»   » శింబూ లుక్ అదిరి పోయింది... మధుర మైకేల్... ఊరమాస్

శింబూ లుక్ అదిరి పోయింది... మధుర మైకేల్... ఊరమాస్

Posted by:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలలోనే ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదంలో ఉండే శింబు. నిజానికి మంచి నటుడు కావటం తో అవకాశాలకు ఎప్పుడూ లోటుండదు. పేరున్న దర్శకులు అతడితో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఆ అవకాశాలన్నింటినీ సరిగ్గా వాడుకొని బుద్దిగా పనిచేసుకుంటే అసలు శింబూ లైఫే వేరుగ ఉండేది..

కానీ లవ్ ఎఫైర్లు.., నిర్మాతలతో గొడవలూ, ఆడవాళ్ల మీద వ్యాఖ్యలూ.., బీప్ సాంగ్.. డిస్ట్రిబ్యూటర్లతో గొడవలు.. ఇలా అనవసరమైన కాంట్రవర్శీలతో కెరీర్‌ను దెబ్బ తీసుకున్నాడు. ఐతే ఈ మధ్య చాన్నాళ్ల వాయిదా తర్వాత నయన తార తో కలిసి చేసిన సినిమా 'ఇదు నమ్మ ఆళు' సూపర్ హిట్టవడంతో మళ్లీ అతడి కెరీర్‌కు ఓ ఊపొచ్చింది. దాంతో కనీసం ఇప్పటినుంచైనా మళ్ళీ కెరీర్ మెరెద దృష్టి పెట్టాలనుకున్నాడు....

ఆధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో 'ఎఎఎ' అనే సినిమా చేస్తున్నాడు. ఇది వెరైటీ స్టోరీతో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్. ఈ సినిమా పూర్తి పేరు 'అన్బానవన్..అసరాదవన్...అడంగాదవన్'. అంటే ...ప్రేమించేవాడు, భయపడనివాడు, లొంగనివాడు అని అర్ధం. ఆ సినిమా సంగతులు కొన్ని....

శింబూ

శింబూ ఈమధ్య బుద్ది మంతుడయ్యాడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో' తమిళ వెర్షన్‌ "అచ్చం ఎన్బదు మదమైఎద" ను పూర్తి చేశాడు శింబు. ఆ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొస్తుంది.

ఎఎఎ

అది అయ్యిందో లేదో వెంటనే ఆధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో ‘ఎఎఎ' అనే సినిమా చేస్తున్నాడు. ఇది వెరైటీ స్టోరీతో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్. ఈ సినిమా పూర్తి పేరు ‘అన్బానవన్..అసరాదవన్...అడంగాదవన్'. అంటే ...ప్రేమించేవాడు, భయపడనివాడు, లొంగనివాడు అని అర్ధం.

ఫస్ట్ లుక్ పోస్టర్

ఆ మధ్య రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా థ్రిల్లింగ్ గా మూడు ముఖాలతో ఉంది. మరో విశేషమేమంటే... ఈ సినిమాలో కేరక్టర్ చేసేందుకు శింబు బాగా బరువు పెరుగుతున్నాడట. ఈ మూవీలో అతను ఒక జైంట్ మాన్ లా కనబడాల్సి ఉంది. అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ పిక్చర్ శింబుకు టర్నింగ్ పాయింట్ కావచ్చని కూడా అంటున్నారు.

శింబు

ఇక ఈ చిత్రంలో శింబు మూడు ప్రధాన పాత్రలలో కనిపించనుండగా తాజాగా మధుర మైకేల్ అనే పాత్రకు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. బాటిల్ నుండి వస్తోన్న మంటతో శింబు సిగరెట్ వెలిగిస్తున్నట్టు ఈ పోస్టర్ ఉంది.

మాస్ లుక్

పక్కా మాస్ లుక్ లో తండ్రి "ప్రేమసాగరం" రాజెందర్ని తలపిస్తున్నాడు... లిక్కర్ బాటిల్ తో చేసే పెట్రోల్ బాంబు...(వీటిని ఇదివరకు తమిళనాడులో ఏ గొడవ అయినా వాడేవాళ్ళు) వ్బెలిగించి ఆ నిప్పుతో బీడీ వెలిగిస్తూ... ఎనభైలలోని వీది రౌడీలా ఉన్నాడు శింబు...

శ్రియ

శ్రియ ఈ పాత్రకే జోడీగా కనిపించనున్నదని సమాచారం. మధుర మైకేల్ ని చూస్తేనే ఊర నాటు గా కనిపిస్తున్నాడు... మరి శ్రియ సంగతేంటో కారా కిళ్ళీ నముల్తూ నముల్తూ తానూ స్పైసీగా ఉంటుందో లేక మరీ మెతక ఇల్లాలుగా కన్నీళ్ళు పెడుతూ కూచుంటుందో...

English summary
Simbu's AAA Madurai Michael First Look Poster to Released
Please Wait while comments are loading...