»   » అఫీషియల్: 'గబ్బర్‌సింగ్ 2' పై శరత్ మరార్ వివరణ

అఫీషియల్: 'గబ్బర్‌సింగ్ 2' పై శరత్ మరార్ వివరణ

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, బాబి కాంబినేషన్ లో రూపొందనున్న 'గబ్బర్‌సింగ్ 2' చిత్రం ఆగిపోయిందని, బాబిని దర్శకుడుగా తీసేసారని,మరొకటని కంటిన్యూగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దానికి తగినట్లుగానే సినిమా చాలా కాలా నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లకుండా నత్త నడక నడుస్తోంది. ఈ నేపధ్యంలో శరద్ మరార్ ని కలిసి మీడియా వారు మాట్లాడారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శరద్ మరార్ మాట్లాడుతూ... ''స్క్రిప్టు పని జరుగుతోంది. భారీ సినిమా కాబట్టి, కావలసిన అంశాలను పక్కాగా ఖరారు చేసుకుంటున్నాం. దర్శకుడు బాబీ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అంతా సిద్ధం కాగానే షూటింగ్ ప్రారంభ తేదీ అధికారికంగా ప్రకటిస్తాం'' అని శరత్‌మరార్ వివరించారు.

అలాగే 'గబ్బర్‌సింగ్ 2' స్క్రిప్టు విషయంలో పవన్ కల్యాణ్ పూర్తిగా లీనమైపోయారట. దర్శకుడికి సలహాలు, సూచనలిస్తూ స్క్రిప్టు పకడ్బందీగా రావడానికి సాయపడుతున్నారని చెప్పుతున్నారు. వాస్తవానికి, మీడియాలోని వార్తల నేపథ్యంలో ముందుగా షూటింగ్ మొదలుపెట్టి, కొద్ది రోజులు జరిపి, ఊహాగానాలకు తెర దించాలనే ప్రతిపాదన కూడా వచ్చిందని, కానీ, పవన్ మాత్రం అలా వద్దనీ, పూర్తి స్క్రిప్టుతో, లొకేషన్లను కూడా పక్కాగా నిర్ణయించుకొని ఏకధాటిగా షూటింగ్ జరుపుదామనీ దర్శక, నిర్మాతలకు నచ్చజెప్పినట్లు చెప్తున్నారు.

Sharath Marar clarification about 'Gabbar Singh2'

అలాగే గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తానంటూ పవన్ చెప్పిన మాట నిజమే కానీ, దానికీ ఈ 'గబ్బర్ సింగ్2'కూ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి, 'గబ్బర్ సింగ్2' ఆగినట్లేననీ, 'గోపాల గోపాల...' దర్శకుడు డాలీని స్క్రిప్టుతో రమ్మనమని కోరింది ఈ సినిమాకేననీ వస్తున్న వార్తలు తప్పని తేలింది. అంటే... 'గబ్బర్ సింగ్2' బాబీతో ఉన్నట్లే అని తేలింది. అయితే చిత్ర రెగ్యులర్ షూటింగ్ కోసం మాత్రం మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు.

'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది.

ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని ఈ చిత్రంలోకి తీసుకురావటానికి ఈరోస్ వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

బాబీ మాట్లాడుతూ... ''గబ్బర్‌ సింగ్‌ సీక్వెల్‌ అంటే ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో తెలుసు. అవన్నీ మేళవించి ఈ కథను తయారు చేశాం. స్క్రిప్టు పక్కాగా పూర్తయింది. హీరోయిన్, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని చెబుతున్నారు.

గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది. 

English summary
Recent times we have heard many speculations regarding Gabbar Singh 2. Various rumours like director changed, project stopped, a bad script, financial concerns etc... But one man has put an end to all these rumours. And that is none other than Pawan Kalyan's dearest friend and Gabbar Singh 2 producer - Sharath Marar. Sharat clarified all the misconceptions regarding Gabbar Singh 2.
Please Wait while comments are loading...