» 

'మర్యాదరామన్న' హిందీ రీమేక్ టాక్

Posted by:

ముంబై : సునీల్ హీరోగా రాజమౌళి డైరక్ట్ చేసిన కామిడీ చిత్రం 'మర్యాదరామన్న'. ఈ చిత్రం హిందీలోకి 'సన్నాఫ్‌ సర్దార్‌' గా రీమేక్ చేసారు. అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటిస్తూ నిర్మించిన 'సన్నాఫ్‌ సర్దార్‌' దీపావళి కానుకగా మంగళవారం విడుదలైంది. మార్నింగ్ షో కే మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం పై మంచి రివ్యూలు వచ్చాయి. వాండెడ్, దబాంగ్,రౌడీ రాధోడ్ తరహాలో ఘన విజయం సాధించే అవకాసం ఉందని,కలెక్షన్స్ వర్షం కురుస్తుందని అంచనాలు వేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ . అశ్వినీ ధీర్‌ దర్శకత్వం వహించారు. సంజయ్‌ దత్‌ ఓ కీలక పాత్రలో నటించారు. సల్మాన్‌ ఖాన్‌ కూడా ఓ ప్రత్యేక గీతంలో నర్తించారు. చిత్రం గురించి అజయ్‌ దేవగణ్‌ చెబుతూ ''తెలుగులో వచ్చిన 'మర్యాదరామన్న' చిత్రం ఆధారంగా దీన్ని రూపొందించాం. అయితే కథలో కొన్ని మార్పుచేర్పులు చేశాం. తప్పకుండా ఉత్తరాది ప్రేక్షకులకు మా ప్రయత్నం నచ్చుతుంది. కథానాయకుడి పాత్ర ద్వారా వీలైనంత హాస్యం పండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తే సర్దార్‌జీని ఇందులో చూస్తారు'' అని వెల్లడించారు.

ఇక ఈ చిత్రం కథ లండన్ లో మొదలయ్య..తర్వాత పంజాబ్ విలేజ్ కి వస్తుంది. అక్కడ పంజాబి హౌస్ లో కథ మొత్తం జరుగుతుంది. ఈ చిత్రంతో అజయ్ దేవగన్ మళ్లీ తనదైన యాక్షన్ లోకి వచ్చాడంటున్నారు. అలాగే అగ్నిపధ్ చిత్రం తర్వాత సంజయ్ దత్ కెరీర్ లో సన్ ఆఫ్ సర్దార్ నిలిచిపోయే చిత్రం అని చెప్తున్నారు. ముఖ్యంగా అజయ్ దేవగన్ అభిమానలుకు ఈ చిత్రం పిచ్చపిచ్చగా నచ్చుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం విజయంతో మరిన్ని తెలుగు చిత్రాలకు హిందీ లో మార్కెట్ ఏర్పడే అవకాసం వచ్చినట్లైంది.

మరో ప్రక్క ఈ చిత్రానికి పోటీగా షారూఖ్ తాజాగా నటించిన చిత్రం 'జబ్‌ తక్‌ హై జాన్‌' విడుదలైంది. కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ హీరోయిన్స్. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. యశ్‌చోప్రా దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రమిదే కావడంతో అంచనాలు పెరిగాయి. ఆదిత్య చోప్రా నిర్మాత. ఇందులో ఆర్మీ అధికారి సమర్‌ ఆనంద్‌ పాత్రలో షారుఖ్‌ ఖాన్‌ నటించారు. మహిళా వ్యాపారవేత్త మీరా పాత్రలో కత్రినా కైఫ్‌, జర్నలిస్టు అకిరాగా అనుష్క శర్మ కనిపించారు. ఈ ముగ్గురి మధ్య జరిగే కథే 'జబ్‌ తక్‌ హై జాన్‌'. షారుఖ్‌ ఈ సినిమా గురించి చెబుతూ ''యశ్‌జీతో పనిచేయడం నాకెంతో సరదాగా అనిపించేది. రొమాన్స్‌ని ఆయన తెర మీద అద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఆయనతో ప్రేమకథ అంటే ఇక చెప్పనవసరం లేదు. తాజా చిత్రంలో ఆయన మార్కు చూడొచ్చు'' అన్నారు.

Read more about: son of sardhar, maryada ramanna, rajamouli, సన్ ఆఫ్ సర్దార్, మర్యాద రామన్న, రాజమౌళి
English summary
SON OF SARDAAR is for lovers of hardcore masala movies. If you liked WANTED, DABANGG and ROWDY RATHORE, chances are you will relish SON OF SARDAAR as well. The North Indian audiences in particular and those residing abroad will be simply delighted by this chatpata, masaledaar fare. A wholesome entertainer in the festive period.
Please Wait while comments are loading...