» 

పెంచేస్తాయేమోనన్న భయం...అందుకే: శృతి హాసన్

Posted by:

హైదరాబాద్ : గబ్బర్ సింగ్ ముందు దాకా శ్రుతి హాసన్‌ అంటే టాలీవుడ్ ,బాలీవుడ్‌సలో ఐరన్‌లెగ్‌ అని ముద్ర వేశారు. ఆమె నటించిన చిత్రాలు సరిగా ఆడలేదు. వరసగా ఫెయిల్యూర్ అవుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు తెలుగులో మాత్రం ఆమెని 'లక్కీ హీరోయిన్‌' అంటున్నారు. ఈ రెండింటిని సమానంగా తీసుకుంటానంటోంది శ్రుతి హాసన్.


శృతి హాసన్ మాట్లాడుతూ... ''నేను అదృష్టాన్ని అస్సలు నమ్మను. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే కృషీ పట్టుదలా ఉండాలి. ఒక సినిమా హిట్‌ అయినప్పుడు 'శ్రుతి మంచి నటి' అని ప్రశంసించి, ఇంకో సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు 'ఆమెకు అసలు నటనే రాదు' అన్నవారిని చాలామందిని చూశాను. అయితే, విమర్శలను పట్టించుకోకుండా ఉండను. ఇలాంటి కామెంట్లు వినిపించిన ప్రతీసారీ నిజంగా నాలో ఏవైనా లోపాలున్నాయేమో అని విశ్లేషించుకుంటాను. ఇక, నాకు విజయం దక్కినప్పుడు వచ్చే పొగడ్తల్ని అస్సలు గుర్తుంచుకోను. ఎందుకంటే, పొగడ్తలు పొగరును పెంచేస్తాయేమోనన్న భయం'' అని చెబుతోంది శ్రుతి.


వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న శృతిహాసన్ కి గబ్బర్ సింగ్ హిట్ ఇచ్చి నిలబెట్టింది. ఇక రీసెంట్ గా ఆమె నటించిన బలుపు చిత్రం విజయం సాధించి ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె మాట్లాడుతూ... 'విజయం సాధిస్తే విర్రవీగడం, పరాజయం ఎదురైతే పారిపోవడం ఇలా ఉండటం నాకు ఇష్టం ఉండదు' అంటోంది శ్రుతి హాసన్‌.

'విజయాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కష్టపడినదానికి ఫలితం వచ్చింది అనుకుంటారు. కరక్టే, కానీ ఆ విజయం తరువాత మరింత కష్టపడాల్సిన బాధ్యత ఉంటుందని గ్రహించరు అని అంది. తన దృష్టిలో రెండూ సమానమే అంటోంది.

Read more about: sruthi hassan, balupu, gabbar singh, శృతిహాసన్, బలుపు, గబ్బర్ సింగ్
English summary
With Balupu Hit ...Shruti Hassan is making all the right moves at the right time of her career. Making a mark down south, she also has a hand full of movies up her sleeve.
Please Wait while comments are loading...