» 

మహేష్‌బాబు నన్ను ఎత్తుకున్నాడు...మర్చిపోను

Posted by:

హైదరాబాద్ : హీరో మహేష్‌బాబంటే చచ్చేంత ఇష్టం. నేను బాలనటిగా ఉన్నప్పుడు 'యువరాజు'లో చేశా. అందులో ఓ సన్నివేశంలో మహేష్‌బాబు నన్ను ఎత్తుకుంటాడు. ఇప్పటికీ నేను ఆ సన్నివేశాన్ని మర్చిపోను అంటోంది శ్రీదివ్య. ఆమె నటించిన 'మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు' చిత్రం ప్రమేషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.

ఇక హీరోయిన్‌ అయ్యాక ఒక్కసారి కూడా మహేష్‌బాబుని నేరుగా కలిసే అవకాశం రాలేదు. వస్తే అతను పోల్చుకుంటాడో లేదో మరి. యువరాజు, వీడే, హనుమాన్‌ జంక్షన్‌ ఇలా పది సినిమాలలో బాలనటిగా చేశా. సినిమాల కోసం అవుట్‌డోర్‌ వెళ్లాల్సి ఉంటుంది. చదువుకి ఆటంకమని చెప్పి అమ్మానాన్న సినిమాలు వద్దన్నారు. దాంతో సీరియళ్లు మాత్రమే చేశా అంటూ చెప్పుకొచ్చింది.

తను పద్నాలుగేళ్లకే... హీరోయిన్ గా చేసానని చెప్తూ... నేను మొదట హీరోయిన్‌గా నటించింది ఈటీవీలో ప్రసారమైన 'తూర్పు వెళ్లే రైలు' సీరియల్‌లో. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. అప్పటికే సినిమాలు తప్ప సీరియళ్లలో ఇక చేయకూడదని నిర్ణయించుకున్నా. అయితే ఆ సీరియల్‌ నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డిగారు అడగడంతో ఒప్పుకున్నా. సినిమాలో అవకాశం వస్తే మాత్రం నటించడం మానేస్తానని ముందే చెప్పా అంది.


తన మొదట సినిమా గురించి వివరిస్తూ... నేను పదో తరగతిలో ఉండగా రవిబాబుగారి దగ్గర నుంచి కబురొచ్చింది. ఆడిషన్‌కి వెళ్లగానే కేరళ అమ్మాయి వేషాన్ని నాకు వేశారు. ఏదైనా నటించి చూపించమన్నారు. నాకప్పటికే 'రవిబాబు చాలా సీరియస్‌, కోపం ఎక్కువ. జాగ్రత్త' అంటూ కొందరు చెప్పడంతో ఆయన ముందు చాలా భయపడ్డా. ఏదైనా నటించి చూపించమంటే అస్సలు నటించలేదు. అయినా ఆయన నన్నే ఎంపిక చేశారు. అలా 'మనసారా' మీ ముందుకి వచ్చా.

ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా నాకు మాత్రం మంచి పేరునీ, గుర్తింపునీ తెచ్చిపెట్టింది.దర్శకుడు మారుతిగారు మనసారాలో నన్ను చూసి 'ఈ రోజుల్లో' సినిమాలో చేయమని అడిగారు. అయితే అప్పటికే నేను 'నగర పురం' అనే తమిళ సినిమా చేస్తుండడంతో ఒప్పుకోలేకపోయా. అయినా ఆయన తరవాత సినిమా 'బస్టాప్‌'లో అవకాశం ఇచ్చారు. 'ఈ రోజుల్లో' కూడా చేసుంటే నా హిట్‌ సినిమాల జాబితాలో మరోటి కలిసేదేమో అంది.

Read more about: sri divya, manasara, bus stop, mahesh babu, శ్రీదివ్య, మనసారా, బస్ స్టాఫ్, మహేష్ బాబు
English summary
Sri Divya is suddenly busy with two films. She had done Manasara directed by Ravi Babu and Nagarpuram, a Tamil movie by a debutant Parthasarathy. She is currently waiting for the release of Kattu Malli again directed by a newcomer.
Please Wait while comments are loading...