» 

తన సెక్సీ ఫిగర్ గురించి... సెక్సీగా చెప్పిన శ్రీయ!

Posted by:
Give your rating:

హైదరాబాద్ : హీరోలు తమ గురించి, తమ నటన గురించి చెప్పుకుంటే డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది.....అదే ఓ అందమైన హీరోయిన్ అలా మాట్లాడితే మాత్రం భిన్న కోణంలో చూస్తారు జనాలు. శ్రీయన తన సెక్సీ ఫిగర్ గురించి వర్ణించుకోవడం చాలా సెక్సీగా ఉందంటున్నారు సినీప్రియులు.

ఓ ప్రముఖ దిన పత్రికతో శ్రీయ మాట్లాడుతూ.....'నా ఫిగర్ ఐటం సాంగులకు పర్‌ఫెక్టుగా సరిపోయే విధంగా ఉంటుంది...అందుకే ఐటం సాంగులు చేయడానికి ఒప్పుకుంటున్నాను. కెరీర్ ముగింపుకు చేరుకోబట్టే ఇలాంటి చేస్తున్నాను అనడం సరికాదు. ఏ నటి కూడా ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకూడదు. వివిధ రకాలు ప్రేక్షకులను మెప్పించాలి. అందుకే నేను వీలైనన్ని ప్రయోగాత్మక పాత్రల్లో చేసాను' అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం శ్రీయకు అవకాశాలు తగ్గిన నేపథ్యంలో ఆమె కెరీర్ ముగింపుకు చేరుకున్నట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటిగా మీ స్థానం ఏమిటి అని ప్రశ్నించగా శ్రీయ స్పందిస్తూ...'ఆ విషయం నాకూ తెలియదు. గమ్యం చేరుకున్నవాళ్లే వెనక్కి తిరిగి తీసుకుంటారు. ఒక్కసారి అలా తిరిగి చూసుకున్నారంటే ఇక ముందుకు వెళ్లలేరని నమ్ముతుంటాను. సినిమా రంగంలో నా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది' అని బదులిచ్చారు.

ప్రస్తుతం శ్రీయ అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ మూవీ 'మనం'లో నటిస్తున్నారు. ఇందులో ఆమె నాగార్జునకు జోడీగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఇష్క్' ఫేం విక్రమ్‌కుమార్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read more about: shriya, nagarjuna, manam, నాగార్జున, మనం, శ్రీయ
English summary
“My figure is perfect for item songs and that is why I accepted to do them. I don’t have any regrets. My career is not yet over. An actress should not allow herself to be slotted into one particular image”, Shriya told a Leading Telugu Daily.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive