twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆగడు' ఫ్లాఫ్ గురించి శ్రీను వైట్ల ఏమంటారంటే

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు కెరీర్ లో పెద్ద డిజాస్టర్ గా మిగిలిన చిత్రం 'ఆగడు' . ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల డైరక్ట్ చేసారు. ఆ చిత్రం ఫ్లాఫ్ అవటంపై ఆయన ఇప్పుడు బ్రూస్ లీ రిలిజ్ సమయంలో మాట్లాడారు. తను ఆగడు ఫ్లాఫ్ నుంచి చాలా నేర్చుకున్నాను అన్నారు. అది తన కెరీర్ లో పెద్ద పాఠం అని చెప్పుకొచ్చారు.

    శ్రీను వైట్ల ఏమన్నారంటే... రెండురకలా ఫిల్మ్ మేకింగ్ లు ఉంటాయి. ఒకటో రకం... మంచి కథ తీసుకుని దానికి ఎంటర్టైన్మెంట్ అద్దుకుంటూ వెళ్ళటం. రెండో రకం...ఎంటర్ట్నైంట్ నే మెయిన్ ఆబ్జెక్టు గా పెట్టుకుని, దాని చుట్టూ కథ అల్లటం. నేను రెండు పద్దతులూ ఫాలో అయ్యాను. ఆగడు..రెండో కేటగిరికు చెందినది. నేను ఎప్పుడు కుటుంబ భావోద్వేగాలు కథలో భాగమైతే సినిమా హిట్టవుతుందని భావిస్తాను. ఆగడులో ఫ్యామిలీ ఎమోషన్స్ మిస్సయ్యాయి.

    అలాగే... "నేను ఆగడు నుంచి చాలా నేర్చుకున్నాను. మనం ఫ్లాఫుల నుంచే నేర్చుకోగలం. అవి మనకు మంచి అనుభవాన్ని ఇస్తాయి. అయితే నేను దాన్ని హృదయానికి తీసుకోలేదు. హిట్స్, ఫ్లాపులు అనేది ఇండస్ట్రీలోజర్నీలో ఓ పార్ట్ మాత్రమే ," అన్నారు.

    ఇక " బ్యాడ్ టాక్ అంటారా..జనాలు ఆగడు తో చాలా డిజప్పాయింట్ అయ్యారు. చాలా మంది మిగతా మేకర్స్ నా ఫార్మెట్ నే ఫాలో అయాయారు. దావి మీద వాళ్లు వర్కవుట్ చేసి హిట్స్ కొట్టారు కూడా. దాంతో చాలా సార్లు ఈ ఫార్మెట్ నే వాడటంతో వెక్స్ అయ్యిపోయారు. అయితే నాకు ఈ విషయం ఆగడు తర్వాతే తెలిసింది. దాంతో నా తదుపరి చిత్రాల ప్రెజెంటేషన్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను ." అన్నారు.

    Sreenu Vaitla about Aagadu flop

    శ్రీను వైట్ల తాజా చిత్రం ‘బ్రూస్ లీ' విషయానికి వస్తే..

    రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ది ఫైటర్‌' అనేది ట్యాగ్ లైన్. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 16 న విడుదల చేయాటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజే సెన్సార్ పూర్తి చేసారు.

    నిర్మాత మాట్లాడుతూ ''బ్రూస్‌లీకి వీరాభిమాని అయిన ఓ యువకుడి కథ ఇది. తనకు ఎదురైన ఓ సమస్యపై ఎలా పోరాటం చేశాడన్నది తెరపైనే చూడాలి. వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. రామ్‌చరణ్‌ చేసే యాక్షన్‌, డ్యాన్సులు అభిమానుల్ని అలరించేలా ఉంటాయి. ఇటీవల విడుదలైన 'లే చలో...' పాటకి మంచి స్పందన లభిస్తోంది. చిత్రాన్ని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.

    "వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.

    ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    "I learnt a lot from Aagadu. In fact, we should learn more from flops. They give us good experience. However, I didn't take it to my heart. Hits and flops are part and parcel of the industry," said Vaitla.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X