»   » ఈ గొడవ అంతా ఎందుకు? అసలు పెళ్లి మానేస్తే పోలా.. నేడు శృతి బర్త్ డే

ఈ గొడవ అంతా ఎందుకు? అసలు పెళ్లి మానేస్తే పోలా.. నేడు శృతి బర్త్ డే

తొలుత ఫ్లాప్ లతో సతమతమైన శృతి గబ్బర్ సింగ్ విజయంతో స్టార్ హీరోయిన్ గా మారారు. విలక్షణ నటుడు కమల్ హాసన్‌గా సినీ పరిశ్రమకు పరిచయమైన శృతిహాసన్ జనవరి 28న జన్మదినం జరుపుకొంటున్నారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో ఐరెన్ లెగ్‌గా ఒకసారి ముద్ర పడిందంటే ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఇక స్టార్ పరిస్థితి అంతే. అలాంటి ముద్రను చెరిపేసుకొని గోల్డెన్ లెగ్‌గా మారిన అతికొద్ది మందిలో శ‌ృతిహాసన్ ఒకరు. తొలుత ఫ్లాప్ లతో సతమతమైన శృతి గబ్బర్ సింగ్ విజయంతో స్టార్ హీరోయిన్ గా మారారు. విలక్షణ నటుడు కమల్ హాసన్‌గా సినీ పరిశ్రమకు పరిచయమైన శృతిహాసన్ జనవరి 28న జన్మదినం జరుపుకొంటున్నారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు బాలీవుడ్‌లోను స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన శృతిహాసన్‌కు చిన్నతనం నుంచి హీరోయిన్‌ కావాలనే కోరిక లేదట. చిన్నప్పుడు కాస్త నల్లగా ఉండటంతో హీరోయిన్‌గా పనికి రాదనుకొనేదట. గాయనిగా సినీ పరిశ్రమలో ఉండాలనుకొన్నారట. యుక్త వయస్సు వచ్చేసరికే అందంగా కనిపించడంతో ఆత్మవిశ్వాసం పెరిగి హీరోయిన్‌గా ట్రై చేశానని ఇటీవల ఈ సందర్భంగా వెల్లడించింది.

Shruti Haasan celebrating birthday today, she express her view about marriage.

నాకు దైవభక్తి ఎక్కువ, గుడికి వెళ్తే సానుకూల దృక్పథం పెరుగుతుందని భావిస్తాను. ఆహారం విషయంలో సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టం. నా జీవితంలోకి ప్రవేశించే వ్యక్తికి కూడా అలాంటి ఇష్టాలే ఉండాలి. లేకపోతే అభిప్రాయ భేదాలు తలెత్తే ప్రమాదముంటుంది. దాంపత్య జీవితం అంటే ఇద్దరి మధ్య చాలా అవగాహన ఉండాలి. ఒక్కోసారి ఈ గొడవ అంతా ఎందుకు? అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదనిపిస్తుంది అని శృతిహాసన్ అభిప్రాయపడ్డారు.

English summary
Shruti Haasan initially branded as Iron leg in the industry, After Gabbar singh success she become star heroine of south film industry
Please Wait while comments are loading...