twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవికి పెయిన్ లేకుండా చేసా, హిజ్రాలు నాకు లక్కీ: లారెన్స్

    కాంచన మూవీతో తెలుగు బాక్సాఫీసు వద్ద తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పాటు చేసుకున్న లారెన్స్ త్వరలో ‘శివ లింగ’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కాంచన మూవీతో తెలుగు బాక్సాఫీసు వద్ద తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పాటు చేసుకున్న లారెన్స్ త్వరలో 'శివ లింగ' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

    వాసు దర్శకత్వంలో అభిషేక్‌ ఫిలిమ్స్‌ పతాకంపై రమేశ్ పి. పిళ్లై నిర్మించిన ఈ చిత్రాన్ని సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత మల్కాపురం శివకుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా లారెన్స్ మీడియాతో ముచ్చటించారు.

    శివ లింగ

    శివ లింగ

    ‘శివలింగ' ఇంతకు ముందు వచ్చిన నా హారర్ సినిమాల్లా ఉండదు. ఒక డిఫరెంట్ కథాంశం. ‘చంద్రముఖి' తరహాలో ఉంటుంది. నేను రజనీకాంత్ గారి వీరాభిమానిని. ఆయనకు ఇష్టమైన ఐదుగురు దర్శకుల్లో ఒకరైన పి. వాసుగారు ఈ సినిమా దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది అన్నారు.

    తెలుగు వాళ్లకి కావాల్సిన మసాలా

    తెలుగు వాళ్లకి కావాల్సిన మసాలా

    సినిమాలో సస్పెన్స్, హారర్‌, మంచి సెంటిమెంట్‌, యాక్షన్, కామెడీ.. మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సినవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. తెలుగు, తమిళం కోసం కొన్ని మార్పులు చేశాం. క్లైమాక్స్‌ మార్చాం. నేనంటే డాన్స్‌లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు... అన్ని కలిపి ఈ సినిమా తీసామని తెలిపారు.

    రితిక గురించి

    రితిక గురించి

    ‘చంద్రముఖి'లో జ్యోతిక మేడమ్‌ గురించి ఎలా మాట్లాడుకున్నారో, ఈ సినిమాలో రితిక గురించి అలాగే మాట్లాడుకుంటారు. నేను మొదటే చెప్పాను.. ఈ సినిమాకు అసలు హీరో రితికేనని. ఆమెది అంత పవర్‌ఫుల్‌ కేరక్టర్‌. ఆమె మంచి ఫైటర్‌ అని అందరికీ తెలుసు. ఈ సినిమాతో తను మంచి డాన్సర్‌గానూ నిరూపించుకుంటుంది. నిజ జీవితంలో రితిక ఏమిటో ‘గురు'లో ఆమె కేరక్టర్‌ అదే. ‘శివలింగ'లో దానికి పూర్తి భిన్నమైన హోమ్లీ అమ్మాయి కేరక్టర్‌. ఇంటర్వెల్‌ బ్లాక్‌ లో రితికను చూసి అంతా షాకవుతారు అని లారెన్స్ తెలిపారు.

    rn

    హిజ్రాలకు నేను బ్రాండ్ అంబాసిడర్

    ‘కాంచన' సినిమా తర్వాత హిజ్రాలు కూడా మా బృందంలో భాగమయ్యారు. మా ట్రస్టు తరుపున పని చేస్తున్నారు. వాళ్ల సంఘానికి నన్ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకొన్నారు. నా సినిమా ఏదైనా మొదలవుతుందంటే హిజ్రాల సంఘం బ్యాంక్‌ అకౌంట్‌లో కొంత డబ్బు వేస్తాను. ఆ సెంటిమెంట్‌ నాకు వర్కవుట్‌ అవుతుందని నమ్మకం. నా దృష్టిలో వాళ్లు అదృష్టలక్ష్ములు అని లారెన్స్ తెలిపారు.

    చిరంజీవి అవగ్గానే వాలిపోయాను

    చిరంజీవి అవగ్గానే వాలిపోయాను

    మెగాస్టార్ 150వ సినిమా రత్తాలు సాంగు కోసం...ఒక రోజు చిరంజీవిగారు ఫోన్ చేశారు. ఏంట్రా బావున్నావా ఒక హెల్ప్ చేసి పెడతావా... నా సినిమాకు సాంగ్ కంపోజ్ చేయాలి అన్నారు. అయ్యా మీరు నన్ను హెల్ప్ అడగటం ఏమిటి...అని ఆయన చెప్పిన వెంటనే హైదరాబాద్‌లో వాలిపోయాను అని లారెన్స్ తెలిపారు.

    పేరు కోసంకాదు..ఆయనకు పెయిన్ రాకుండా ఉండాలని చేసా

    పేరు కోసంకాదు..ఆయనకు పెయిన్ రాకుండా ఉండాలని చేసా

    ‘రత్తాలు రత్తాలు..' పాట కోసం చిరంజీవిగారితో సూపర్‌ స్టెప్స్‌ వేయించి ఏదో పేరు కొట్టేయాలని చేయలేదు....ఈ వయసులో ఆయనను సౌకర్యంగా, బ్యాక్‌ పెయిన్ లేకుండా ఇంటికి వెళ్లాలి అనే ఉద్దేశ్యంతో చేసాను. వయసుకు తగ్గట్లే ఆయనతో స్టెప్స్‌ వేయించాను అన్నారు లారెన్స్.

    ముందే కండీషన్ పెట్టా

    ముందే కండీషన్ పెట్టా

    ముందుగానే పాట చేసినందుకు నాకేమీ డబ్బు వద్దనీ, వదినమ్మ చేసే దోశలు మాత్రం కావాలనీ కండిషన్ పెట్టాను. ఆ పాట చేసినన్ని రోజులూ అన్నయ్యతో తో పాటు నాకు కూడా వదినమ్మ టిఫిన్ బాక్స్‌, లంచ్ బాక్స్‌ పంపించేది. టిఫిన్ బాక్సులో ‘చిరు దోశలు', లంచ్ బాక్సులో చికెన్ ఉండేది అని లారెన్స్ గుర్తు చేసుకున్నారు.

    English summary
    Raghava Lawrence, Ritika Singh, P Vasu, Shakthi Vasudevan, Malkapuram Shivakumar, Bellamkonda Suresh graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X