twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బ్రహ్మోత్సవం’ చూసి బాధతో రాసిన ఓపెన్ లెటర్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బ్రహ్మోత్సవం సినిమా చూసిన వారంతా ఏదో ఒకరకంగా తమ అసహనాన్ని వెల్లగక్కుతున్నారు. సినిమా అభిమానులు సైతం ఊహించనంత దారుణంగా ఉండటమే ఇందుకు కారణమని వారి ఫ్రస్టేషన్ చూస్తే స్పష్టమవుతుంది. కొందరు అభిమానులైతే సోషల్ మీడియా ద్వారా ఓపెన్ లెటర్స్ పోస్టు చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాదు.... శ్రీకాంత్ అడ్డాల అభిమానులు కూడా సినిమా చూసిన అనంతరం తమలోని వేదనను వెల్లగక్కుతున్నారు.

    శ్రీకాంత్ అడ్డాలకు ఓ అభిమాని రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే పేరు లేకుండా ఉన్నఈ లేఖను సోషల్ మీడియా ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా షేర్ చేస్తుండటంతో వైరల్ లా వ్యాపించింది. ఆ లేఖపై మీరూ ఓ లుక్కేయండి.

    Srianth Addala Fan Writes An Open Letter

    శ్రీకాంత్ అడ్డాల గారికి...
    మీ సినిమాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చాలా పార్ట్ తమిళనాడులో తీసి కూడా, రేలంగిలోనే తీసిన నాచురల్ ఫీల్ తీస్కొచ్చిన గొప్ప డైరెక్టర్ మీరు. ప్లాప్ అయినప్పటికీ మీ 'ముకుంద' సినిమా నుండి నేను చాలా తెలుసుకున్నా. ముఖ్యంగా రావు రమేష్ గారికి మీరు రాసిన డైలాగ్స్, హీరోకి ఉన్న కమిట్మెంట్ బాగా నచ్చాయి. మీ సినిమాలు చూసి 'మీ గోదావరి జిల్లాల్లో మనుష్యులు అంత ఆప్యాయంగా ఉంటారా? అక్కడ అంత మంచితనం, వెటకారం ఉంటాయా? ఒకసారి రావాలి' అని నాతో అన్నవాళ్లు ఎంతో మంది. స్వతహాగా గోదావరి జిల్లా వాడిని అవ్వడం వలన, నాకు మీరన్నా మీ సినిమాలన్నా చాలా ఇష్టం, గౌరవం...

    అలాంటి మీరు మహేష్ తో కచ్చితంగా మంచి సినిమా తీస్తారని అనుకున్నా. 'బ్రహ్మోత్సవం'..మీరు సెలెక్ట్ చేసుకున్న పాయింట్ చాలా బావుంది... సినిమా స్టార్ట్ అవ్వక ముందు మీరు ఫుల్ స్క్రిప్టుతో షూటింగ్ స్టార్ట్ చెయ్యలేదని విన్నాము. సినిమా చూస్తే అది నిజం అని నమ్మక తప్పట్లేదు. ఒక్క ఇంటర్వెల్ ఎపిసోడ్ తప్ప ఎమోషన్ క్యారీ చేసే ఒక్క సీన్ కూడా నాకు కనిపించలేదు. మహేష్ మార్క్ కనిపించిన సీన్ కూడా అదొక్కటే. సినిమాలో అంతమంది ఉండేసరికి సాధారణ ప్రేక్షకుడికి ఎవరు ఎవరికి ఏమవుతారో కూడా అర్థం కాని పరిస్థితి. సినిమా గురించి విశ్లేషిస్తూ నేనేమీ చెప్పను....మీరు పడిన కష్టం, శ్రమ, మీకు... మీ టీంకి మాత్రమే తెలుసు కాబట్టి. కానీ ప్రపంచానికి మీ కష్టంతో పని లేదు..మహేష్ సినిమా హిట్టా? ఫట్టా? ఎంత పోయింది? అంతే.. కనీసం 'ముకుంద'లా కొంచెం కామెడీ పెట్టి ఒక సాధారణ సినిమా తీసినా బాగా కనెక్ట్ అయ్యేది. ఇపుడు కూడా మీరంటే నాకు కోపం లేదు సర్. కానీ నా ఫేవరెట్ హీరో, డైరెక్టర్ చేసిని సినిమా ఇంత ప్లాప్ అయ్యిందని బాధ ఎక్కువగా ఉంది.

    ఇట్లు
    -మీ అభిమాని

    English summary
    Post the debacle of Mahesh Babu's Brahmotsavam, we are seeing an unexpected uproar from every corner. Besides the heavy pour of trolls on the actor and the film from the 'anti-fans', Mahesh Babu fans are also frustrated with their idol and are using the social media platforms to reach out to their star.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X