twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఐ’లో ఎవరినీ కించపర్చలేదు: ఓస్మా జాస్మిన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘ఐ' సినిమాలో ‘ఓస్మా జాస్మిన్' పాత్రను చిత్రీకరించిన తీరు ట్రాన్స్ జెండర్స్‌ను కించ పరిచే విధంగా ఉందనే ఆందోళనలు, విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శంకర్ మహిరంగ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ కూడా వెల్లు వెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో ‘ఓస్మా' పాత్ర పోషించిన నటి ఓజాస్ రజనీ స్పందించారు.

    ‘సినిమాలో ట్రాన్స్‌జెండర్స్ ను ఎంతమాత్రం కించపరచలేదు, ట్రాన్స్‌జెండర్స్‌ను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయనడం సరికాదు. ట్రాన్స్‌జెండర్స్‌కు సంబంధించిన సన్నివేశాలు కథానుగుణంగా పెట్టినవేనని అన్నారు. శంకర్ దర్శకత్వంలో మేకప్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు ఓజాస్ రజనీ.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Shankar didn’t try to offend transgenders: Ojas Rajani

    మరో వైపు ‘ఐ' సినిమాపై ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. కొనసాగుతున్న ఆందోళనలు శంకర్ ‘ఐ' చిత్రంలో ట్రాన్స్‌జెండర్ ఉమెన్స్‌ను కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయని విమర్శిస్తూ సౌతిండియా నటి, రచయిత, ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ స్మైలీ విద్య అలియాస్ స్మైలీ బహరింగలేఖ సంధించారు. శంకర్ చిత్రంలో కొన్ని సీన్లు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని కించ పరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

    ‘ఐ' సినిమాలో ఓస్మా పాత్రను ఓజాస్ రజనీ పోసించారు. ఓజాస్ రజనీ ఐశ్వర్యరాయ్ తో పాటు పలవురు బాలీవుడ్ స్టార్స్ స్టైలిస్ట్ గా పని చేసారు. అయితే ఓస్మా పాత్రను విలన్ పాత్రగా చిత్రీకరించడంపై ట్రాన్స్ జెండర్స్ ఆగ్రహంగా ఉన్నారు. దర్శకుడు శంకర్ ఇంటి ముందు ఆందోళన చేసేందుకు సిద్దపడ్డారు.

    శంకర్ ఇంటి వద్ద, సెన్సార్ బోర్డు ఆఫీసు వద్ద ధర్నా చేస్తామని చెన్నై సిటీకి చెందిన ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శంకర్ ఇంటికి పోలీసులు భద్రత ఏర్పాటు చేసారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు.

    ఈ చిత్రంలో విక్రమ్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించారు. శంకర్ దర్శకత్వం వహించాగా ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంద్రన్ నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించారు. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ మాత్రం బావున్నాయి.

    English summary
    Filmmaker Shankar hasn’t tried to offend the transgender community in his Tamil magnum opus “I”, says popular makeup artist Ojas M. Rajani, who essayed an important role in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X