twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త ట్విస్ట్:సూర్య 'సింగం 3' మళ్లీ వెనక్కి? ' మోహన్ లాల్ 'కనుపాప' ముందుకు

    సూర్య సింగం 3 చిత్రం రిలీజ్ వాయిదా పడేటట్లు ఉండటంతో ... మోహ‌న్‌లాల్ డబ్బింగ్ సినిమా క‌నుపాప‌ ని ఆ రోజున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    By Srikanya
    |

    హైదరాబాద్: తమిళనాడులో ప్రస్తుతం జల్లికట్టు వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. జనం దృష్టి అంతా దానిపై కాన్సర్టేట్ అయ్యి ఉంది. ఈ నేపధ్యంలో చిత్రం రిలీజ్ చేస్తే పెద్దగా వర్కవుట్ కాదని సూర్య భావించి, ఈ నెల 26 న రావాల్సిన సింగం 3 చిత్రం వచ్చే నెలకు వాయిదా ఆలోచనలో ఉన్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు.

    'Singam3' release date postpone, Mohanlal's Oppam dubbing will come

    ఇక సింగం 3 వాయిదా పడటంతో వచ్చే నెల 3న రిలీజ్ చేద్దామనుకున్న మోహన్ లాల్ డబ్బింగ్ చిత్రం కనుపాప ను ముందుకు తీసుకువచ్చి జనవరి 26న విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లుగా వినపడుతోంది.

    ఒప్పం క‌థ విష‌యానికి వ‌స్తే....ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ అంధుడిగా న‌టించారు. అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఓ అపార్టెమెంట్ లో లిఫ్ట్ ఆప‌రేట‌ర్ గా వ‌ర్క్ చేస్తుంటాడు. ఒక రోజు ఆ అపార్ట్ మెంట్ లో మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది. ఆ మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ త‌ప్పించుకుంటాడు. అయితే....మ‌ర్డ‌ర్ చేసిన కిల్ల‌ర్ ను అంధుడైన‌ మోహ‌న్ లాల్ ఎలా ప‌ట్టుకున్నాడు అనేది ఒప్ప‌మ్ క‌థ‌.

    ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్, యేలేటి 'మనమంతా', రీసెంట్ గా విడుదలైన 'మన్యం పులి' (పులి మురగన్ డబ్బింగ్ )చిత్రాలతో లాల్ హ‌వా మ‌ళ్లీ టాలీవుడ్‌లో మొద‌లైంది. చాలా గ్యాప్ త‌ర్వాత ఒకే ఏడాదిలో మూడు సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం అంటే గ్రేట్. ప్ర‌స్తుతం ఇదే పాజిటివ్ టాక్ మోహ‌న్‌లాల్‌కి బాగా క‌లిసొస్తోంది. ఈ హుషారులోనే .. లాల్ న‌టించిన సినిమాల‌న్నీ టాలీవుడ్‌లో క్యూ క‌ట్టేస్తున్నాయి.

    'Singam3' release date postpone, Mohanlal's Oppam dubbing will come

    దాంతో ఇప్పుడు టాలీవుడ్ లో మోహన్ లాల్ హవా ప్రారంభమైంది. ఊహించని విధంగా ఆయన క్రేజ్ ఇక్కడ స్టార్టైంది. ఆయన సినిమాలకు ట్రేడ్ సర్కిల్స్ లో డిమాండ్ ఏర్పడింది. ఆయన సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. మినిమం గ్యారెంటీగా సినిమా ఉంటుందని నమ్మి మోహన్ లాల్ బ్రాండ్ పై డబ్బు పెట్టడానికి సిద్దపడుతున్నారు.

    ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి క్రేజీ ఆఫర్స్ తో డిస్ట్రిబ్యూటర్స్ సందడి చేస్తున్నట్లు ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ముఖ్యంగా ఒప్పం చిత్రం మళయాళంలో ఘన విజయం సాధించటం, ప్రియదర్శన్ కాంబినేషన్ కావటం, మోహన్ లాల్ నటన, సినిమా లో పాప సెంటిమెంట్ , యాక్షన్ ఎపిసోడ్స్ , ధ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచేస్తున్నాయి. తెలుగులో ఒప్పం డబ్బింగ్ వెర్షన్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

    మోహన్ లాల్ , సముతిరాకని, అనుశ్రీ, విమలారామన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం 'ఒప్పం'. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొంది రిలీజైన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి 15 రోజుల్లోనే 23.7 కోట్లు గ్రాస్ వసూలు చేసి , మళయాళ సూపర్ హిట్ మూవి ప్రేమమ్ రికార్డ్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్ సీస్ నెట్ వర్క్ ఎంటర్టైన్మెంట్స్ బి.దిలీప్ కుమార్ తో కలిసి మోహన్ లాల్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Speculation began that Suriya starrer S3 aka Yamudu 3 movie might be pushed again.The Telugu dub of Mohanlal’s Malayalam blockbuster Oppam is slated for a release on Jan 26th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X