twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనాక్షి అనుష్కను డామినేట్ చేస్తుందంటున్నారు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘లింగా' చిత్రం ఆయన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, ఫోటోస్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి. ఈచిత్రంలో రజనీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి హీరోయిన్లుగా చేస్తున్నారు.

    ఇటీవల విడుదలై ట్రైలర్లు, ప్రమోలు చూస్తుంటే సినిమాలో అనుష్కను డామినేట్ చేసే విధంగా సోనాక్షి రోల్ ఉందని అంటున్నారు. సినిమాలో అనుష్క కంటే సోనాక్షి పాత్ర నిడివి ఎక్కువగా ఉండటంతో పాటు బెటర్ రోల్ ఆమెకే దక్కిందని అంటున్నారు. అందం పరంగా కూడా సోనాక్షికే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ‘లింగా' సినిమా తర్వాత సోనాక్షి సౌత్‍‌లో మరిన్ని అవకాశాలు దక్కించుకునే అవకావం ఉందని అంటున్నారు.

    Sonakshi Sinha dominates Anushka Shetty

    ఇటీవలే ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 165 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహహాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇండియాలోని అతి ఉత్తమమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రం మొదటి లుక్ విడుదలైనప్పటి నుండి రెస్పాన్స్ అదిరిపోతోంది.

    రజనీ-రవికుమార్ కాంబినేషన్ కూడా ఇంత క్రేజ్ పెరగడానికి మరో కారణం. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ముత్తు, అరుణాచలం, న‌ర‌సింహ చిత్రాలు ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే. మరి ఇపుడు ‘లింగా' చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టించబోతోందో చూడాలి.

    English summary
    “The promos of the film 'Lingaa', including trailers and two songs that have already been released have received a very good response, but when it comes to the female leads, it is Sonakshi Sinha who dominates Anushka in the film,” says the source
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X