»   » అతనితో డేటింగ్ చేస్తున్నా, పెళ్లిపై నమ్మకం ఉంది: శ్వేతా బసు (ఫోటోస్)

అతనితో డేటింగ్ చేస్తున్నా, పెళ్లిపై నమ్మకం ఉంది: శ్వేతా బసు (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శ్వేతా బసు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా..... తెలుగు సినిమాల ద్వారానే హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత వ్యభిచారం కేసులో ఇరుక్కోవడం, కొంత కాలం పాటు పోరాడిన తర్వాత ఆ కేసు నుండి బయట పడటం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం శ్వేతా బసు హైదరాబాద్ నుండి తన సొంత ప్రాంతమైన ముంబైకి మకాం మార్చింది. సౌత్ సినిమాలకు పూర్తిగా టాటా చెప్పేసిన ఆమె అక్కడే తన కెరీర్ వెతుక్కుంటోంది. ప్రస్తుతం హిందీ సినిమాలు, సీరియల్స్ లో అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.

ఆమె సినిమాల సంగతి పక్కన పెడితే .. కొంత కాలంగా శ్వేతా బసు ఓ వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందని, అతనితో సహజీవనం చేస్తోందని, డేటింగ్ చేస్తోందంటూ మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని ఫోటోలు కూడా అప్పట్లో బయటకు లీక్ అయ్యాయి. ఈ వ్యవహారంపై తాజాగా శ్వేతా బసు స్పందించింది.

నిజమే, అతనితో రిలేషన్ షిప్ లో ఉన్నా

డేటింగ్ ఈ విషయమై ఇటీవల శ్వేతా బసు మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ఇక మీడియా ముందు తానేమీ దాచదలుచుకోలేదని, రోహిత్ మిట్టల్ తో తాను డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

రెండేళ్లుగా రిలేషన్లో

రోహిత్ మిట్టల్ నాకు మంచి స్నేహితుడు. అతనితో రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నాను. ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. మా మధ్య బలమైన బంధం ఉంది అని శ్వేతా బసు ప్రసాద్ చెప్పుకొచ్చారు.

పెళ్లి జరుగుతుందనే నమ్మకం ఉంది

పెళ్లి గురించి మేమెప్పుడూ ఆలోచించలేదు. అయితే మా ఇద్దరి వివాహం స్మూత్ గా జరుగుతుందనే నమ్మకం ఉంది. అయితే ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? అనే ప్రశ్నలకు నేను ఇప్పుడే సమాధానం చెప్పలేను అని శ్వేతా బసు తెలిపారు.

ఎలా పరిచయం?

సెక్స్ రాకెట్ కేసు సంఘటన తర్వాత శ్వేతా బసు జీవితం ఒక్కసారిగా తలక్రిందులైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హిందీ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ తన ఫాంటమ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉద్యోగం ఇచ్చారు. అక్కడే రోహిత్ మిట్టల్ తో శ్వేతా బసుకు పరిచయం ఏర్పడింది.

ఎవరీ రోహిత్ మిట్టల్?

రోహిత్ మిట్టల్ అనే వ్యక్తి అప్ కమింగ్ డైరెక్టర్. ఇప్పటి వరకు పీచర్ ఫిల్మ్ ఏమీ తీయలేదు కానీ.... ఆటో హెడ్ అనే ఓ డాకుమెంటరీ, రెండు షార్ట్ ఫిల్మ్స్ తీసాడు.

జంట బావుంది

శ్వేతా బసు, రోహిత్ మిట్ట కలిసి డేటింగ్ చేస్తున్న సమయంలో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన వారు జంట బావుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

అందరకీ తెలిసేలా

అయితే ఇద్దరూ తమ వ్యవహారం అందరికీ తెలియాలనే తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. అఫ్ కోర్స్ పబ్లిసిటీ కోసం కూడా ఈ ఫోటోలు పోస్టు చేసి ఉండొచ్చు.

పీడకల లాంటి సంఘటన

సెక్స్ రాకెట్లో శ్వేతా బసు పట్టుబడటం పీడకల లాంటి సంఘటన. ఈ కేసులో ఆమెపై నేరం ప్రూవ్ కాలేదు. తాను నిర్దోషిని అని అన్యాయంగా నన్ను ఈ కేసులో ఇరికించారని శ్వేతా బసు ముందు నుండీ వాదిస్తూనే ఉంది.

సానుబూతి అవసరం లేదు

ఇటీవల మీడియా మీట్లో.... సెక్స్ రాకెట్ విషయం ప్రస్తావించగా... గతం గురించి మాట్లాడటానికి నిరాకరించారు. మీ సానుభూతి తనకు అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఆమె తన ప్రొఫెషన్లో బిజీగా ఉన్నారు. తన ఫోకస్ అంతా కెరీర్ మీదనే పెట్టారు.

ఇపుడు ఏం చేస్తోంది?

ప్రస్తుతం శ్వేతా బసు వరుణ్ ధావన్, అలియా భట్ జంటగా నటిస్తున్న ‘బద్రినాథ్ కి దుల్హనియా' మూవీలో ఓ రోల్ చేస్తోంది. దీంతో పాటు చంద్ర నందిని అనే హిందీ సీరియల్ లో నటిస్తోంది.

English summary
Shweta Basu Prasad recently opened up about her personal life and admitted she is in a relationship. When a popular entertainment portal asked her about her relationship with budding filmmaker Rohit Mittal, she admitted to it saying, "Okay...yes, we are dating and it’s been almost two years,” reports pinkvilla.com.
Please Wait while comments are loading...