twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఒక్కడికే 250 కబాలి టికెట్లా..!? ఒక్కటే దొరక్క చచ్చిపోతుంటే

    |

    కబాలి....ఇప్పుడు ఈ పేరే ఒక బ్రాండ్. ఆటో టు కార్... బైక్ టు ఏరోప్లేన్.. డాన్ లుక్ లో ఉన్న తలైవా పోస్టర్లే.! ఇలాంటి సినిమాను చూడాలని ఎవరు కోరుకోరు చెప్పండి? కానీ పరిస్థతి మరోలా ఉంది. బ్లాక్ లో కాదు కదా..సగం ఆస్తులు అమ్ముకున్నా... కబాలి ఫస్ట్ వీక్ టికెట్లు దొరికే ఛాన్స్ కనిపించట్లేదు. తమిళ, తెలుగు ప్రాంతాల్లోనే కాదు..విదేశాల్లో కూడా సేమ్ సీనే.! ఎండాకాలంలో.....నీళ్ల కోసం ట్యాంకర్ల ముందు జనాలు నిలబడ్డ మాదిరిగా.. గూడ్స్ రైలు పెట్టెల్లా...చాంతాడంత లైన్ టికెట్ కౌంటర్ల ముందు బారులు తీరి నిలబడుతున్నారు...

    కబాలి క్రేజ్ పతాక స్థాయికి చేరుకుంది. గతంలో ఎన్నడు లేనివిధంగా అభిమానులు ఓ సినిమాపై ఇంతటి ఆసక్తి చూపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పలు రాశ్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న కూడా టికెట్స్ కోసం నిద్రా హారాలు మాని మరీ, కబాలి టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

    ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుందంటే ఆ సినిమాకు మొదటిరోజు ఎలాగైనా టికెట్స్ సంపాదించాలని అభిమానులు తహతహలాడుతూంటారు. అదీ రజనీ కాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమా అంటే ఇక టికెట్స్ కోసం ఎంత కష్టపడాలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటించిన 'కబాలి'ప్రస్తుతం సౌతిండియన్ సినిమాను షేక్ చేసేస్తోంది. ఒక్క చెన్నై న‌గ‌రంలోనే 650 థియేటర్లలో ర‌జ‌నీ చిత్రం ప్ర‌ద‌ర్శిత‌మవుతోంది.

    Simbu Books firstday Firstshow Tickets of Kabali for Crew of AAA

    ఈ సినిమాకు ఎలాగైనా టికెట్స్ సంపాదించాలని అభిమానులు చేయని ప్రయత్నాలు లేవు. ముఖ్యంగా రజనీని ఓ దేవుడిగా కొలిచే తమిళనాడులో అయితే కొందరు అభిమానులు రాజకీయ నాయకుల రికమెండేషన్‌తో టికెట్స్ సంపాదించడం ఆసక్తికరంగా మారింది

    చెన్నైలో 650 థియేటర్లలో కబాలి చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. కొన్ని థియేటర్లు ఈ సినిమా షోను 24 గంటలు వేసేందుకు కూడా రెడీ అయ్యాయి. సినీ సెలబ్రిటీలు, అభిమానులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఇలా ఒకరేంటి ప్రతి ఒక్కరు కబాలి చిత్రం ఫస్ట్ షో చూసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు శింబు తన టీంతో మధురైలోని థియేటర్‌లో కబాలి చిత్రాన్ని చూడనున్నాడు.

    ప్రస్తుతం ఈ హీరో అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ అనే చిత్రాన్ని చేస్తోండగా, చిత్ర షూటింగ్ మధురైలో జరుగుతోంది. రజినీ వీరాభిమానులైన చిత్ర బృందం ఆ సినిమాను తొలి రోజే చూడాలని ఆసక్తి చూపుతుండగా,తను షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. 'కబాలి' సినిమా చూడడం కోసం డైరెక్టర్‌తో మాట్లాడి షూటింగ్‌ను వాయిదా వేయించాడు. తనకే కాకుండా తన టీమ్ మొత్తానికి కలిపి 250 ఎఫ్‌డీఎఫ్ఎస్ (ఫస్ట్ డే ఫస్ట్ షో) టికెట్లు బుక్ చేశాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ అధికారికంగా తెలిపారు. ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాలలో ఉన్న సినీ సెలబ్రిటీస్ తమ ఫ్యామిలీతో ఈ సినిమాను చూసేందుకు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నారని సమాచారం.

    English summary
    Simbu has booked the first-day-first-show tickets of Kabali for the entire crew and technicians of his upcoming film Anbanavan Adangathavan Asaradhavan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X