twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టండి...రూ. లక్ష పొందండి

    By Srikanya
    |

    ముంబై: శివసేన కార్యకర్తలు మరోసారి తనదైన శైలిలో నిరసనకు దిగారు. మత అసహనంపై బాలీవుడ్ హీరో ఆమిర్‌ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై శివసేన పంజాబ్ నాయకులు ఆందోళన చేపట్టారు. లుధియానాలో 'దంగల్' సినిమా యూనిట్ బస చేసిన ఎంబీడీ రాడిసన్ బ్లూ హోటల్ వద్ద నిరసనకు దిగారు. అంతటితో ఆగకుండా ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టిన వారికి లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు.

    'ఎవరైనా ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొడితే ప్రతి దెబ్బకు శివసేన తరపున లక్ష రూపాయల చొప్పున అందజేస్తాం' అని శివసేన పంజాబ్ విభాగం అధ్యక్షుడు రాజీవ్ టాండన్ ప్రకటించారు. ఈ ఆఫర్ ను 'దంగల్' సినిమా టీమ్ సభ్యులు, ఎంబీడీ రాడిసన్ బ్లూ హోటల్ సిబ్బంది కూడా వినియోగించుకోవచ్చన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టినవారిని సాహసవంతులు, దేశభక్తి కలిగిన వారిగా గౌరవిస్తామని చెప్పారు. శివసేన ఆందోళన నేపథ్యంలో హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, వారం రోజుల విశ్రాంతి తర్వాత 'దంగల్' సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమిర్‌ ఖాన్ గురువారం ఉదయం లుధియానా చేరుకున్నారు. కండరాలు పట్టేయడంతో వారంపాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు.

    Shiv Sena offers Rs 1 lakh 'reward' to anyone who slaps Aamir

    మరో ప్రక్క అమీర్‌ ఖాన్‌ వివాదాస్పర వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై కాన్పూర్‌లో కేసు నమోదు అయింది. దేశంలో మత విద్వేషాలు రగిలిస్తున్నారని పేర్కొంటూ కొంతమంది ఆయనపై కార్పూర్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

    అమీర్‌పై ఐపీసీ 295ఏ, 160ఏ సెక్షన్‌ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కూడా పోలీసులు అమీర్ ఖాన్ పై కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ 1న కాన్పూర్‌ సెషన్స్‌ కోర్టు ముందు హాజరు కావాలని న్యాయస్థానం అమీర్‌ ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది.

    మరో ప్రక్క ఆమీర్‌ఖాన్‌కి తగినంత భద్రత ఏర్పాటు చేసినట్లు ముంబయిలోని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దేశంలో అసహనంపై ఆమీర్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

    డిల్లీలో మొన్న జరిగిన రామ్‌నాథ్‌ గోయెంకా ఎక్సెలెన్స్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమీర్‌ ఖాన్‌ దేశంలో అసహనంపై మాట్లాడారు. దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై తాను కలత చెందినట్లు చెప్పారు. ఇవి తట్టుకోలేక తన భార్య కిరణ్‌రావు.. దేశం వదిలి వెళ్లిపోదామని కోరిందని ఆమీర్‌ చెప్పారు. దీనిపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భద్రత ఏర్పాటు చేశారు.

    దేశంలో అసహనంపై బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆమీర్‌ వ్యాఖ్యలపట్ల బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అనుపమ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆమీర్‌పై పలు ప్రశ్నలు సంధించారు.

    'ఏ దేశం వెళ్దామని మీరు... మీ భార్య కిరణ్‌రావుని అడిగారా. ఈ దేశం మిమ్మల్ని ఆమీర్‌ ఖాన్‌గా గుర్తింపు తెచ్చిపెట్టిందని అనుపమ్‌ఖేర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'భారత్‌ అసహన దేశంగా మీకు గత 8 నెలల నుంచి అనిపించిందా?. దేశంలో అసహనం ఉంటే భారతీయులకు ఏమని సలహా ఇస్తారు..? భారత్‌ వదిలివెళ్లిపోమని చెబుతారా' అని ప్రశ్నించారు.

    English summary
    Rajeev Tandon, Punjab chairman, Shiv Sena, claimed that “any person who will slap Aamir Khan will get Rs 1 lakh for each slap from the Shiv Sena”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X