twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన సినిమాల్లో ఇక సెక్స్ సీన్లు విచ్చలవిడిగా చూసేయొచ్చు.... సెన్సారోళ్ళు గేట్లెత్తేసారు

    |

    ఇటీవలి కాలంలో సెన్సార్ బోర్డ్ పనితీరుపట్ల తరచూ విమర్శలొస్తున్నాయి. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంలోనూ, కొన్ని సీన్లు కట్ చేయడంలోనూ బోర్డ్ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. దీనికి తోడు బోర్డ్ సభ్యులు ఒకొరొకరిగా వెదొలిగాల్సిన పరిస్థితులు రావడం, బోర్డ్ చైర్మన్ తీసుకునే నిర్ణయాలపై కేంద్రప్రభుత్వం విసిగిపోవడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సెన్సార్ బోర్డ్ ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామని ఆ మధ్య కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా తెలియజేశారు.

    అంతే కాదు శ్యామ్ బెనెగల్ అధ్యక్షతన కొత్త కమిటీ ఏర్పాటు చేసారు కూడా. ఈ కమిటీలో శ్యామ్ బెనెగల్ తో పాటుగా, చిత్రనిర్మాత రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, యాడ్ మ్యాన్' పియూష్ పాండే, ఫిల్మ్ క్రిటిక్ భావనా సోమాయ, నేషనల్ ఫిల్మ్ డెవెలప్మెంట్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ నినాలాథ్ గుప్తా, జాయింట్ సెక్రటరీ (ఫిల్మ్స్) సంజయ్ మూర్తిలు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు తగ్గట్టుగానే ఈ కమిటీని రూపొందించడం జరిగిందని సమాచార, ప్రసారాల శాఖ తెలియజేసింది. సినిమాలకు సర్టిఫికేట్ జారీచేయడంలో పాటించాల్సిన మార్గదర్శకాల నుంచి సెన్సార్ బోర్డ్ సభ్యుల విధివిధానాల వరకు ప్రతీ అంశాన్నీ ఈ కమిటీ పరిశీలించింది..

     సెన్సార్ బోర్డ్ :

    సెన్సార్ బోర్డ్ :


    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సి) సంస్థనే సాధారణ భాషలో సెన్సార్ బోర్డ్ గా పిలుస్తుంటారు. 2015 ఆరంభంలోనే బోర్డ్ వివాదంలో కూరుకుపోయింది. పహ్లాజ్ నిహ్లానీ ప్రవేశపెట్టిన కొన్ని పద్ధతులను తోటి సభ్యులే వ్యతిరేకించారు. దీనికితోడు ప్రధాని నరేంద్రమోదీపై నిర్మించిన మ్యూజిక్ వీడియో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖనే ఇబ్బందుల్లో పడేసింది. దీనికి తోడుగా సెన్సార్ బోర్డు తీరుతెన్నులపై చిత్రనిర్మాతలు మండిపడే పరిస్థితి ఏర్పడింది.

     ప్రక్షాళన చేయాలని:

    ప్రక్షాళన చేయాలని:


    చిత్రనిర్మాతలు, నటీనటులు, మేధావుల నుంచి వెల్లువెత్తిన నిరసనల దృష్ట్యా సెన్సార్ బోర్డ్ ని ప్రక్షాళన చేయాలని గత కొంతకాలంగా కేంద్రం భావిస్తోంది. పానెల్ నియామకంతో ఆ పనికి శ్రీకారం చుట్టినట్లయింది. సెన్సార్ బోర్డ్ లో ఎలాంటి వారిని నియమించాలి (చైర్మన్ తో సహా) వారి విధివిధానాలు ఎలా ఉండాలి, సినిమాటొగ్రాఫ్ చట్టంలో ఎరకమైన సవరణలు తీసుకురావాలన్న అంశాలపై శ్యామ్ బెనెగల్ వంటి వారితో ఏర్పాటైన ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి తన నివేదికను అందించేసింది. ఆ నివేదికను రాజకీయాలకు అతీతంగా కేంద్రం అమలుపరిస్తే సెన్సార్ బోర్డ్ కు పట్టిన గ్రహణం తొలిగిపోతుందని చలన చిత్ర ప్రముఖులు భావిస్తున్నారు. అందుకే ఈ కమిటీ ఏర్పాటును దాని నివేదికనూ ఒక మంచి మార్పు అంటూ సినీ వర్గాలు మెచ్చుకుంటున్నాయి.

     కట్స్ తగ్గించి:

    కట్స్ తగ్గించి:


    ఇప్పటిదాకా సినిమాలకు ఏ, యుఏ, యూ క్యాటగిరీల సర్టిఫికెట్లతో సినిమాలకు అనుమతులు ఇస్తున్న సెన్సార్ బోర్డు.. ఇకపై అభ్యంతర దృశ్యాలు, సంభాషణల కట్స్ తగ్గించి.. క్యాటగిరీల సంఖ్యను పెంచనుంది. ఈ విషయంలో శ్యాంబెనెగల్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర సెన్సార్ బోర్డు ఆమోదించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ మూడు క్యాటగిరీల్లోనే సినిమాలను అనుమతిస్తున్న రీత్యా యూ సర్టిఫికెట్ సినిమాల్లో కూడా కొన్ని దృశ్యాలను, సంభాషణలను తొలగిస్తున్నారు.

     కోతలు విధించరు :

    కోతలు విధించరు :


    దీనికి బదులు సదరు సినిమాలను చూసేవారి అర్హతలను నిర్ణయించేలా మరిన్ని క్యాటగిరీలు చేయాలని బెనెగల్ కమిటీ సూచించినట్టు తెలుస్తున్నది. అంటే యూ సరిఫికెట్ సినిమాలో కోతలు ఉండే పక్షంలో దాని క్యాటగిరీ మార్చి సదరు దృశ్యాలు, సంభాషణలు యథాతథంగా ఉంచుతారన్నమాట. మితిమీరిన అశ్లీలత, నగ్నత ఉంటే దాన్ని ఏ క్యాటగిరీ కాకుండా.. ఏసీ క్యాటగిరీగా పరిగణిస్తారు. అంతే తప్ప.. కోతలు విధించరు.

    గొడవ పడుతున్నారు:

    గొడవ పడుతున్నారు:


    లైంగికపరంగా అభ్యంతరకర సన్నివేశా లు:
    ఒక విధం గా చూస్తే సెన్సార్ కత్తెర పదును రానున్న కాలంలో తగ్గనుంది. ప్రస్తుతం లైంగికపరంగా అభ్యంతరకర సన్నివేశా లు, సంభాషణలు, మితిమీరిన హింస ఉన్న సినిమాలకు కొన్ని సందర్భాల్లో కట్స్‌తో ఏ సర్టిఫికెట్ ఇస్తున్నారు. ముద్దు పెట్టుకునే సన్నివేశాలు, కాస్త అభ్యంతర సంభాషణలు ఉంటే వాటికి యూఏ (12 ఏండ్లలోపు వారు పెద్దల సమక్షంలో చూసేందుకు వీలు కల్పిస్తుంది) సర్టిఫికెట్ ఇస్తున్నారంటూ నిర్మాతలు సెన్సార్ బోర్డుతో గొడవ పడుతున్నారు.

    సమగ్ర మార్పు కోసం:

    సమగ్ర మార్పు కోసం:

    సెన్సార్‌ బోర్డు పనితీరులో సమగ్ర మార్పు కోసం తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన శ్యాం బెనెగల్‌ కమిటీ తన పని పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ తన నివేదికను కేంద్ర సమాచార-ప్రసార మంత్రి అరుణ్‌ జైట్లీకి మంగళవారం సమర్పించింది. ఈ ఏడాది జనవరి 1న శ్యాం బెనెగల్‌ కమిటీ ఏర్పాటైంది. సెన్సార్‌ బోర్డు విధి విధానాలను కూడా కమిటీ తన నివేదికలో పొందుపర్చింది.
    ఏ చిత్రంపైనా కత్తెర వేయొద్దని:

    ఏ చిత్రంపైనా కత్తెర వేయొద్దని:

    సెన్సార్‌ బోర్డు చలన చిత్రాలకు కత్తెర వేయడానికి బదులు, పలు విభాగాల కింద గుర్తించాలని ప్రఖ్యాత దర్శకుడు శ్యాంబెనెగల్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ బోర్డు(సీబీఎఫ్‌సీ) ఏ చిత్రంపైనా కత్తెర వేయొద్దని సిఫార్సు చేసినట్లు బెనెగల్‌ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతమున్న విభిన్న వర్గీకరణలకు తోడుగా అదనపు కేటగిరీలను సూచించినట్లు వివరించారు.
     అందరూ చూడొచ్చు:

    అందరూ చూడొచ్చు:


    ప్రస్తుతం మన సినిమాల సెన్సార్ విషయంలో... ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలూ మితిమీరిన హింసా అశ్లీల దృశ్యాలు లేవనుకుంటే వాటికి క్లీన్ ‘యు' సర్టిఫికేట్ ఇస్తున్నారు. హింసా శృంగారం డోస్ కాస్త ఎక్కువ ఉన్న చిత్రాలకు ‘ఎ' సర్టిఫికేట్ తో రిలీజ్ చేస్తున్నారు. వీటి డోస్ కాస్త తగ్గించుకుని నాలుగు కత్తెర్లు వేయించుకుంటే అలాంటి వాటికి ‘యు.ఎ.' ఇస్తున్నారు. ఈ కేటగిరీ చిత్రాలను అందరూ చూడొచ్చన్నమాట.

    తల్లిదండ్రుల ఇష్టానికే :

    తల్లిదండ్రుల ఇష్టానికే :

    12ఏళ్ల లోపువారి విషయంలో ఈ చిత్రాలను చూపించాలా వద్దా అనేది తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేశారు. అయితే బెనెగెల్ కమిటీ సిఫార్సుల ప్రకారం.. యు యుఏలతోపాటు యూఏ 12 యూఏ 15 ప్లస్ లుగా విభజించనున్నారు. ఇక ‘ఎ' కేటగిరీ విషయంలో కూడా ఏ తోపాటు ‘ఏసీ' క్యాటగిరీని కూడా పెట్టాలని సూచించారు. ఏసీ అంటే ఎడల్ట్ విత్ కాషన్ అని అర్థం.
     బీప్ సౌండ్స్ ఉండవు:

    బీప్ సౌండ్స్ ఉండవు:


    అంటే కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే మన సినిమాల్లో బీప్ సౌండ్స్ ఉండవు. శృంగార సన్నివేశాలకు కూడా కట్స్ పడవు. అలాంటి ఏవి ఉన్నా ఆయా కేటగిరీల సర్టిఫికెట్లు మాత్రమే జారీ చేస్తారు. అంతేతప్ప కటింగులు ఉండవన్నమాట! మరి ఆ రకంగా సెన్సార్ బోర్డువారికి చాలా పని తగ్గుతుందని చెప్పుకోవాలి. బెనెగెల్ కమిటీ ప్రతిపాదనలను సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకు అందించారు.

     మన సినిమాల్లో ఇక సెక్స్ సీన్లు విచ్చలవిడిగా చూసేయొచ్చు.... సెన్సారోళ్ళు గేట్లెత్తేసారు

    మన సినిమాల్లో ఇక సెక్స్ సీన్లు విచ్చలవిడిగా చూసేయొచ్చు.... సెన్సారోళ్ళు గేట్లెత్తేసారు

    సినిమా హాళ్లలో చిత్ర ప్రదర్శనకు ముందు, ఇంటర్వెల్‌లో చూపించే ధూమపాన నిషేధ ప్రకటనలకు సంబంధించిన ప్రస్తుత నిబంధనలపై శ్యాం బెనెగల్ కమిటీ పరిమితి విధించింది. పొగతాగడం ఆరోగ్యానికి హానికరమని చెప్పే ప్రకటనను సినిమా ప్రారంభానికి ముందు ఒకేసారి మాత్రమే ప్రదర్శించాలని కమిటీ సూచించింది.

     పొగతాగే, మద్యపానం చేసే సన్నివేశాలు:

    పొగతాగే, మద్యపానం చేసే సన్నివేశాలు:


    సినిమాలో పాత్రలు పొగతాగే, మద్యపానం చేసే సన్నివేశాలు కనిపించనప్పుడల్లా తెరపై కనిపించే ప్రకటనలపై కూడా కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా చూసే సమయంలో ఇలాంటి ప్రకటనలు ప్రేక్షకులకు అసౌకర్యాన్ని కలుగజేస్తున్నాయని భావించిన కమిటీ ఈ నిర్ణయం తీసుకొన్నది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ నిబంధనలు చిత్ర నిర్మాతలకు, వీక్షకులకు కూడా ఇబ్బందిగా ఉన్నాయని పేర్కొన్నది.

     చిత్రంలో పొగతాగే నటుడితో:

    చిత్రంలో పొగతాగే నటుడితో:


    అలాగే కథ డిమాండ్ మేరకు చిత్రాల్లో జంతువులను ఉపయోగించిన సన్నివేశాలు తెరపై కనిపించినపుడల్లా వాటికి హాని కలిగించలేదు. గ్రాఫిక్స్ ఉపయోగించాం అని వేసే ప్రకటనలను కూడా తప్పుపట్టింది. దీనికి సంబంధించిన ఓ ప్రకటన చిత్ర ఆరంభంలో వేస్తే సరిపోతుందని, భారత జంతు సంక్షేమ బోర్డు జాబితాలో ఉండే పశువైద్యులతో నిరభ్యంతర పత్రాన్ని తీసుకొంటే సరిపోతుందని అన్నారు. పోగ, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే సందేశం ఉన్న సంక్షిప్త శబ్ద చిత్రాన్ని ఆ చిత్రంలో పొగతాగే నటుడితో నిర్మించి ప్రదర్శనకు ముందు వేయాలని నిర్మాతలకు కమిటీ సూచించింది.

     ఎంపిక చేసిన ధియేటర్లలోనే:

    ఎంపిక చేసిన ధియేటర్లలోనే:


    సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ పిలిం సర్టిఫికెషన్‌(సిబిఎఫ్‌సి) నిర్ణయాలు వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి సినిమాలకు సెన్సార్‌ నిర్వహించే విషయంలో సిబిఎఫ్‌సికి నేతృత్వం వహిస్తున్న పహ్లాజ్‌ నిహలాని పాత్ర వివాదాస్పదమవ్వడంతో కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి విచ్చలవిడి శృంగారం, హింసలతో కూడిన సినిమాలను ఎంపిక చేసిన ధియేటర్లలోనే ప్రదర్శించాలన్న నిర్ణయం ఇబ్బందిగా ఉండవచ్చు.

     ప్రింట్ల సంఖ్య తగ్గుతుంది:

    ప్రింట్ల సంఖ్య తగ్గుతుంది:


    ఎందుకంటే దీని వలన ప్రింట్ల సంఖ్య తగ్గుతుంది, ప్రదర్శనల సంఖ్య తగ్గుతుంది అని బెన్‌గల్‌ వివరించారు. తీవ్రమైన హింసతో కూడిన సినిమాలను నిర్మించేందుకు మాత్రం ఈ నిబంధన ప్రోత్సహాకారి కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలను కొన్ని కేటగిరిలుగా విభజించినట్లు కమిటీ పేర్కొంది. తాము సినిమాలకు మాత్రమే పరిమితమయ్యామని టివి, ఆన్‌లైన్‌ విషయాలలోపానెల్‌ జోక్యం చేసుకోవడం లేదని బెన్‌గల్‌ స్పష్టం చేశారు. సినిమాలకు సంబంధించి మరికొన్ని విషయాలపై సిపార్సులు చేసేందుకు ఇంకొంత గడువు కావాలని కమిటీ కోరింది.

    English summary
    As per a report the CBFC has accepted the recommendations of the government-appointed panel which suggested a new rating system to certify movies instead of cutting scenes and muting dialogues, as is the practice now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X