» 

వర్మ కూడా అడిగారు కానీ... : సింగర్ సునీత

Posted by:

హైదరాబాద్ : హీరోయిన్ గా చేయమని మొదట ఎస్వీ కృష్ణారెడ్డిగారు అడిగారు. ఏ సినిమాకనేది తెలీదు. తర్వాత రామ్‌గోపాల్‌వర్మ కూడా అడిగారు. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చాయి. హీరోయిన్ అనేకాదు. స్పెషల్ క్యారెక్టర్లూ చేయమని అడిగారు అంటూ ప్రముఖ గాయని సునీత చెప్పుకొచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఆమె నటనా రంగంలోకి అడుగు పెట్టబోతోంది.

సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇప్పటి వరకు సినిమా తెరవెనక విభాగాల్లోనే తన సేవలు అందించిన సునీతా....త్వరలో తెరపైకి రాబోతోంది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న 'అనామిక' చిత్రం ద్వారా ఆమె నటిగా తెరంగ్రేటం చేయబోతున్నారు. అయితే ఆమె పూర్తి స్థాయి పాత్రలో నటించడం లేదు. 'అనామిక' ప్రమోషన్ సాంగులో మాత్రమే నటిస్తున్నారు.

ఇన్నాళ్లూ నటించటం పోవటానికి కారణం చెప్తూ... నాకు పాడటమే ఇష్టం. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పడం ఇష్టం. నాకు మానసిక సంతృప్తినిచ్చే ఈ రెండూ వదిలేసి, ఆర్టిస్ట్‌గా వెళ్లాలని ఏనాడూ అనుకోలేదు. కలలో కూడా ఆలోచించలేదు. మంచి యాక్టింగ్ ఆఫర్స్ వదిలేసుకున్నానని ఏనాడూ చింతించలేదు కూడా అంది.

మరి సునీత మున్ముందు తన నట ప్రస్తానాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి. అయితే విశ్లేషకులు మాత్రం సునీతకు ఉన్న టాలెంట్, అందం దృష్ట్యా ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని అంటున్నారు. 'అనామిక' సినిమా వివరాల్లోకి వెళితే....శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం హిందీలో విజయవంతమైన 'కహానీ' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. నయనతార టైటిల్ రోల్ చేస్తుండగా, హర్షవర్ధన్ రాణె, వైభవ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రం విడుదల కానుంది. నాణ్యమైన

Read more about: nayantara, sunitha, shekar kammula, anamika, ramgopal varma, నయనతార, శేఖర్ కమ్ముల, అనామిక, రామ్ గోపాల్ వర్మ
English summary
Singer, dubbing artist Sunitha who is also beautiful is all set to star in a film. Buzz is she will be seen in a special promo song in Sekhar Kammula's ‘Anamika’ starring Nayanatara.
Please Wait while comments are loading...