»   » గుండె ముక్కలైనట్టు అనిపించింది..! త్వరలో కలుస్తాం..! ఇన్నాళ్ళకి మనసువిప్పిన రణ్ బీర్

గుండె ముక్కలైనట్టు అనిపించింది..! త్వరలో కలుస్తాం..! ఇన్నాళ్ళకి మనసువిప్పిన రణ్ బీర్

Posted by:
Subscribe to Filmibeat Telugu

రణ్ బీర్ కపూర్ కత్రినా కైఫ్ ఇద్దరూ ఒకరిని ఒకరు కలిసేనాటికే చెరో విఫల ప్రేమని చవి చూసారు. అటు దీపికా పదుకోణ్ తో రణ్ బీర్, ఇటు సల్మాన్ తో కత్రినా తెగదెంపులు చేసుకొని ఉన్నారు. కానీ ఈ ఇద్దరిమధ్య ప్రేమ పుట్టిన తర్వాత ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమలోతుల్లో మునిగిపోయిన సంగతి తెలిసిందే.

వీరి సాన్నిహిత్యం చూసిన జనాలంతా వీరు త్వరలో మూడు ముళ్ల బంధం ద్వారా ఒకటైపోతారని కూడా భావించారు. కత్రినా కూడా పలుమార్లు తమ వివాహం గురించి కూడా ప్రస్తావించింది. ఇంతలోనే ఏమైందో కానీ తూచ్..అంటే తూచ్ అనుకున్నారిద్దరూ.. .దాదాపుగా పెళ్ళీవరకూ వచ్చిన వీరి బందం ఎందుకోగానీ అకస్మాత్తుగా తెగిపోయింది.

ఈ సమవత్సరం మొప్దటివరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రణబీర్ కపూర్- కత్రినా కైఫ్ లు సడెన్ గా విడిపోయి.. ఎవరికివారే అన్నట్లుగా మారిపోయారు. అసలు 2016కు వీళ్ల బ్రేకప్ తోనే బాలీవుడ్ వెల్ కం చెప్పింది. వీళ్లెందుకు విడిపోయారనే విషయంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు... ఎప్పూడూ ఎక్కడా నోరు విప్పలేదు... ఇద్దరూ మౌనం గానే ఉండిపోయారు.. కానీ ఎక్కువ రోజులు భాదని దాచుకోలేక పోయాడేమో రణ్ బీర్ మాత్రం బయట పడిపోయాడు.... తన గుండె ముక్కలైనట్టుగా అనిపించిందంటూ తమ బ్రేకప్ పై నోరు విప్పాడు.....

ఆరేళ్లకు పైగా

రణబీర్ కపూర్-కత్రినా కైఫ్ లు ఆరేళ్లకు పైగా ప్రేమించేసుకున్న జంట. ఇంత సుదీర్ఘ కాలం ప్రేమలో ఉన్నాక విడిపోవడమంటే చిన్న విషయం కాదు.

వివాహం గురించి చెప్పింది

వీరి సాన్నిహిత్యం చూసిన జనాలంతా వీరు త్వరలో మూడు ముళ్ల బంధం ద్వారా ఒకటైపోతారని కూడా భావించారు. కత్రినా కూడా పలుమార్లు తమ వివాహం గురించి కూడా ప్రస్తావించింది.

అంతలోనే

ఇంతలోనే ఏమైందో కానీ తూచ్..అంటే తూచ్ అనుకున్నారిద్దరూ.. అక్కడితో వీళ్ళ ప్రేమకథ ముగిసినట్టే అని నిర్థారించేసుకున్నారు బాలీవుడ్ జనాలు.

పెద్దలకు నచ్చలేదు

రణ్ బీర్ ఇంట్లో వాళ్ళకి క్యాట్ నచ్చక పోవటమూ ఒక కారణం అన్నది మాత్రం అందరికీ తెలిసిన విషయమే.అయితే వీరిద్దరి మధ్య కూడా ఉన్న కారణాలేమిటో ఎవరికీ తెలియదు. ఆ విషయమ్మీద ఇన్నాళకు నోరు విప్పాదు రణ్

విభేదాలు

"మా భందాన్ని చాలా కారణాలే దెబ్బతీసాయి. ఆధారం లేని రూమర్లు.. రిపోర్టులు.. అంచనాల కారణంగా విబేధాలు తలెత్తాయి.,

కలత పడ్డాను

నా పేరెంట్స్ తర్వాత నా లైఫ్ లో అత్యంత ముఖ్యమైన.. ప్రభావం చూపే వ్యక్తి ఆమే అనుకోవడంతో.. ఈ సంఘటన నన్ను బాగా కలతకు గురిచేసింది" అంటూ ఓపెన్ అయిపోయాడు రణబీర్ కపూర్.

అవన్నీ నమ్మకండీ

అయితే తామిద్దరూ మళ్ళీ తిరిగి కలుస్తున్నట్లు.. ప్రత్యేకంగా మీట్ అయినట్లు వచ్చిన వార్తలని పుకార్లే అంటూ కొట్టిపడేసాడు...

త్వరలో

ఈ మధ్య కాలంలో కత్రినాని కలవలేదు కానీ త్వరలోనే మేం కలుసుకోవచ్చు... అయితే అది వృత్తిలో భాగం గా మాత్రమే... డేట్ కూడా ఇచ్చాడు.

జగ్గా జుసూస్

'సెప్టెంబర్ 10న మేమిద్దరం కలవొచ్చు. ఎందుకంటే ఆ రోజు నుంచి "జగ్గా జాసూస్" షూటింగ్ మొదలవుతుంది" అంటూ బ్రేకప్ పై గుండెని విప్పాడు...

కత్రినా కరిగి పోవచ్చేమో

ఏమో మళ్ళీ ఈ సారి ఎదురు పడితే ఇవే ముక్కలు చెప్తే కత్రినా కరిగి పోవచ్చేమో ... మళ్ళీ ప్రేమ పుట్తకూడదనేముంది? బెస్టాఫ్ లక్ రణ్ బీరూ....

English summary
Bollywood Hero Ranbir Kapoor Finally Talks About His Breakup With Katrina Kaif..
Please Wait while comments are loading...