twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి సినిమాపై అంచనాలు మరింత పెంచింది (‘మామ్ ’ ట్రైలర్ 2)

    శ్రీదేవి త్వరలో 'మామ్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి రవి ఉడయార్ దర్శకత్వం వహిస్తున్నారు.

    By Bojja Kumar
    |

    ముంబై: ప్రముఖ నటి శ్రీదేవి త్వరలో 'మామ్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. తాజాగా రెండో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

    రవి ఉడయార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో జులై 7న విడుదల కాబోతోంది. ఒకప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమను తన అందంతో షేక్ చేసిన శ్రీదేవి... నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన ఇద్దరు కూతుళ్ల పెంపకంపైనే దృష్టి పెట్టిన శ్రీదేవి... 2012లో గౌరీ షిండే దర్శకత్వంలో 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

    సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న శ్రీదేవి 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తీసుకుని 'మామ్' సినిమా చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే 'మామ్‌' లో శ్రీదేవికి భర్తగా నటించే వ్యక్తిని జాన్వి కపూర్ సెలెక్ట్ చేసిందట. 2007లో విడుదలైన 'ఎ మైటీ హార్ట్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో ఏంజెలినా జోలీ సరసన నటించిన అద్నన్‌ సిద్ధిఖి అయితే శ్రీదేవికి కరెక్ట్‌ జోడీ అని గుర్తించిన కూతురు జాన్వి కపూర్‌ ఈ విషయాన్ని తండ్రి, ప్రొడ్యూసర్‌ అయిన బోనీకపూర్‌ దృష్టికి తీసుకెళ్ళడం, అతను ఓకే అనడం, అద్నన్‌ని టెస్ట్‌కి పిలిపించడం జరిగిపోయింది.

    అద్నన్‌ సిద్ధిఖి లుక్‌ టెస్ట్‌ చేసిన తర్వాత జాన్వి సెలెక్షన్‌ కరెక్ట్‌ అని శ్రీదేవి సరసన నటించేందుకు అద్నన్‌ సిద్ధిఖీనే ఎంపిక చేశారు నిర్మాత బోనీకపూర్‌, దర్శకుడు రవి ఉద్యవార్‌. అప్పటి వరకు ఆ క్యారెక్టర్‌ ఎవర్ని సెలెక్ట్‌ చెయ్యాలా అని ఆలోచిస్తున్న యూనిట్‌కి జాన్వి పరిష్కారం చూపించింది. అలా శ్రీదేవికి జోడీని సెలెక్ట్‌ చేయడంలో జాన్వి కపూర్‌ వార్తల్లోకి ఎక్కింది.

    శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

    ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి, ఎడిటింగ్‌: మోనిసా బల్‌ద్వా, కథ: రవి ఉద్యవార్‌, గిరీష్‌ కోహ్లి, కోన వెంకట్‌, స్క్రీన్‌ప్లే: గిరీష్‌ కోహ్లి, నిర్మాతలు: బోనీ కపూర్‌, సునీల్‌ మన్‌చందా, నరేష్‌ అగర్వాల్‌, ముఖేష్‌ తల్‌రేజా, గౌతమ్‌ జైన్‌, దర్శకత్వం: రవి ఉద్యవార్‌.

    English summary
    Nobody knows what a Mom is feeling. In our everyday lives, do we truly realize the importance of the role a mother plays in our lives? From our childhood, they are our safe haven, our solace and our one source for instant happiness. Mom, the film portrays the journey of a mother as she fights between two wrongs, all to protect her daughter and the rest of her family. All is fair in love and war...and when you're a mother. MOMTheFilm is directed by Ravi Udyawar. Music is by the maestro A. R. Rahman. In cinemas 7th July.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X