twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పామును ముద్దాడి... కష్టాల్లో పడిన నటి

    By Rajababu
    |

    వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 నిబంధనలకు విరుద్ధంగా పామును పట్టుకొని బుల్లితెర నటి శ్రుతి ఉల్పత్ కష్టాల్లో పడింది. తాజాగా నాగుపామును పట్టుకొని వీడియో తీసుకోవడమే కాకుండా దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను ఆమె కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాను హద్దుమీరి ఉపయోగించే వారికి ఓ గుణపాఠంగా కూడా మారింది.

    సీరియల్ ప్రమోషన్‌లో భాగంగా అత్యుత్సాహం

    సీరియల్ ప్రమోషన్‌లో భాగంగా అత్యుత్సాహం


    వివరాల్లోకి వెళితే.. నాగార్జున - ఏక్ యోధా అనే సీరియల్‌ ప్రమోషన్‌లో భాగంగా నాగుపామును పట్టుకొని వీడియో దిగారు. ఈ వీడియోను శ్రుతి అక్టోబరు 16న సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో గురించి జంతు సంరక్షణ కార్యకర్తలు అటవీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రుతితోపాటు మరో నటి పర్ల్ పురి, ఇద్దరు నిర్మాతలు ఉత్కర్ష్, నితిన్ సోలంకిని గతంలో పోలీసులు విచారించారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు శ్రుతిని, సీరియల్‌ యూనిట్‌ను విచారించగా.. ఆ పాము నిజమైనది కాదని, గ్రాఫిక్ ఎఫెక్ట్స్ అని చెప్పారు.

    ఫొరెన్సిక్ నివేదికతో వాస్తవం వెలుగులోకి

    ఫొరెన్సిక్ నివేదికతో వాస్తవం వెలుగులోకి

    దాంతో పాము నిజమైనదా.. కాదా.. అని పరీక్షించడానికి వీడియోను అధికారులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. వీడియోలో ఉన్న పాము నిజమైనదేనని గతనెల 17న నివేదిక ఇచ్చింది. దీంతో శ్రుతితోపాటు నలుగురిని బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వన్యప్రాణి చట్టాలను ఉల్లంఘించినందుకు కోర్టు వారికి ఒకరోజు కస్టడీ విధించింది.
     శ్రుతితోపాటు నలుగురి అరెస్ట్..

    శ్రుతితోపాటు నలుగురి అరెస్ట్..


    శ్రుతితోపాటు నలుగురిని అరెస్ట్ చేశాం. వారిని మళ్లీ కోర్టులో ప్రవేశపెడుతాం. అప్పటివరకు వారిని మా కస్టడీలోనే ఉంచుకొంటాం అని ముంబై ఫారెస్ట్ అధికారి తెలిపారు. చాలా కాలంగా సినిమాల కోసం అక్రమంగా జంతువులను సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని, అలాంటి చర్యలను అడ్డుకొంటామని అధికారులు అన్నారు.

     పరిశ్రమలో ఎవరైనా సరే సహించం

    పరిశ్రమలో ఎవరైనా సరే సహించం


    ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వీడియోను తీసుకొని విచారణ జరిపామని పేర్కొన్నారు. జంతువుల చట్టాలను ఉల్లంఘించే వారు పరిశ్రమలో చిన్నవారైనా, లేదా పెద్దవారైనా సహించమని చెప్పడానికి ఇది ఉదాహరణ అని జంతు సంరక్షణ కార్యకర్తలు హెచ్చరించారు.

    English summary
    ther animal activists said the case will set an example for the small and big screen industry that such illegal acts will not be tolerated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X