twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదేం శాడిజం :శ్రద్దాదాస్ ని కర్రతో చావ కొట్టింది

    By Srikanya
    |

    ముంబై:షూటింగ్ లలో భాగంగా ఒకరినొకరు కొట్టడం కామన్. అయితే అందుకోసం ఫేక్ స్టిక్ లు వాడతారు. అలాగే రియల్ గా కొట్టరు. కొట్టినట్లు నటిస్తారు. అవతలివాళ్లు దెబ్బ తగిలినట్లు నటిస్తూంటారు. అయితే తాజాగా అలాంటిదేమీ పట్టించుకోకుండా నిజంగానే కొట్టిందని హీరోయిన్ శ్రద్దాదాస్ కంప్లైట్ చేస్తోంది. సెట్స్ పై ఒరిజనల్ కర్ర తీసుకుని సీరియస్ గా కొట్టిందని, దాంతో తాను హాస్పటిల్ లో ఉండాల్సి వచ్చిందని మీడియావద్ద బ్లాస్ట్ అయ్యింది.

    ఇదంతా ప్రియాంక చోప్రా సోదరి మనారా హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం జిద్ షూటింగ్ లో జిరిగిందని వాపోతోంది. అలాగే ఇదే తొలిసారి కాదని అంటోంది. ఒకసారి నిజంగానే లెంపకాయ కొట్టిందని...అది ఏదో పొరపాటన జరిగిందని సరిపెట్టుకున్నాని, కాని తర్వాత అలాంటిదే రిపీట్ అయ్యిందని అంటోంది. తర్వాత ఫేక్ స్టిక్ లు వాడాల్సిన చోట..నిజమైన కర్రతో కొట్టిందని అంటోంది. అప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యిందని, దెబ్బలు గట్టిగా తగిలి హాస్పటిల్ లో ఉండాల్సి వచ్చిందని అంటోంది.

    Shraddha Das: I don't want to ever work with Mannara again!


    చిత్రం విషయానికి వస్తే...

    ''తొలి సినిమా అనేసరికి ఆ నటుల మీద కొన్ని అంచనాలు ఉంటాయి. నా విషయం మాత్రం ఇందుకు విరుద్ధం. నా తొలి చిత్రం తొలి రూపు (ఫస్ట్‌ లుక్‌) వచ్చిన తర్వాత నాపై అంచనాలు పెరిగాయి. పరిశ్రమ నుంచి చాలా మంది నన్ను స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపారు'' అంటోంది మనారా అలియాస్‌ బార్బీ హండా.

    'ప్రేమ గీమా జాన్‌తానయ్‌'తో తెలుగులో వెండితెరకు పరిచయమైన ఈ భామ మనారాగా పేరు మార్చుకొని 'జిద్‌' ద్వారా హిందీలోకి వచ్చింది. ట్రైలర్‌తోనే 'మనారా చాలా హాట్‌గురూ' అని ప్రేక్షకులు అనుకున్నారు. ఈ కామెంట్లు నచ్చలేదేమో మనారా కాస్త కటువుగానే సమాధానమిచ్చింది.

    ''నేను సినిమా పరిశ్రమలోకి వచ్చింది అందాల బొమ్మగా మిగిలిపోవడానికి కాదు. మంచి నటిగా పేరు తెచ్చుకోవడానికి. మనకిచ్చిన పాత్రను సమర్థవంతంగా చేసి మెప్పించగలగాలి. 'జిద్‌' విషయంలో నేనదే చేశాను. ఆ పాత్రకు తగ్గట్టుగానే హాట్‌ హాట్‌గా కనిపించాను. అందరూ అందులో 'మనారా బోల్డ్‌గా కనిపించింది' అంటున్నారు. నేను బోల్డ్‌ కాదు... నా పాత్ర బోల్డ్‌'' అని చెప్పుకొచ్చింది.

    English summary
    Recalling a horrible incident with Mannara, Sharddha says “There was this scene that required the both of us to enter into a scuffle and she ended up hitting me for real. I told her to be less aggressive. I can understand you can perhaps slap someone for real to get a genuine reaction on screen but I don’t understand battering someone for no reason.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X