twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మత వివాదం: గుండు కొట్టించుకుని సోనూ నిగమ్ సంచలనం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సంగర్ సోను నిగమ్ బుధవరాం గుండు చేయించుకుని మీడియా ముందుకొచ్చారు. తనకు గుండు చేస్తే రూ. 10 లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించిన ముస్లిం మత గురువును ఉద్దేశించి... ఇపుడు వచ్చి పది లక్షలు ఇస్తావా? మీడియా ముఖంగా ప్రశ్నించారు.

    కోల్ కతాకు చెందిన ఓ ముస్లిం మతగురువు సోను నిగమ్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండు కొట్టించి, చెప్పుల దండ వేసి ఊరేగించిన వారికి రూ. 10 లక్షలు బహుమతి ఇస్తానని పశ్చిమ బెంగాల్‌ మైనారిటీ యునైటెడ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు సయిద్‌ షా అతిఫ్‌ అలీ ఆల్‌ ఖ్వాద్రి ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే.

    వివాదం ఏమిటి?

    వివాదం ఏమిటి?

    ఈ వివాదానికి కారణం సోను నిగమ్ ఇటీవల ట్విట్టర్లో చేసిన కామెంట్స్. ‘అందరినీ దేవుడు చల్లగా చూడాలి. నేను ముస్లింని కాను. అయినా ఉదయాన్నే వినిపించే ఆజాన్‌ పిలుపుతో నిద్రలేవాలి. భారతదేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడు ముగుస్తుందో... ఇస్లాం మతాన్ని మహ్మద్ ప్రవక్త స్థాపించినపుడు కరెంటు లేదు. అప్పట్లో ఇలా మైకులో ఆజాన్ వినిపించడం లాంటివి ఏమీ లేవు. ఎడిసన్‌ బల్బును కనిపెట్టిన తర్వాతే గోల ఎందుకు? మతాన్ని అనుసరించని వారిని ఉదయాన్నే ధ్వనులతో నిద్రలేపే ఆలయాలు, గురుద్వారాలను నేను నమ్మను..... ఇలా వారికి మతానికి సంబంధం లేని వారిని... ఇలా శబ్దాలతో బలవంతంగా ఎవరు నిద్రలేపినా ఇది గుండా గిరి అవుతుంది.... అని సోనూ నిగమ్ ట్వీట్ చేసారు.

    నా ట్వీట్స్ మతం గురించి కాదు అన్న సోను

    నా ట్వీట్స్ మతం గురించి కాదు అన్న సోను

    నేను సెక్యూలర్ పర్సన్. నేను చేసిన ట్వీట్స్ మతం గురించి కాదు. లౌడ్ సౌండ్ పెట్టడం గుండాగిరి అని నేను ఆ ట్వీట్స్ చేసాను అని సోను నిగమ్ అన్నారు.

    ఈ దేశంలో ఏం జరుగుతోంది

    ఈ దేశంలో ఏం జరుగుతోంది

    అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది? ఎవరు ఎవరిపైన అయినా దాడి చేయొచ్చా...ఎవరు ఎవరిపైన అయినా ఫత్వా జారీ చేయొచ్చా. ఏ మతానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. తన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు తనకు ఉంది. అభివృద్ది చెందుతున్న సమాజంలో మనము ఉన్నాము, ఇంకా ఫత్వాలు జారీ చేయడమేంటని సోను నిగమ్ ప్రశ్నించారు.

    హాట్ టాపిక్

    హాట్ టాపిక్

    తన ట్వీట్స్ వల్ల ప్రారంభం అయిన ఈ వివాదం.... మరింత పెద్దది కాకుండా సోను నిగమ్ స్వయంగా గుండు గీయించుకుని వచ్చి, ఈ దేశంలో నెలకొన్న పరిస్థితులపై నిరసన వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయింది.

    English summary
    Sonu Nigam shaved his head on Wednesday in response to a call given by a Kolkata-based cleric, who announced a reward of Rs 10 lakh to anybody who tonsured the Bollywood singer and garland him with old shoes, after his complaint on Twitter about being woken up by azaans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X