twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘s/o సత్యమూర్తి’ పబ్లిక్ టాక్ ఎలా ఉంది?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘s/o సత్యమూర్తి' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సినిమా విడుదల కావడంతో ఉత్కంఠకు తెరపడింది. సినిమాపై ముందు నుండి అంచనాలు భారీగా ఉన్నాయి.

    బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలో చూసిన ప్రేక్షకుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం......సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ మరోసారి తన సత్తా చూపించాడు. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు అదుర్స్ అంటున్నారు. ఇక సినిమాకు హైలెట్ క్లైమాక్స్ అని అంటున్నారు.

    Son of Satyamurthy Public Talk

    అయితే సరైన ప్లేసింగ్ లేని సాంగులు సినిమా ఫ్లోను తగ్గించాయని అంటున్నారు. కానీ పాటల చిత్రీకరణ మాత్రం అద్భుతంగా ఉందని అంటున్నారు. సినిమా కథ చాలా బావుందనే అభిప్రాయం ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి వినిపిస్తోంది. అయితే బన్నీని ఇప్పటి వరకు ఎనర్జిటిక్ గా చూసిన ప్రేక్షకులకు ఇందులోని స్లో స్క్రీన్ ప్లే అతనికి సెట్ కాలేదనే భావన కలుగింది. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్సుల పరంగా బన్నీ అదరగొట్టాడు. దేవిశ్రీ తన సంగీతం ప్రేక్షకులను సంతృప్తి పరిచాడు.

    ఈ చిత్రంలో అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు. సాంకేతిక వర్గం పి.ఆర్‌.వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

    English summary
    Son of Satyamurthy gets positive Public Talk, Trivikram’s entertainment was once again proved by this Movie. The dialogues are creating magic on screen. The director took special interest in chalking out a climax which is the major highlight of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X