» 

'అజయ్‌శాస్త్రి మిస్సింగ్‌' అంటూ శేఖర్ కమ్ముల

Posted by:

Shekar Kammula
హైదరాబాద్ : పబ్లిసిటీ లేకపోతే ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా నిలబడటం లేదు. ఆ విషయం బాగా అర్దం చేసుకున్న శేఖర్ కమ్ముల తన తాజా చిత్రం 'అనామిక' కు పబ్లిసిటీ మొదలెట్టారు. తనదైన శైలిలో వైవిధ్యంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా సంక్రాంతి పతంగులపై అజయ్‌శాస్త్రి మిస్సింగ్‌ అని ప్రత్యేకంగా ఓ ప్రకటన ముద్రించారు. పతంగులపై ఆ ప్రకటనని చూసిన అందరూ ఆసక్తిగా మాట్లాడుకోవడం కనిపించింది.

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... భర్త పేరు... అజయ్‌శాస్త్రి. వయసు 31 సంవత్సరాలు. ఎక్కడో తప్పిపోయాడు. అతని కోసమే అన్వేషణ సాగిస్తోంది భార్య అనామిక. అజయ్‌ కోసం ఎక్కని గడప లేదు, తిరగని చోటూ లేదు. మరి అతను ఎక్కడున్నాడు? అనామికకి దొరికాడో లేదో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు .

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అనామిక' . నయనతార ప్రధాన పాత్ర పోషించింది. హర్షవర్ధన్‌ రాణే, వైభవ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. సినిమాకి హిందీలో విజయవంతమైన 'కహానీ' చిత్రానికి రీమేక్‌గా 'అనామిక' తెరకెక్కింది.

Read more about: anamika, nayantara, sekhar kammula, kahani, అనామిక, నయనతార, శేఖర్ కమ్ముల
English summary
Sekhar Kammula is named for his promotional skills and he once again proved his versatility with the promotions of his upcoming flick Anamika. It is known that Anamika deals with a missing case of patrogonist’s husband. This film is a Bollywood remake! So Sekhar Kammula started promotions of Anamika during Sankranthi by selling kites on which a tagline ‘Ajay Shastri Missing’ is printed along with a face. Anamika is a remake of Vidya Balan’s Kahaani.
Please Wait while comments are loading...