twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైటిల్ మారింది..గమనించండి

    By Srikanya
    |

    హైదరాబాద్: సినిమా విడుదల అయ్యాక కలెక్షన్స్ కు కంటెంట్ ఎంత ముఖ్యమో... రిలీజ్ ముందు బిజినెస్ జరగటానికి టైటిల్ కూడా ఓ కీలకాంశమే. జనాల్లోకి వెళ్లేలా టైటిల్ పెట్టకపోతే చాలా సమస్య వస్తుంది. తాజాగా శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో రూపొంది విడుదలకు సిద్దమైన ‘ఐ'చిత్రం తెలుగు వెర్షన్ కు అదే సమస్య వచ్చినట్లుంది. తమిళ వెర్షన్ ‘ఐ' టైటిల్ పాపులర్ అయినంతగా తెలుగులో అనుకున్న ‘మనోహరుడు' టైటిల్ జనాల్లోకి వెళ్లలేదు. దాంతో ‘ఐ' తోనే తెలుగులోనూ విడుదల చేయటానికి నిర్ణయంచినట్లు సమచారం.

    ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు సుమారు 30 కోట్లకి సొంతం చేసుకున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు చెన్నైలో భారీ ఎత్తున జరగనుంది. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ హాజరు కానుండగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరుకానున్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ... చైనా నేపథ్యంలో జరిగే కథ ఇది. సినిమా ప్రారంభం, ముగింపు చైనాలోనే ఉంటుంది. అందుకే ఎక్కువ రోజులు అక్కడే షూటింగ్‌ చేశాం. సినిమాలో కొన్ని సీన్లు చూసిన చైనీయులు అవి చైనాలో ఎక్కడ తీశారో తెలుసుకోలేక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చైనాలో 15 వేల థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. అక్కడ విడుదలయ్యే తొలి భారతీయ దక్షిణాది చిత్రం ఇదే. చైనాలో 30 వేల థియేటర్లు ఉంటే అందులో సగం థియేటర్లలో మా సినిమా విడుదల కావడం మాకు గర్వకారణం అన్నారు.

    Shankar’s film gets a change in title

    శంకర్‌, ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్‌, ఏ.ఆర్‌. రెహమాన్‌, యాక్షన్‌ డైరెక్టర్‌ అణల్‌ అరసు వంటి టాప్‌ టెక్నీషియన్స్‌తో, విదేశీ సాంకేతిక నిపుణులతో హై టెక్నికల్‌ వాల్యూస్‌తో విజువల్‌ వండర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. ఈ సినిమాలో మా హీరో విక్రమ్‌ ఒక స్పెషల్‌ గెటప్‌లో కనిపిస్తారు. ఆ గెటప్‌ మేకప్‌ కోసం రోజూ 12 గంటలు పట్టేది. ‘ది లార్డ్స్‌ ఆఫ్‌ రింగ్స్‌', ‘ది హాబిట్‌' వంటి హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన ‘వేటా వర్క్‌ షాప్‌' మేకప్‌ టీమ్‌ మా సినిమా కోసం పనిచేసింది. మేకప్‌ కోసం ఒకరకమైన యాసిడ్‌ వాడారు. దాని వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే ఎక్కువ సేపు ఏ.సి.లో ఉండాలి. అందుకే సెట్‌లో పది అడుగుల ఎత్తున ఫ్రిజ్‌లాంటిది తయారు చేస్తే, అందులో ఉండేవారు విక్రమ్‌.

    ఈ గెటప్‌ కోసం 115 కిలోల బరువు పెరిగారు విక్రమ్‌. ఆ తరువాత ఆరు నెలలకు పాత్ర కోసం మళ్లీ 55 కిలోలకు ఆయన తన బరువు తగ్గించుకోవడం విశేషం. ఈ సినిమా కోసం 25 నెలలు ఎంతో కష్టపడ్డారు విక్రమ్‌. అందుకే అవార్డులన్నీ ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి. ఒక విచిత్రమైన గెటప్‌లో కనిపించే హీరో విక్రమ్‌, హీరోయిన్‌ ఎమీ జాక్సన్‌పై ఒక పాట తీశారు. మూడెకరాల స్థలంలో భారీ సెట్‌ వేసి, 40 రోజుల పాటు ఆ పాట చిత్రీకరించారు. ఈ పాటని ఏ.ఆర్‌.రెహమాన్‌ పాడటం విశేషం.

    English summary
    Vikram starrer ‘I’ which was titled ‘Manoharudu’ in Telugu, has not got a change in its title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X