Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
తెరపైకి ప్లేబ్యాక్ సింగర్ సునీత కూడా...!
హైదరాబాద్: తన గాన మాధుర్యంతో పాటు, ఆకట్టుకునే రూపంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసుకుంది ప్లే బ్యాక్ సింగర్ సునీత. ఆమె పాడిన పాటలు నచ్చని వారు తెలుగు గడ్డపై ఉండరంటే అతిశయోక్తి కాదేమో? మరి అంతటి గుర్తింపు తెచ్చుకుందామె. కోకిల లాంటి స్వరంతో పాటు ముగ్దమనోహర రూపం...ఆమె ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది.
సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇప్పటి వరకు సినిమా తెరవెనక విభాగాల్లోనే తన సేవలు అందించిన సునీతా....త్వరలో తెరపైకి రాబోతోంది. నటనా రంగంలోకి అడుగు పెట్టబోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న 'అనామిక' చిత్రం ద్వారా ఆమె నటిగా తెరంగ్రేటం చేయబోతున్నారు. అయితే ఆమె పూర్తి స్థాయి పాత్రలో నటించడం లేదు. 'అనామిక' ప్రమోషన్ సాంగులో మాత్రమే నటిస్తున్నారు.
ఈ రోజు(ఫిబ్రవరి 3) నుండి సునీతపై ఈ పాట చిత్రీకరణ ప్రారంభమైంది. మరి సునీత మున్ముందు తన నట ప్రస్తానాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి. అయితే విశ్లేషకులు మాత్రం సునీతకు ఉన్న టాలెంట్, అందం దృష్ట్యా ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని అంటున్నారు.
'అనామిక' సినిమా వివరాల్లోకి వెళితే....శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం హిందీలో విజయవంతమైన 'కహానీ' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. నయనతార టైటిల్ రోల్ చేస్తుండగా, హర్షవర్ధన్ రాణె, వైభవ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రం విడుదల కానుంది.