twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భవిష్యత్ అంధకారమే.. సింగర్ సునీత ఆవేదన

    సంగీత దిగ్గజాలు ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం మధ్య లీగల్ నోటీసుల వ్యవహారంపై వర్థమాన గాయకుల్లో ఆందోళన మొదలైంది. ఈ అంశంపై పలువురు సంగీత ప్రముఖులతోపాటు గాయని సునీత స్పందించారు.

    By Rajababu
    |

    సంగీత దిగ్గజాలు ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం మధ్య లీగల్ నోటీసుల వ్యవహారంపై వర్థమాన గాయకుల్లో ఆందోళన మొదలైంది. పక్క రాష్ట్రాలకే పరిమితమైన రాయల్టీ వ్వవహారం ఇక తెలుగు సినీ పరిశ్రమపై పడే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సంగీత దర్శకులు కనుక రాయల్టీ విషయంలో ఆంక్షలు విధిస్తే గాయనీ, గాయకుల భవిష్యత్తు గందరగోళంలో పడే అవకాశం లేకపోలేదు. బాలు, ఇళయరాజా వ్యవహారంపై ఇటీవల సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకొన్నారు.

    నోటీసులు వస్తాయా..చూడాల్సిందే..

    నోటీసులు వస్తాయా..చూడాల్సిందే..

    ‘పాటలకు సంబంధించిన రాయల్టీ గొడవలు ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా లేవు. ముంబై, చెన్నైలకే పరిమితం. బాలుకి ఇళయరాజా లీగల్ నోటీసులు పంపడంతో వివాదం రాజుకున్నది. ఇళయరాజా పాటలు లేకుండా దేశ, విదేశాల్లో తమిళ, తెలుగు మ్యూజికల్ నైట్స్ జరగడం లేదు. బాలుకే నోటీసులు పరిమితం అవుతాయా లేక అందరికీ వస్తాయా అనే విషయాన్ని వేచి చూడాలి. ఇళయరాజా చేసినట్టు మిగిత సంగీత దర్శకులు కూడా చేస్తే సింగర్స్ పరిస్థితి, భవిష్యత్ అంధకారమే' అని ప్రముఖ గాయని సునీత అన్నారు.

    సమస్య చిన్నదేం కాదు..

    సమస్య చిన్నదేం కాదు..

    సమస్య కనిపించేంత చిన్నదేం కాదు. బాలు, ఇళయరాజాల మధ్య వివాదం నెలకొనడంతో ఈ సమస్య పెద్దదిగా కనిపిస్తున్నది. పాటలకు సంబంధించి సంగీత దర్శకుడికే కాకుండా గేయ రచయితలు, నిర్మాతలకూ వాటా ఉండాలి. వారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నా అని ప్రముఖ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి తెలిపారు.

    రాయల్టీలు ఇవ్వాలి

    రాయల్టీలు ఇవ్వాలి

    కాపీరైట్‌ యాక్ట్‌ 2012 ప్రకారం ఒకపాట రాయల్టీలో 50 శాతం నిర్మాతకి, 25 శాతం పాట రచయితకి, 25 శాతం స్వరకర్తకి దక్కాలి. న్యాయపరంగా రాయల్టీ ఇవ్వాల్సిందే. అందుకనే ఇళయరాజా ఈ నోటీసు ఇచ్చి ఉంటారు. రెండు సంగీత శిఖరాల మధ్య వచ్చిన ఈ అభిప్రాయభేదాలు తొలగిపోవాలని కోరుకుంటున్నా అని గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌ అన్నారు.

    గొడవ సమసిపోవాలి

    గొడవ సమసిపోవాలి

    సంగీతం అనగానే ఇళయరాజా, ఎస్పీబీ అనే ఇద్దరి పేర్లు గుర్తుకొస్తాయి. ఈ లీగల్‌ గొడవలు వీలైనంత త్వరగా సమసిపోయి వాళ్లిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని ప్రముఖ సింగర్ నాగూర్ బాబు అభిప్రాయపడ్డారు.

    బాధగా ఉంది..

    బాధగా ఉంది..

    బాలు, ఇళయరాజా మధ్య సమస్య రావడం బాధగా ఉంది. పాలు, నీళ్లను వేరు చేయడం సాధ్యం కానిపని. అలాగే, వారిద్దరి పాట కూడా అంతే అని సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ పేర్కొన్నారు.

    English summary
    Now in film circles, SP Balasubrahmanyam and Ilayaraja controversy becomes big buzz. Some of the film celebrities expressed views on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X