twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్వేతబసు ఏం చేసిందో తెలుసా... మతిపోతుంది..

    వివాదాస్పద తార శ్వేతబసు జాతీయ స్థాయిలో మళ్లీ సత్తా చాటింది. తాజాగా క్లాసికల్ మ్యాజిక్‌పై రూపొందించిన డ్యాకుమెంటరీకి మంచి స్పందన లభిస్తున్నది. ఈ డాక్యుమెంటరీ కోసం దాదాపు నాలుగేండ్లు కృషి చేసిన అద్భుతమ

    By Rajababu
    |

    వివాదాస్పద తార శ్వేతబసు జాతీయ స్థాయిలో మళ్లీ సత్తా చాటింది. తాజాగా క్లాసికల్ మ్యాజిక్‌పై రూపొందించిన డ్యాకుమెంటరీకి మంచి స్పందన లభిస్తున్నది. ఈ డాక్యుమెంటరీ కోసం దాదాపు నాలుగేండ్లు కృషి చేసిన అద్భుతమైన సంగీత కావ్యాన్ని రూపొందించింది.

    రెహ్మాన్ లాంటి ప్రముఖుల ఇంటర్వ్యూ

    రెహ్మాన్ లాంటి ప్రముఖుల ఇంటర్వ్యూ

    ఈ ప్రత్యేకమైన డాక్యుమెంటరీ కోసం సంగీత దిగ్గజాలు ఏఆర్ రెహ్మన్, విశాల్ భరద్వాజ్, గుల్జార్, పండిట్ శివకుమార్ శర్మ, పండిట్ జస్రాజ్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ బీర్జు మహారాజ్, ఇంతియాజ్ అలీ, ఉస్తాద్ అమ్జద్ అలీఖాన్, డాక్టర్ ఎల్ సుబ్రమణ్యం లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది.
     ప్రాజెక్ట్ కోసం చాలా శ్రమించాను

    ప్రాజెక్ట్ కోసం చాలా శ్రమించాను


    ఈ భారీ ప్రాజెక్ట్‌ను చేపట్టడం కోసం చాలా శ్రమించాను. ఈ ఆల్పంను రూపొందించడానికి నిధులు సేకరించాను. దక్షిణాది చిత్రాల్లో నటించి డబ్బు పోగుచేశాను. 5 వేల ఏండ్ల సంగీత కళను ప్రజలకు అందించే ప్రాజెక్ట్‌ను ఓ సవాల్‌గా తీసుకొన్నాను అని శ్వేత బసు తెలిపారు.

     పలు కళల్లో ప్రావీణ్యం

    పలు కళల్లో ప్రావీణ్యం


    2002లో మక్డీ చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించిన శ్వేతబసు‌కు కేవలం సినిమా రంగంలోనే కాకుండా కవిత్వం, సాహిత్యం, సంగీత రంగాల్లో మంచి పట్టు ఉన్నది. కథక్ డ్యాన్స్‌లోనూ ప్రావీణ్యముంది. సితార్‌ వాయిద్యాన్ని బాగా వాయించగలదు. మాస్ మీడియా, జర్నలిజంలో పట్టబద్రులైన తర్వాత నటిగా మారింది.

     నటనే తొలి ప్రాధాన్యత.. డైరెక్షన్ చేస్తా..

    నటనే తొలి ప్రాధాన్యత.. డైరెక్షన్ చేస్తా..


    ఎన్ని రకాల పనులు చేసినా తనకు నటనే మొదటి ప్రాధాన్యత అని శ్వేతబసు తెలిపింది. డాక్యుమెంటరీల తర్వాత నా టార్గెట్ డైరెక్షన్ అని పేర్కొన్నది. డైరెక్టర్‌గా మారేందుకు తగిన ప్రణాళికను రూపొందిచుకుంటున్నాను అని ఆమె వెల్లడించింది. భవిష్యత్‌లో కూడా డాక్యుమెంటరీలను రూపొందిస్తానని చెప్పింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బద్రీనాథ్ కి దుల్హనియా చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

     గతంలో వ్యభిచారం కేసులో ఆరోపణలు

    గతంలో వ్యభిచారం కేసులో ఆరోపణలు


    వ్యభిచారం కేసులో ఆరోపణలు శ్వేతబసు ఎదుర్కోవడం గతంలో సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్‌లోని హోటల్‌లో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొన్న సంగతి తెలిసిందే. చాలా రోజులు స్టేట్ హోమ్‌కు తరలించారు. ఆ తర్వాత విడుదలైన ఆమె తన కేరీర్ పై దృష్టిపెట్టింది.

    English summary
    Shweta Basu documented a classical Music album, for this she Interviewed AR Rahman, Vishal Bhardwaj, Gulzar, Pt Shivkumar Sharma, Pt Jasraj, Pt Hariprasad Chaurasia, Pt Birju Maharajand many others. Varun Dhawan-Alia Bhat starrer, Badrinath Ki Dulhania.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X