ్: Paperback
    ఎడిషన్ : 2013 October

    English summary
    Shakeela mostly acted in film industries of Malayalam, Tamil, Telugu, Punjabi, and Kannada languages.She had acted more than 110 movies, mostly in B grade movies. This autobiography is supposed to include all her acquaintances with notable film personalities, politicians and childhood friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X