twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రమ్య దూకుడే కొంపముంచింది, స్టార్స్ అంతా ఔట్(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    బెంగుళూరు: తేడాది జరిగిన ఉప ఎన్నికలో మాండ్యా పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొంది కన్నడ హీరోయిన్ రమ్య ఈ సారి ఎన్నికల్లో ఓడి పోయింది. అయితే ఆమె ఓటమికి కారణం దూకుడు తనమే అని అంటున్నారు. గడిచిన 8 నెలల కాలంలో సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఆమె మూటగట్టుకున్నారట. ఆమె దూకుడు ప్రవర్తనను పార్టీ కార్యకర్తలు సహించలేక పోయారని టాక్.

    రమ్యతో పాటు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది కన్నడ సినీ స్టార్స్ ఓటమి పాలయ్యారు. ఈ సారి కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయమున్న ఒక్క సినీ స్టార్ కూడా ఎన్నికల్లో విజయదుందుబి మ్రోగించలేక పోయారు. వారి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో చూద్దాం....

    రమ్య

    రమ్య


    సాండల్ వుడ్ క్వీన్ రమ్య మాండ్యా పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

    గీతా శివరాజ్ కుమార్

    గీతా శివరాజ్ కుమార్


    స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న గీతా శివరాజ్ కుమార్ శిమోగా లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప చేతిలో ఓటమి పాలయ్యారు.

    కుమార స్వామి

    కుమార స్వామి


    ప్రొడ్యూసర్ నుండి పొలిటిషియన్‌గా మారిన హెచ్ డి కుమారస్వామి వీరప్ప మొయిలీకి పోటీగా లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

    నగ్మా

    నగ్మా


    కన్నడ చిత్ర సీమకు బాగా పరిచయమున్న భామల్లో నగ్మా ఒకరు. ఆమె మీరట్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

    విజయశాంతి

    విజయశాంతి


    కన్నడ చిత్ర సీమకు పరిచయమున్న తెలుగు హీరోయిన్ విజయశాంతి కూడా ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

    జయప్రద

    జయప్రద


    కన్నడ చిత్ర సీమకు పరిచయమున్న మరో తెలుగు నటి జయప్రద. ఆమె కూడా ఈసారి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

    కె శివరామ్

    కె శివరామ్


    సివిల్ సర్వెంట్ నుండి కన్నడ సినీ స్టార్‌గా మారిన కె.శివరామ్ కూడా బీజాపూర్ లోక్ సభ నుండి పోటీ చేసి ఓడి పోయారు.

    English summary
    
 Few of the Sandalwood's celebrities had tested their luck in Lok Sabha elections 2014 from different Lok Sabha constituency. Unfortunately none of the Kannada actors and actresses were successful in wowing the voters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X