twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలుతో ఇళయరాజా ఢీ.. వివాదం వెనుక అసలు కారణం ఇదే!

    సంగీత సామ్రాజ్యంలో రారాజులైన ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం మధ్య వివాదం మీడియాలో చర్చనీయాంశమైంది.

    By Rajababu
    |

    సంగీత సామ్రాజ్యంలో రారాజులైన ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం మధ్య వివాదం మీడియాలో చర్చనీయాంశమైంది. ఇద్దరూ దిగ్జజాలు కావడంతో సినీ ప్రముఖులు తటస్తంగా ఉంటూ జాగ్రత్త వహిస్తున్నారు. ఈ వివాదంలో బాలుతే తప్పని కొందరు పైకి చెప్పకపోయినా లోలోనా అనుకొంటున్నారు. బాలు వ్యవహరశైలి కారణంగానే ఇళయరాజా అలా ప్రవర్తించాల్సి వచ్చిందని లయరాజుపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

    వివాదానికి కారణం సంగీత కచేరి రేటు

    వివాదానికి కారణం సంగీత కచేరి రేటు

    ఇంతకీ బాలు, ఇళయరాజా మధ్య వివాదానికి సంగీత కచేరికి ఎస్పీబీ చెప్పిన రేటు అట. గతేడాది అమెరికాలో ఇళయరాజా అమెరికాలో భారీగా కచేరిలు ప్లాన్ చేశాడు. ఆ క్రమంలో ఆర్గనైజర్లు బాలును సంప్రదించారు. బాలు చెప్పిన రేటుతో నిర్వాహకులకు దిమ్మతిరిగిందట. ఆ మొత్తం ఇళయరాజా జోరు కొనసాగుతున్నప్పుడు తీసుకొన్న మొత్తానికి ఎక్కువేనట. దాంతో రేటుపై బేరసారాలాడటం ఇష్టం లేక కొత్త గాయకులతో ఇళయరాజా పనికానిచ్చారట.

    బాలు డిమాండ్ చేసిన రేటు

    బాలు డిమాండ్ చేసిన రేటు

    ప్రస్తుతం ఈటీవీ షోలతో బిజీగా మారిన నేపథ్యంలో తన కుమారుడు చరణ్‌తో విదేశాల్లో ఎస్పీబీ50 పేరుతో కచేరీకి ప్లాన్ చేశాడట. ఈ విషయం ఇళయరాజా చెవిన పడటం, గతేడాది బాలు డిమాండ్ చేసిన రేటు గుర్తుకు రావడంతో తన పాటలను పాడటానికి వీలు లేదని లీగల్ నోటీసులు పంపించాడు. దీంతో ఇళయరాజా, బాలు మధ్య వివాదానికి కారణమైంది.

    కొత్తగా లేవనెత్తలేదు.

    కొత్తగా లేవనెత్తలేదు.

    ఇళయరాజా ఈ రాయల్టీ అంశాన్ని కొత్తగా లేవనెత్తలేదు. పైగా ఇంత మొత్తంలో రాయల్టీ చెల్లించాలని ఆయన డిమాండ్ చేయడం లేదు. ఎంత ఇస్తే అంత తీసుకోవడానికి ఇళయరాజా సుముఖంగా ఉన్నాడు అని చెన్నైకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

    కాపీరైట్ చట్టంలో

    కాపీరైట్ చట్టంలో

    మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, నిర్మాత, గాయకుల్లో గీత రచయిత, సంగీత దర్శకుడికి ఎక్కువ మొత్తం చెల్లించాలనే నిబంధన కాపీరైట్ చట్టంలో ఉన్నట్టు సమాచారం. దానిని ఆధారంగా చేసుకొనే బాల సుబ్రమణ్యంకు ఇళయరాజా నోటీసులు పంపినట్టు సమాచారం.

    సెన్సేషనలైజ్ చేయవద్దు

    సెన్సేషనలైజ్ చేయవద్దు

    ఈ వివాదం మీడియాలో నలుగుతున్న నేపథ్యంలో ఎస్పీ బాలు స్పందించారు. ఈ విషయంపై నేరుగా నాతో మాట్లాడితే ఇంతవరకు రాకపోయేది. ఆయన లీగల్ నోటీసులు పంపించారు కాబట్టి ఇళయరాజాకు లీగల్ గానే సమాధానం చెప్తాను. అప్పటివరకు స్నేహితులకు, సంగీత ప్రియులకు, ముఖ్యంగా మీడియా పర్సన్ ఈ వివాదాన్ని సెన్సేషనలైజ్ చేయవద్దు. మా ఇద్దరి మధ్య ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం అని బాలు రిక్వెస్ట్ చేశారు.

    English summary
    Legendary Telugu playback singer SP Balasubramaniam, who has unfortunately embroiled in a controversy involving music maestro Ilayaraja, has requested media, music lovers and fans not to sensationalize the issue. Playback singer SP Balasubramaniam (Balasubrahmanyam/SPB) says that music maestro Ilayaraja should have talked to him before sending him a legal notice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X