twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు బర్త్ డే వేడుక ...శతమానం భవతి టీం, కుటుంబంతో కలిసి (ఫోటోస్)

    శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సతీష్‌ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'శతమానంభవతి. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సతీష్‌ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'శతమానంభవతి. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది.

    ఇదే రోజు ఈ చిత్ర నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు పుట్టినరోజు వేడుక కావడంతో..... ఆడియో వేడుకను హైద‌రాబాద్ అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు శతమానం భవతి టీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు, దిల్ రాజు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

    సినిమా గురించి దర్శకుడు తీష్ వేగేశ్న మాట్లాడుతూ - మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్య‌దేవోభ‌వ ఈ ప‌దాల‌ను మ‌నం చిన్న‌ప్పుడు నేర్చుకునే ఉంటాం. అయితే వీటి అర్థాల‌ను పూర్తిగా తెలుసుకునేట‌ప్ప‌టికీ మ‌నం త‌ల్లిదండ్రుల‌కు దూరంగా ఉంటాం. ఇలాంటి ఓ ఆలోచ‌న నుండి పుట్టిన క‌థే మా శ‌త‌మానంభ‌వ‌తి. మంచి క‌థ‌లు తెలుగు ఇండస్ట్రీలో లేవా అని అనేవాళ్లు చాలా మంచి ఉన్నారు. అయితే ఓ మంచి క‌థ‌ను రాసుకుంటే ఆ క‌థ‌ను నా కంటే ఎక్కువగా న‌మ్మి, ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం పాటు ట్రావెల్ చేసి సినిమా చేసిన వ్య‌క్తి దిల్‌రాజుగారు. ఈ సినిమాకు శ‌త‌మానం భ‌వ‌తి అనే టైటిల్‌ను కూడా ఆయ‌నే పెట్టారు.

     దర్శకుడు మాట్లాడుతూ...

    దర్శకుడు మాట్లాడుతూ...

    ఇక శ‌ర్వానంద్‌గారికి క‌థ చెప్ప‌డానికి వెళ్లిన‌ప్పుడు స‌తీష్‌గారు క‌థ విని న‌చ్చితేనే చేస్తాన‌ని అన్నారు. ముందు భయపడ్డాను కానీ క‌థ విన‌గానే చేస్తానని అన్నారు. 49 రోజుల్లో సినిమాను ఐదు పాట‌ల‌తో స‌హా సినిమాను పూర్తి చేశాం. ఇంత త‌ర్వ‌గా సినిమాను పూర్తి చేయ‌డానికి కార‌ణం నా టీమ్‌. ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌సుధ వంటి న‌టీన‌టుల‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం క‌లిగింది. అలాగే మిగిలిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్‌`` అన్నారు.

     దిల్ రాజు తాత అయ్యాడు

    దిల్ రాజు తాత అయ్యాడు

    వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ - ``తాత‌గారిగా దిల్‌రాజుగారు జ‌రుపుకుంటున్న మొద‌టి పుట్టిన‌రోజు ఇది. కాబ‌ట్టి `శ‌త‌మానం భ‌వ‌తి` దిల్‌రాజుగారికి స్పెష‌ల్ మూవీ. ఒక కుటుంబ విలువ‌ల‌ను మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి తీసుకొచ్చింది దిల్‌రాజుగారే. ఇది ఆయ‌న గురించి గ‌ర్వంగా కూడా చెబుతాను అన్నారు.

    రామానాయుడి తర్వాత దిల్ రాజే

    రామానాయుడి తర్వాత దిల్ రాజే

    జ‌య‌సుధ మాట్లాడుతూ - ``రామానాయుడుగారి నుండి ఎంతో మంది నిర్మాత‌ల‌ను చూశాను. ఈ జ‌న‌రేష‌న్‌లో దిల్‌రాజుగారికి సినిమాపై ఉన్నంత ప్యాష‌న్ మరో నిర్మాత దగ్గర చూడలేదు. ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌ను, కుటుంబ విలువ‌ల‌ను మ‌ర‌చిపోకూడ‌ద‌ని మంచి మెసేజ్‌ల‌తో కూడా చిత్రాల‌ను చేసే నిర్మాత దిల్‌రాజు అండ్ టీం. నేను ఆయ‌న బ్యాన‌ర్‌లో చేసిన సినిమాల‌న్నీ నాకు చాలా మంచి పేరు తెచ్చాయి. బొమ్మ‌రిల్లు సినిమా అయితే ఓ న‌టిగా నాకు గుర్తుండిపోతుంది. అలాగే శ‌త‌మానం భ‌వ‌తి సినిమాకు అలాగే నిలిచిపోతుంది అన్నారు.

     మా ఫ్యామిలీ సపోర్టు వల్లే

    మా ఫ్యామిలీ సపోర్టు వల్లే

    దిల్‌రాజు మాట్లాడుతూ - ``నేను ఈ రోజు ఇక్క‌డ వ‌ర‌కు ట్రావెల్ చేశానంటే అందుకు కార‌ణం మా ఫ్యామిలీ స‌భ్యులే. సపోర్ట్ చేసిన కాస్ట్యూమ్ కృష్ణ‌, జ‌య‌సుధ‌గారికి థాంక్స్‌. నేను ఈ సినిమాను ఎంత ప్యాష‌న్‌గా తీసుకున్నానో, సినిమాలో ప‌నిచేసి ప్ర‌తి ఒక ఆర్టిస్ట్‌, టెక్నిషియ‌న్ అంతే ప్యాష‌న్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల సినిమా చాలా త్వర‌గా పూర్త‌య్యింది. స‌తీష్‌కు ఈ క‌థ ఐడియాకు వ‌చ్చిన‌ప్పుడు నాకు చెప్పాడు. మ‌న‌మైనా, మ‌న త‌ల్లిదండ్రులైనా, లేదా మ‌న ఫ్యామిలీలో ఎవ‌రో ఒకరు ప‌ల్లెటూరు నుండి వ‌చ్చిన‌వారే. ఈ ఫాస్ట్‌లైఫ్‌లో ప‌డి మ‌నం చాలా ఎమోష‌న్స్‌ను మిస్ అయిపోతున్నాం. అందుకే ఈ మూడు జ‌న‌రేష‌న్స్ మ‌ధ్య జ‌రిగే క‌థ అని తెలియ‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాను. మంచి సినిమాను నాకు ఇచ్చినందుకు డైరెక్ట‌ర్ స‌తీష్‌కు థాంక్స్‌. కొత్త సినిమా అని చెప్ప‌ను కానీ..ప్ర‌తి మూమెంట్ బ్యూటీఫుల్‌గా ఉంటుంది. ప‌ల్లెటూర్లో పుట్టిన ప్ర‌తివారు ఒక‌సారి వెన‌క్కి వెళ‌తారు. మ‌న స్మృతుల‌ను గుర్తు చేసుకునేలా సినిమా రూపొందింది. సంక్రాంతికి సినిమాను అందిస్తున్నాం. మంచి సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఆదరిస్తార‌ని న‌మ్ముతున్నాం`` అన్నారు.

     నటీ నటులు :

    నటీ నటులు :

    శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ , ప్రకాష్ రాజ్ , జయసుధ , ఇంద్రజ , శివాజీ రాజా , ప్రవీణ్ , సిజ్జు , శ్రీ రాం , మధురిమ , నీల్యా , ప్రమోదిని, మహేష్ , భద్రం , హిమజ , ప్రభు తదితరులు

    సాంకేతిక నిపుణులు :

    సాంకేతిక నిపుణులు :

    ఛాయాగ్రహణం - సమీర్ రెడ్డి
    సంగీతం - మిక్కీ జె. మేయర్
    సాహిత్యం - శ్రీ సీతారామశాస్త్రి , రామజోగయ్య శాస్త్రి
    కూర్పు - మధు
    కళా దర్శకుడు - రమణ వంక
    కథ - కథనం -మాటలు-దర్శకత్వం - వేగేశ్న సతీష్.

    English summary
    Shatamanam Bhavathi Movie Audio Release Function held at Hyderabad. Sharwanand, Anupama Parameswaran, Dil Raju, Jayasudha, Indraja, Nikhil, Raj Tarun, Sekhar Kammula, Satish Vegesna, Mickey J Meyer, Raja Ravindra, Ramajogayya Sastry, Vamsi Paidipally, Mithuna Waliya, Vijaya Naresh graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X